Fancy Registration Number for Vehicles: ఆటోమొబైల్ ఔత్సాహికులకు కార్లు, బైక్‌లు అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. కార్లు, బైక్‌ల మీద ఎక్కువ ఇంట్రస్ట్ లేని వారు కూడా చాలా మంది తాము ఉపయోగించే వాహనాలకు ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ ఉండాలని కోరుకుంటారు. ఇటువంటి నంబర్ ఉంటే మీ వాహనం ప్రత్యేకమైనదని ఇతరులకు తెలుస్తుంది. అయితే కార్లు, బైక్‌ల కోసం ఫ్యాన్సీ లేదా వీఐపీ రిజిస్ట్రేషన్ నంబర్ కోసం కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది.


ఫాన్సీ కారు నంబర్ లేదా బైక్ నంబర్‌ను పొందడం కొంచెం క్లిష్టతరమైన ప్రక్రియనే. ఎందుకంటే మీరు దానిని ఈ-వేలం ద్వారా పొందాలి. కారు, బైక్ కోసం ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఎలా పొందాలనే దాని గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం.


కారుకు ఫ్యాన్సీ నంబర్‌ను ఎలా పొందాలి?
మీరు కొత్త కారును కొనుగోలు చేస్తున్నట్లయితే అవసరమైన రుసుము చెల్లించి ఫ్యాన్సీ లేదా వీఐపీ నంబర్‌ను ఎంచుకోవచ్చు. కారును కొనుగోలు చేసేటప్పుడు ఈ ప్రక్రియ జరగదు. మీరు ఈ-వేలం ద్వారా ఫ్యాన్సీ నంబర్ కోసం పోటీ పడాలి.


ఇది ఈ-వేలం ప్రక్రియ కాబట్టి వాహన డీలర్‌షిప్‌లో ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది. మీరు ఆర్టీవోకు వెళ్లకుండానే మీకు ఇష్టమైన నంబర్‌ను జాబితా నుంచి ఎంచుకోవచ్చు. ప్రతి రాష్ట్రంలోని ప్రతి వీఐపీ కారు నంబర్‌కు బేస్ ధర ముందే నిర్ణయిస్తారు. ఈ బేస్ ధర నుంచి బిడ్డింగ్ ప్రారంభమవుతుంది. ఫ్యాన్సీ కార్ నంబర్ల కోసం బిడ్డింగ్ ప్రక్రియ కోసం కింది స్టెప్స్ ఫాలో అవ్వాలి.


స్టెప్ 1: మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్ (MoRTH) అధికారిక వెబ్‌సైట్‌లో పబ్లిక్ యూజర్‌గా మిమ్మల్ని మీరు ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోండి.


స్టెప్ 2: సైన్ అప్ చేసి మీ ఖాతాలోకి లాగిన్ అయిన తర్వాత ఫ్యాన్సీ నంబర్‌ని ఎంచుకోండి.


స్టెప్ 3: రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన రుసుము చెల్లించి నంబర్‌ను రిజర్వ్ చేసుకోండి.


స్టెప్ 4: మీకు నచ్చిన వీఐపీ కారు నంబర్ కోసం ఆక్షన్‌లో పాల్గొనండి.


స్టెప్ 5: బిడ్డింగ్ ముగిసిన తర్వాత ఫలితాన్ని ప్రకటిస్తారు. దీనిలో మీరు మిగిలిన మొత్తాన్ని చెల్లించవచ్చు లేదా అలాట్‌మెంట్ లేనట్లయితే వాపసు పొందవచ్చు.


స్టెప్ 6: రిఫరెన్స్ కోసం అలాట్‌మెంట్ లెటర్‌ను ప్రింట్ చేయండి.


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!