FASTag KYC Update: నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఇటీవల కేవైసీ అసంపూర్తిగా ఉన్న ఫాస్ట్‌ట్యాగ్‌లను 2024 జనవరి 31వ తేదీ తర్వాత తగినంత బ్యాలెన్స్ కలిగి ఉన్నప్పటికీ వాటిని బ్లాక్‌లిస్ట్ చేస్తామని ప్రకటించింది. ఈ అసౌకర్యాన్ని నివారించడానికి జనవరి 31వ తేదీలోపు కేవైసీని పూర్తి చేయండి.


ఒకే వాహనం కోసం ఎక్కువ ఫాస్ట్‌ట్యాగ్‌లు కూడా జారీ అయ్యాయి. ఆర్‌బీఐ ఆర్డర్‌ను ఉల్లంఘించి కేవైసీ కూడా చేయలేదని ఫిర్యాదు అందినందున NHAI ఈ చర్య తీసుకుందని తెలుసుకుందాం. మీడియా నివేదికల ప్రకారం దాదాపు ఏడు కోట్ల ఫాస్టాగ్‌లు జారీ అయ్యాయి. అయితే కేవలం నాలుగు కోట్లు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయి. అంతేకాకుండా 1.2 కోట్ల ఫాస్టాగ్‌లు నకిలీవి.


మీరు ఇంట్లోనే కూర్చుని ఆన్‌లైన్‌లో ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీని ఎలా సులభంగా అప్‌డేట్ చేయవచ్చో తెలుసుకుందాం.


మీ ఫాస్టాగ్ స్టేటస్‌ను ఎలా చెక్ చేయాలి? (FASTag KYC Status Check)
1. ఫాస్టాగ్ స్టేటస్‌ను చెక్ చేయడానికి, మీరు fastag.ihmcl.com వెబ్‌సైట్‌కు వెళ్లాలి.
2. వెబ్‌సైట్ కుడివైపు ఎగువన ఉన్న "లాగిన్" ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
3. ఇక్కడ అడిగిన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, పాస్‌వర్డ్ వివరాలను అందించండి.
4. ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వండి.
5. ఓటీపీ లాగిన్ తర్వాత డాష్‌బోర్డ్‌లోని "మై ప్రొఫైల్" విభాగంపై క్లిక్ చేయండి.
6. "మై ప్రొఫైల్"లో మీరు మీ ఫాస్టాగ్ కేవైసీ స్టేటస్‌ను, రిజిస్ట్రేషన్ సమయంలో సమర్పించిన ప్రొఫైల్ వివరాలను కూడా చూడవచ్చు.


ఫాస్టాగ్ కేవైసీ పెండింగ్‌లో ఉంటే ఏ పత్రాలు అవసరం? (FASTag KYC Update Documents)
ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం ఫాస్టాగ్ కేవైసీ అప్‌డేట్ కోసం కింది డాక్యుమెంట్‌లలో ఏదైనా ఒకటి అవసరం.
1. వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్
2. ఐడీ ప్రూఫ్
3. అడ్రస్ ప్రూఫ్
4. పాస్‌పోర్ట్ సైజు ఫోటో
గమనిక: పాస్‌పోర్ట్, ఓటరు ఐడీ కార్డ్, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, ఎన్ఆర్ఈజీఏ జాబ్ కార్డ్ (రాష్ట్ర ప్రభుత్వ అధికారి సంతకం) గుర్తింపులను అడ్రస్ ప్రూఫ్‌గా ఉపయోగించవచ్చు.


ఫాస్టాగ్ కేవైసీని ఆన్‌లైన్‌లో ఎలా అప్‌డేట్ చేయాలి? (FASTag KYC Update Online)
1. ముందుగా fastag.ihmcl.com వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
2. అందులో "మై ప్రొఫైల్" విభాగానికి వెళ్లండి.
3. “కేవైసీ” సబ్ సెక్షన్‌కి వెళ్లి, అక్కడ మీకు అవసరమైన వివరాలను అప్‌డేట్ చేయండి.
4. అవసరమైన ఐడీ, అడ్రస్ ప్రూఫ్ పత్రాలను అందించిన తర్వాత, పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్‌ను అప్‌లోడ్ చేయండి.
5. డిక్లరేషన్‌ని చెక్ చేసి కన్ఫర్మ్ చేయండి.
6. సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
7. అవసరమైన అన్ని పత్రాలను సమర్పించిన తర్వాత కేవైసీ ధృవీకరణ ప్రక్రియ పూర్తవుతుంది.
8. అప్‌గ్రేడ్ కోసం మీరు సమర్పించిన తేదీ నుంచి గరిష్టంగా ఏడు పని దినాలలో కేవైసీ అప్‌డేట్ అవుతోంది.


Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!