Huawei Luxeed S7 Electric Sedan: స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ హువావే... చెరు ఆటో అనే సంస్థతో కలిసి ఎలక్ట్రిక్ కారును రూపొందించింది. ఇప్పుడు కంపెనీ ఎలక్ట్రిక్ కారు లక్సీడ్ ఎస్7కి సంబంధించిన ఈ సమాచారాన్ని షేర్ చేసింది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ సెడాన్‌ను తన కస్టమర్లకు డెలివరీ చేయడం ప్రారంభించినట్లు హువావే తెలిపింది. రాయిటర్స్ కథనం ప్రకారం... కంపెనీలో సెమీకండక్టర్ల కొరత కారణంగా ఉత్పత్తి పనులు ఆలస్యమయ్యాయి. అయితే ఇప్పుడు వాహనం ఉత్పత్తితో పాటు డెలివరీ పనులు కూడా ప్రారంభమయ్యాయి.


డెలివరీకి రెడీగా...
నివేదిక ప్రకారం హువావే ఎగ్జిక్యూటివ్‌లు పెద్ద సంఖ్యలో లక్సీడ్ ఎస్7 ప్రీమియం ఈవీలను తయారు చేశారని, ఇప్పుడు ఈ కారును కస్టమర్‌లకు డెలివరీ చేయడం కూడా ప్రారంభం అవుతుందని సమాచారం. హువావే స్మార్ట్ కార్ సొల్యూషన్ మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ ఈ సెడాన్ డెలివరీ గురించి సమాచారాన్ని ఇస్తూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వీబోలో ఒక పోస్ట్‌ను షేర్ చేశారు.


హువావే లక్సీడ్ ఎస్7 సెడాన్ లక్సీడ్ ఈవీ బ్రాండ్ నుంచి మొదటి ఎలక్ట్రిక్ కారు. ఈ ప్రీమియం సెడాన్‌కు 20 వేల ఆర్డర్లు వచ్చినట్లు కంపెనీ గతేడాది నవంబర్‌లో పేర్కొంది. 2023 నవంబర్ 28వ తేదీన కంపెనీ తన ఆర్డర్ వివరాల గురించి సమాచారాన్ని పంచుకుంది. సెమీకండక్టర్ల కొరత కారణంగా ఉత్పత్తి పనులు మందగించాయి. కానీ ఇప్పుడు కంపెనీ ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొంది. ఆర్డర్ అందుకున్న 4-5 నెలల తర్వాత కంపెనీ ఈ ఎలక్ట్రిక్ సెడాన్‌ను తన కస్టమర్లకు డెలివరీ చేయనుంది.


ఏప్రిల్ నెల నాటికి కారు ఉత్పత్తి, డెలివరీ సమస్య పరిష్కారం అవుతుందని హువావే తెలిపింది. చెరి ఆటో కారు డెలివరీలో జాప్యంపై దర్యాప్తు చేయాలని హువావే కంపెనీని కోరింది. హువావే లక్సీడ్ ఎస్7 ఎలక్ట్రిక్ సెడాన్ ధర 34,600 డాలర్లుగా ఉంది. భారత కరెన్సీలో ఇది రూ. 28.27 లక్షల వరకు ఉంటుంది.


ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షావోమీ కూడా ఇటీవలే కార్ల తయారీలోకి కూడా దిగింది. షావోమీ ఎస్‌యూ7 అనే ఎలక్ట్రిక్ సెడాన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. ఏకంగా టెస్లా స్థానంపైనే కన్నేసినట్లు షావోమీ లాంచ్ సమయంలో ప్రకటించింది.


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!