Electric Vehicle Range: భారతదేశంలోని కొన్ని తాజా ఎలక్ట్రిక్ కార్లు ఒకే ఛార్జ్‌తో 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రయాణించగలవు. అయితే ఈవీ యజమానులలో రేంజ్ (ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించవచ్చు అనేది) ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు రేంజ్ తగ్గుతుందనే ఆందోళన టెన్షన్ పెడుతుంది. ఎందుకంటే తక్కువ ఛార్జింగ్ ఉన్న బ్యాటరీతో ఎవరూ రోడ్డుపై ఇరుక్కుపోవాలని అనుకోరు. కాబట్టి ఎలక్ట్రిక్ వాహనం రేంజ్ పెంచడానికి ఏం చేయాలో కొన్ని టిప్స్ చూద్దాం.


స్మూత్‌గా డ్రైవ్ చేయండి
పూర్తి యాక్సిలరేషన్‌తో డ్రైవింగ్ చేయడం వలన మీ ఈవీ బ్యాటరీ చాలా త్వరగా డ్రెయిన్ అవుతుంది. మీరు తక్కువ దూరం ప్రయాణించాలనుకుంటే మరింత టార్క్ పొందడానికి మీరు ఎక్కువ వేగంతో డ్రైవ్ చేయవచ్చు. కానీ దూర ప్రయాణానికి ఇది మంచిది కాదు.


స్పీడ్ లిమిట్ చూసుకోవాలి
సాధ్యమైనప్పుడల్లా మీ కారు వేగాన్ని గంటకు 90 కిలోమీటర్ల కంటే తక్కువగా ఉంచడానికి ప్రయత్నించండి. ఇది అతివేగానికి జరిమానా నుంచి మిమ్మల్ని రక్షించడమే కాకుండా, మీ బ్యాటరీ రేంజ్‌ను కూడా పెంచుతుంది. మీ వేగాన్ని గంటకు 16 కిలోమీటర్ల మేర తగ్గించడం ద్వారా 14 శాతం శక్తిని ఆదా చేయవచ్చని ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలు చెబుతున్నాయి. మీ ఈవీలో "ఎకో" మోడ్ ఉంటే దాన్ని ఎక్కువగా ఉపయోగించండి.


రీజనరేటివ్ బ్రేకింగ్ ఉపయోగించండి
సాధ్యమైనప్పుడల్లా మీ ఈవీకి సంబంధించిన రీజనరేషన్ బ్రేకింగ్ ఫంక్షన్‌ను సద్వినియోగం చేసుకోండి. అవసరమైనప్పుడు మాత్రమే బ్రేక్‌లను ఉపయోగించండి. దీని కారణంగా వేగాన్ని తగ్గించేటప్పుడు వాహనం బ్యాటరీలు ఆటోమేటిక్‌గా స్లోగా ఛార్జ్ అవుతాయి.


ఏసీ/హీటర్‌ని ఎక్కువ వాడకండి
ఎలక్ట్రిక్ వాహనాల్లో హీటర్, ఏసీ రన్ చేయడం వలన బ్యాటరీ చాలా త్వరగా పాడైపోతుంది. దీని కోసం ఇన్విరాన్‌మెంట్ కంట్రోల్ వ్యవస్థను తక్కువగా ఉపయోగించండి. బదులుగా వెంటిలేటెడ్ సీట్లు, హీటెడ్ స్టీరింగ్ వీల్‌ను ఉపయోగించండి.


అదనపు వస్తువులను తీసేయండి
వాహనం బరువును తగ్గించడం కూడా దాని మైలేజీ/రేంజ్‌ను పెంచడానికి సులభమైన మార్గం. అందువల్ల మీ కారులో వీలైనంత తక్కువ సామాను ఉంచండి.


అడిషనల్ యాక్సెసరీలను ఇన్‌స్టాల్ చేయవద్దు
మీ ఈవీలో రూఫ్ రాక్‌లు, కార్గో క్యారియర్‌ల వంటి అడిషనల్ యాక్సెసరీలను ఇన్‌స్టాల్ చేయడం మానుకోండి. ఎందుకంటే అటువంటి వస్తువుల ద్వారా ఏర్పడే ఏరోడైనమిక్ టెన్షన్ అధిక వేగంతో అధిక శక్తి వినియోగానికి దారి తీస్తుంది.


మరోవైపు 2024 కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ డిసెంబర్ 14వ తేదీన భారతదేశంలో లాంచ్ కానుంది. అధికారిక లాంచ్‌కు ముందు కియా ఇండియా దీని కొత్త టీజర్ వీడియోను విడుదల చేసింది. ఈ టీజర్‌లో అనేక కీలక వివరాలు చూడవచ్చు. కొత్త మోడల్‌లో అప్‌డేట్ చేసిన స్టైలింగ్, ఫీచర్ లోడెడ్ క్యాబిన్ చాలా అద్భుతంగా ఉన్నాయి. కానీ ఇంజన్ ఆప్షన్లు మాత్రం ఇంతకు ముందు వెర్షన్ తరహాలోనే ఉండే అవకాశం ఉంది.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply


Also Read: సూపర్ హిట్ టయోటా కామ్రీ అప్‌డేటెడ్ వెర్షన్ త్వరలో - ఈసారి హైబ్రిడ్ ఇంజిన్‌తో!


Also Read: లాంచ్‌కు రెడీ అవుతున్న కొత్త స్విఫ్ట్ - సరికొత్త ఇంజిన్, సూపర్ లుక్‌తో!