Hyundai Cars April 2026 Offer: భారతీయ మార్కెట్‌లో కార్లు కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. అందుకే కార్లు వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అయితే ఆర్థిక సంవత్సరం చివరిలో అంటే ఫిబ్రవరి, మార్చిలో ఆఫర్స్ ఇవ్వడం సర్వసాధారణమైపోయింది. కానీ ఇప్పుడు హ్యూందాయ్ మోటార్ ఇండియా మాత్రం ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే ఆఫర్ ప్రకటించింది. ఈ నెలలోనే కంపెనీ తన హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్‌లు, ఎస్‌యూవీలు, ఎలక్ట్రిక్ వాహనాలు దాదాపు అన్ని మోడల్స్‌పై ఏదో ఒక ఆఫర్ రన్ చేస్తోంది. నగదు తగ్గింపు, ఎక్చేంజ్ బోనస్, స్క్రాపేజ్, కార్పొరేట్ డిస్కౌంట్ ఇలా ఏదో పేరుతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. వీటి ద్వారా దాదాపు 1.10లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశం ఇస్తోంది.
కొత్తగా కారు కొనాలి ఉన్నా, ఉన్న కారును మార్చేసి కొత్త కారు కొనాలని ఆలోచన ఉన్న వారికి ఇదో మంచి అవకాశం. వచ్చే కొన్ని నెలల్లో కార్లలో విపరీతమైన అప్‌డేట్‌లు వస్తున్నాయి. అందుకే ఇప్పుడు ఉన్న స్టాక్‌ను క్లియర్ చేసేందుకు హ్యూందాయ్ ఈ ఆఫర్ ప్రకటించింది. తగ్గింపుతో ఉన్న మెడల్స్‌ను అమ్మేయాలని ఆలోచనతో మంచి ప్రజాదరణ ఉన్న మోడల్స్‌పై తగ్గింపు ధరలకే ఇచ్చేస్తోంది.
గ్రాండ్‌ఐ10 నియోస్, ఆరా, ఐ20పై భారీ తగ్గింపు
తక్కువ బడ్జెట్‌లో కారు కొనాలనే ఆలోచన ఉన్నట్టు అయితే ఈ నెలలోనే హ్యూందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ ఒక మంచి ఎంపిక కావచ్చు. దీనిపై 68వేల రూపాయల తగ్గింపు ఉంటుంది. ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పని చేస్తుంది. CNG ఆప్షన్‌తో ఆప్షన్ కూడా ఈ కారులో ఉంది. పెట్రోల్ గురించి భయపడే వాళ్లు ఈ ఆప్షన్ ఎంచుకోవచ్చు. హ్యూందాయ్ ఆరా సెడాన్‌పై కూడా నెలలో 20,000 వరకు తగ్గింపు లభిస్తోంది. ఇది నియోస్‌లో ఉన్న ఇంజన్ ఆప్షన్‌లనే అందిస్తుంది. కానీ ఎక్కువ బూట్ స్పేస్‌తో వస్తుంది. హ్యూందాయ్ ఐ20పై కూడా 58వేల వరకు తగ్గింపు ఇస్తోంది. దీని స్పోర్ట్స్, ఆస్టా వేరియంట్లు అత్యధిక ప్రయోజనాలను పొందుతున్నాయి. ఐ 20 పెట్రోల్ ఇంజిన్, ఎన్‌లైన్ వేరియంట్‌తో వస్తోంది.
ఎస్‌యూవీ విభాగంలో ఎక్స్ట్‌ర్, వెన్యూ, క్రెటా ఆఫర్లు
ఎస్‌యూవీ విభాగంలో కూడా వినియోగదారులకు మంచి ఆఫర్స్ ఇస్తోంది. హ్యూందాయ్ ఎక్స్ట్‌ర్ పాత స్టాక్‌పై 43వేల వరకు తగ్గింపుతో లభిస్తుండగా, కొత్‌త మోడల్‌పై తగ్గింపు తక్కువగా ఉంది. ఇది పెట్రోల్, సీఎన్జీ రెండు ఆప్షన్‌లలోనూ అందుబాటులో ఉంది. హ్యూందాయ్ వెన్యూపై ఈసారి సుమారు ఐదు వేల వరకు తగ్గింపు లభిస్తోంది. హ్యూందాయ్ క్రెటాపై 55వేల వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఇది పెట్రోల్ టర్బో-పెట్రోల్ , డీజీల్ అనే మూడు ఇంజన్ ఆప్షన్‌లలోనూ లభిస్తోంది. దీంతో ఇది మిడ్ సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఒక బలమైన ఎంపికగా నిలుస్తోంది.
వెర్నా- క్రెటా ఎలక్ట్రిక్ వాహనం నుంచి అత్యధిక ప్రయోజనాలు
అన్ని మోడల్స్‌లో వెర్నా మోడల్‌పై ఎక్కువగా ఇస్తోంది. దీని పాత మోడల్‌పై 1.10 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తోంది. ఇది శక్తివంతమైన ఇంజన్, ఆకట్టుకునే ఫీచర్లను కలిగి ఉంది. హ్యూందాయ్ క్రెట ఎలక్ట్రిక్ కూడా లక్ష వరకు ప్రయోజనాలను అందిస్తోంది. పెట్రోల్, డీజిల్ నుంచి ఎలక్ట్రిక్ వాహనాలకు మారాలనుకునే వారికి ఈ ఆఫర్ ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది.
