Price Hike on Hyundai Cars in 2024: హోండా కార్స్ ఇండియా తన వాహనాల ధరలను కొత్త సంవత్సరం అంటే 2023 జనవరి నుంచి పెంచనుంది. దీని ప్రభావాన్ని తగ్గించేందుకు కంపెనీ పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులను కారణంగా పేర్కొంది. అయితే హ్యుందాయ్ ఇండియా ఏ మోడల్‌పై ఎంత ధరను పెంచుతుందో ఇంకా వెల్లడించలేదు. ఇది తెలియాల్సి ఉంది.


హ్యుందాయ్ ఎలివేట్ ధర
హోండా ఇటీవల తన మైక్రో ఎస్‌యూవీ ఎలివేట్‌తో దేశీయ మార్కెట్లో అత్యంత పోటీ ఉన్న విభాగంలోకి ప్రవేశించింది. హ్యుందాయ్ ఎలివేట్ ఎస్‌యూవీ సెప్టెంబర్‌లో రూ. 11 లక్షల ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధరతో లాంచ్ అయింది.


హ్యుందాయ్ కారు సేల్స్ రిపోర్ట్
నవంబర్‌లో హ్యుందాయ్ దేశీయ మార్కెట్లో 8,734 యూనిట్లను విక్రయించింది. ఇది 2022 నవంబర్‌లో విక్రయించిన 7,051 యూనిట్ల కంటే 22 శాతం ఎక్కువ. దీంతో పండుగ సీజన్‌లో ఎలివేట్‌ ఎస్‌యూవీకి విపరీతంగా డిమాండ్ పెరిగింది.


మరిన్ని కంపెనీలు కూడా
మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, ఆడి ఇండియా వంటి ఇతర ఆటోమేకర్లు కూడా కొత్త సంవత్సరం ప్రారంభంలో తమ ప్యాసింజర్ వాహనాల ధరలు పెరుగుతాయని సూచించాయి.


మరోవైపు హ్యుందాయ్ తన ప్రీమియం ఎస్‌యూవీ 2024 టక్సన్ ఫేస్‌లిఫ్ట్‌ను అప్‌డేటెడ్ డిజైన్‌తో పరిచయం చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టక్సన్ భారతీయ మార్కెట్లో చాలా కాలం నుంచి ఉంది. ఇప్పుడు దీని కొత్త అప్‌డేటెడ్ తాజా మోడల్ వచ్చే ఏడాది భారతదేశంలోకి రానుంది. అంటే 2024లో మనం కొత్త టక్సన్ చూడవచ్చన్న మాట. అప్‌డేట్ చేసిన ఇంటీరియర్‌తో పాటు ఫ్రంట్ డిజైన్‌లో మార్పులు చేశారు. ఇవి కాకుండా డిజైన్ పరంగా పెద్ద అప్‌డేట్‌లు ఏమీ లేవు.


కారు ముందు భాగంలో పారామెట్రిక్ గ్రిల్‌ను రివైజ్ చేశారు. ఇది బంపర్‌కు మరింత మస్కులర్ లుక్ వచ్చింది. అలాగే మందపాటి స్కిడ్ ప్లేట్‌ను కూడా ఈ కారులో అందించారు. హ్యుందాయ్ టక్సన్ 2024లో బంపర్ లుక్ మరింత యాంగులర్‌గా ఉంటుంది. దీని ఎడ్జెస్ కూడా చాలా క్లీన్‌గా ఉంటాయి. కొత్త అల్లాయ్ వీల్ డిజైన్, మందమైన క్లాడింగ్‌తో కారు పక్కభాగంలో కూడా డిజైన్ అప్‌డేట్ చేశారు.


మరోవైపు హ్యుందాయ్ పెద్ద గ్లోబల్ మోడల్ ఎస్‌యూవీని పోలి ఉండే కర్వ్డ్ ట్విన్ స్క్రీన్ డిస్‌ప్లేతో ఈ కారు ఇంటీరియర్‌లో మార్పులు చేశారు. కొత్త లుక్ ఉన్న స్టీరింగ్ వీల్, కొత్త బటన్ డిజైన్‌తో కొత్త లుక్ సెంటర్ కన్సోల్ లేఅవుట్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఈ కారు హాప్టిక్ కంట్రోల్స్‌ను కూడా కలిగి ఉంది. అయితే వెదర్ కంట్రోల్ కోసం ఫిజికల్ బటన్లు కూడా అందించారు. ఫుల్లీ వైడ్ ఎయిర్‌కాన్ వెంట్‌లు కూడా చాలా మార్చారు. ఇప్పుడు క్యాబిన్ అంతా మరింత ప్రీమియం లుక్‌తో యూజర్ ఫ్రెండ్లీగా ఉంది.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply


Also Read: సూపర్ హిట్ టయోటా కామ్రీ అప్‌డేటెడ్ వెర్షన్ త్వరలో - ఈసారి హైబ్రిడ్ ఇంజిన్‌తో!


Also Read: లాంచ్‌కు రెడీ అవుతున్న కొత్త స్విఫ్ట్ - సరికొత్త ఇంజిన్, సూపర్ లుక్‌తో!