Top Selling SUVs in November 2024: భారతీయ ఆటో విభాగంలో ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ప్రతి నెలా లక్షల వాహనాలు అమ్ముడవుతున్నాయి. రికార్డు స్థాయిలో అమ్ముడుపోయే కొన్ని ఎస్‌యూవీలు కూడా ఇందులో ఉన్నాయి. వీటిలో హ్యుందాయ్ క్రెటా నంబర్ వన్ ప్లేస్‌లో ఉంది. ఈ ఎస్‌యూవీ అమ్మకాల పరంగా తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. అలాగే టాప్-1 స్థానాన్ని కూడా సాధించింది.
2024 నవంబర్‌లో హ్యుందాయ్ క్రెటా మొత్తంగా 15,452 యూనిట్లను విక్రయించింది. 2023 నవంబర్‌లో ఇదే సంఖ్య 11,814 యూనిట్లుగా ఉంది. ఈ విధంగా క్రెటా గతేడాదితో పోలిస్తే 31 శాతం భారీ వృద్ధిని సాధించింది.
తర్వాతి స్థానాల్లో ఇవే...గత నెలలో మొత్తం 15,435 యూనిట్లు అమ్ముడుపోయిన టాటా పంచ్ అమ్మకాల పరంగా రెండో స్థానంలో ఉంది. 2023 నవంబర్ అమ్మకాల గురించి మాట్లాడితే ఇది 14,383 యూనిట్లు. ఈ విధంగా టాటా పంచ్ ఏడు శాతం స్వల్ప పెరుగుదలను సాధించింది. ఈ జాబితాలో టాటా నెక్సాన్ మూడో స్థానంలో ఉంది. 2024 నవంబర్‌లో ఈ కారు 15,329 యూనిట్లు అమ్ముడుపోయింది. గత ఏడాది ఇదే నెలలో ఈ సంఖ్య 14,916 యూనిట్లుగా ఉంది.
మారుతి సుజుకి బ్రెజా అమ్మకాల సంఖ్యలో పుంజుకుని నాలుగో స్థానంలో ఉంది. గత నెలలో బ్రెజాకు సంబంధించి మొత్తం 14,918 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇది 2023 నవంబర్‌లో అమ్ముడుపోయిన యూనిట్ల కంటే 11 శాతం ఎక్కువగా ఉంది. మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఐదో స్థానం దక్కించుకుంది. ఇది గేమ్ ఛేంజర్ ఎస్‌యూవీ అని పేరు సంపాదించింది. గతేడాది నవంబర్‌లో ఫ్రాంక్స్ 14,882 యూనిట్లు అమ్ముడుపోయింది.
Also Read: నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
హ్యుందాయ్ క్రెటా ఇంజిన్ ఇలా...ఎస్‌యూవీ సేల్స్‌లో నంబర్ వన్‌లో ఉన్న హ్యుందాయ్ క్రెటా మూడు ఇంజన్ వేరియంట్‌లతో మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ కారులో 1.5 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, 1.5 లీటర్ టర్బో ఛార్జ్డ్ పెట్రోల్ ఇంజన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. అప్‌డేటెడ్ క్రెటాలో 6 స్పీడ్ మాన్యువల్, ఇంటెలిజెంట్ వేరియబుల్ ట్రాన్స్‌మిషన్ (IVT), 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ (DCT), 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు ఉన్నాయి.
భారతదేశంలో హ్యుందాయ్ క్రెటా ధర ఎంత?హ్యుందాయ్ క్రెటాలో ADAS, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, బ్లైండ్ వ్యూ మానిటర్, 360 డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, అదనపు భద్రతా ఫీచర్లు ఉన్నాయి. హ్యుందాయ్ క్రెటా ఎక్స్ షోరూమ్ ధర రూ. 13.24 లక్షల నుంచి మొదలై రూ. 24.37 లక్షల వరకు ఉంది.
Also Read: రోజుకి 1000 బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న కొత్త డిజైర్ - ధర అంత తక్కువా?