సెడాన్ కార్ల ప్రపంచంలో  తిరుగులేని ఇమేజ్ ఉన్న హ్యుందాయ్ వెర్నా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ కారుకు ఇటీవల మిడ్-సైకిల్ అప్‌డేట్ లభించినప్పటికీ, ప్రస్తుతం పాత మోడల్ (Pre-facelift) పై లభిస్తున్న భారీ డిస్కౌంట్లు కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ వంటి కార్లకు గట్టి పోటీ ఇచ్చే వెర్నాపై ఈ నెలలో లభిస్తున్న ఆఫర్లు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి.

Continues below advertisement

పాత మోడల్‌పై భారీ ఆఫర్లుహ్యుందాయ్ డీలర్లు పాత వెర్నా స్టాక్‌పై రూ. 40,000 వరకు నగదు తగ్గింపును అందిస్తున్నారు. దీనికి తోడు రూ. 45,000 వరకు స్క్రాపేజ్ బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంది. మీరు మీ పాత కారును ఎక్స్ఛేంజ్ చేయాలనుకుంటే అదనంగా రూ. 10,000 తగ్గుతుంది. ఇప్పటికే హ్యుందాయ్ కారు వాడుతున్న వారు వెర్నాకు అప్‌గ్రేడ్ అయితే మరో రూ. 15,000 బోనస్ లభిస్తుంది. కార్పొరేట్ డిస్కౌంట్లు కూడా కలుపుకుంటే మొత్తం ప్రయోజనాలు రూ. 1 లక్షకు చేరువ అవుతున్నాయి. తక్కువ ధరలో పవర్‌ఫుల్ ఇంజిన్, క్లాసీ లుక్ ఉన్న సెడాన్ కావాలనుకునే వారికి ఇది గోల్డెన్ ఛాన్స్ అన‌డంలో సందేహం లేదు.

2026 హ్యుందాయ్ వెర్నాలో కొత్తగా ఏముంది?కొత్తగా వచ్చిన 2026 వెర్నా ఫేస్‌లిఫ్ట్‌లో డిజైన్ పరంగా చాలా మార్పులు జరిగాయి. బ్లాక్ క్రోమ్ రేడియేటర్ గ్రిల్, డ్యూయల్ ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, కొత్తగా డిజైన్ చేసిన బంపర్లు కారుకు అగ్రెసివ్ లుక్ ఇస్తున్నాయి. కారు లోపల కొత్తగా డి-కట్ (D-cut) స్టీరింగ్ వీల్ అమర్చారు. డ్రైవర్ సీటుకు 8-వే ఎలక్ట్రికల్ అడ్జస్ట్‌మెంట్, మెమరీ ఫంక్షన్ వంటి సౌకర్యాలు వచ్చాయి.

Continues below advertisement

సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లుఈ విభాగంలోనే మొదటిసారిగా వెనుక విండో సన్‌షేడ్, ప్యాసింజర్ సీట్ వాక్-ఇన్ డివైజ్, 528 లీటర్ల కెపాసిటీ ఉన్న స్మార్ట్ ట్రంక్ వంటి ఫీచర్లను హ్యుందాయ్ పరిచయం చేసింది. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లో 10.25 అంగుళాల ఇంటిగ్రేటెడ్ స్క్రీన్లు ఉన్నాయి. ఇందులో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే సదుపాయం కల్పించారు. ఇంజిన్ పరంగా చూస్తే 1.5 లీటర్ ఎన్ఏ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో-పెట్రోల్ ఆప్షన్లు అలాగే ఉన్నాయి. ఇవి 6-స్పీడ్ మాన్యువల్, ఐవీటీ (IVT), 7-స్పీడ్ డీసీటీ (DCT) గేర్‌బాక్స్‌లతో లభిస్తాయి. కొత్త ఫీచర్లు కావాలనుకునే వారు 2026 మోడల్‌ను, బడ్జెట్‌లో మంచి డీల్ కావాలనుకునే వారు పాత మోడల్‌ను ఎంచుకోవచ్చు.