Jagadhatri Serial Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో కౌషికి ఇంటికీ రాగా అక్కడ పోలీసులను చూసిన మాధురి కంగారు పడుతుంది. పోలీసులు మాధురిని ఇలా ప్రశ్నిస్తారు.. 


పోలీసు: నిన్న రిసార్ట్ కి వెళ్ళారా?


మాధురి: వెళ్లాను.


ధాత్రి: ఎందుకు అంత ప్రత్యేకించి అడుగుతున్నారు.


పోలీసు : నిన్న అక్కడ హత్య జరిగింది.


మాధురి: కంగారుగా ఆ హత్య నేను చేయలేదు జస్ట్ పార్టీకి వెళ్లి వచ్చేసాను అంతే అని నోరు జారుతుంది.


పోలీసు: అంటే అక్కడ హత్య జరిగిందని మీకు ముందే తెలుసా? అయినా మీరు హత్య చేశారని నేను చెప్పలేదే అని అనుమానంగా అడుగుతాడు.


కంగారులో అలా మాట్లాడింది అని మాధురిని వెనకేసుకొస్తుంది ధాత్రి.


పోలీస్: హత్య జరిగిన వ్యక్తికి, ఈ అమ్మాయికి కామన్ కాంటాక్ట్స్ ఉన్నాయి. అందుకే సస్పెక్టెడ్ గా అనుమానిస్తున్నాము. ఫోరెన్సిక్ లాబ్ నుంచి ఆధారాలు వచ్చాక అవసరమైతే అరెస్టు చేస్తాం.


కౌషికి: ఆ ప్లేస్ లో ఉన్నంత మాత్రాన తను హత్య చేసినట్లేనా? నా చెల్లెలు ఎప్పుడూ అలా చేయదు.


పోలీసు: అలా అయితే మంచిదే కానీ ముందుగా మిమ్మల్ని హెచ్చరించడానికి వచ్చామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.


అలాంటి ప్లేస్ కి ఎందుకు వెళ్లావు, నీవల్ల ఇంటికి పోలీసులు వచ్చారు అంటూ మాధురిని కుటుంబ సభ్యులందరూ మందలిస్తారు. మాధురి అక్కడి నుంచి తన రూమ్ కి వెళ్ళిపోతుంది. ఆమె రూమ్ కి వెళ్ళిన ధాత్రి దంపతులు నిజం చెప్పమని, నిజం చెప్తే ఎలా సేవ్ చేయాలో ఆలోచిస్తామని చెప్పడంతో జరిగిందంతా ఏడుస్తూ చెప్తుంది మాధురి.


కేదార్: ఇంత బాధని మనసులో పెట్టుకొని రాత్రంతా ఎంత భయపడ్డావో. ఈ అన్నయ్యకి చెప్పవచ్చు కదా, అయినా ఏం భయపడకు, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ అన్నయ్యకి ఫోన్ చెయ్..


ధాత్రి : మీ అన్నయ్యకు తెలిసిన పోలీసు ఆఫీసర్ ఉన్నారు అతనితో మాట్లాడి అసలు విషయం కనుక్కుని వస్తాము అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతారు.


వాళ్లు కిందికి వచ్చేటప్పటికి కిందన ఇదే విషయంగా డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి.


మాధురి తండ్రి: మన కంపెనీ లాయర్లతో చెప్పి అలర్ట్ గా ఉండమని చెబుదామా అని కౌషికిని అడుగుతాడు.


కౌషికి: వద్దు బాబాయ్, ఈ విషయం గాని దివ్యాంకకి తెలిసిందంటే మన పరువుని మీడియాకెక్కిస్తుంది.


అప్పుడే కేదార్ మాకు స్కూలుకు టైం అవుతుంది మేము వెళ్తాం అని అంటాడు.


నిషిక: ఇంతమంది ఇంత కంగారు పడుతుంటే మీరు స్కూల్ కి వెళ్తాను అంటారేంటి ఇప్పుడు స్కూల్ కి వెళ్లకపోతే ఏంటి నష్టం.


కౌషికి : నిషి ఎవరి పనులు వారివి వెళ్ళనివ్వు అని మందలించటంతో కేదార్ వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరుతారు. నేరుగా రిసార్ట్ దగ్గరికి వెళ్లేసరికి అక్కడ భరత్ ఉంటాడు.


ధాత్రి : నువ్వు భరత్ కదా.


భరత్ : అవును, మాధురి మిమ్మల్ని కలుసుకోమంది అంటూ వాళ్ళిద్దర్నీ లోపలికి తీసుకువెళ్తాడు.


ధాత్రి మేనేజర్ ని ఎంక్వయిరీ చేస్తూ ఉంటే అక్కడే ఉన్న రెడ్డి వాళ్లని అడ్డుకుంటాడు.


ధాత్రి : మేము ఎంక్వయిరీ చేసుకుంటే నీకు ఏంటి ప్రాబ్లం.. ఈ హత్యతో నీకేమైనా సంబంధం ఉందా అని అనుమానంగా అడుగుతుంది.


మేనేజర్: మినిస్టర్ జగదీష్ రెడ్డి కొడుకు అతను. అతనితో గొడవ ఎందుకు అని ధాత్రి వాళ్ళకి చెప్పి, పోనీలెండి బాబు ఏదో చూపించమంటున్నారు కదా చూపిస్తే పోతుంది, మళ్ళీ అయ్యగారికి తెలిస్తే నన్ను కోప్పడతారు అని రెడ్డికి నచ్చజెప్పి ధాత్రి అడిగిన దగ్గరికి తీసుకువెళ్తాడు మేనేజర్. అక్కడ దొరికిన కొన్ని ఆధారాలు సేకరిస్తుంది ధాత్రి.


అక్కడికి కొందరు రౌడీలు వచ్చి ఏంటి ఎంక్వయిరీలు చేస్తున్నారు అంటూ ధాత్రి వాళ్ళ మీద దాడి చేయబోతే కేదార్ వాళ్ళని తన్ని పంపిస్తాడు.


ధాత్రి: మనం ఈ ఎంక్వయిరీ చేయడం ఎవరికో ఇష్టం లేదు.


రెడ్డి: ఈ రిసార్ట్ మా బాబాయిది.. ఇప్పటికే హత్య అని గందరగోళంగా ఉంది. ఇప్పుడు మీరు ఎంక్వయిరీ అదీ, ఇదీ అంటే రిప్యుటేషన్ పడిపోతుంది అని రిక్వెస్ట్ చేయడంతో బయటకు వచ్చేస్తారు ధాత్రి వాళ్ళు.


భరత్ అక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత తన అసిస్టెంట్ కి ఫోన్ చేసి మినిస్టర్ జగదీష్ రెడ్డి కొడుకుకు  క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఏమైనా ఉందా అని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయమని చెప్తుంది ధాత్రి. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.