Mahindra Bolero Neo SUV On EMI: మహీంద్రా బోలెరో నియో ఇండియాలో బడ్జెట్ ఫ్రెండ్లీ 7-సీటర్ లేఅవుట్ కారు. వర్కింగ్ కండీషన్‌లో కూడా మంచి రేటింగ్ ఉన్న SUV మోడల్స్‌లో ఒకటి. ఇది మధ్యతరగతి కుటుంబాలకు అనువైన ఆప్షన్‌గా ఉంటోంది. మహీంద్రా సంస్థ ఈ బోలెరో నియోను నాలుగు వేరియంట్లలో (N4, N8, N10, N10 (O)) ఐదు రంగు ఎంపికలలో అందుబాటులో ఉంచింది.
2025లో బోలెరో నియో ఎక్స్-షోరూమ్ ధర రూ. 9.95 లక్షల నుంచి రూ. 12.15 లక్షల వరకు ఉంటుంది. హైదరాబాద్‌లో దీని బేస్ వేరియంట్ ఆన్-రోడ్ ధర సుమారు రూ. 12.04 లక్షలు, ఇందులో RTO , ఇన్సూరెన్స్ వంటి అన్ని ఛార్జీలు కలిసి ఉంటాయి. అయితే, ఎంచుకున్న వేరియంట్, డీలర్‌షిప్‌ను బట్టి ఈ ధరలో మార్పు ఉండవచ్చు.
ఫైనాన్స్ ప్లాన్ , EMI ఆప్షన్లు
హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో దీన్ని రూ. 1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Mahindra Bolero Neoని కొనుగోలు చేసే పరిస్థితి లేదు. కనీసం రెండు లక్షల లేనిదే ఫైనాన్స్ కంపెనీలు లోన్ ఆఫర్ చేయడం లేదు. కొన్ని చోట్ల లక్ష రూపాయలు చెల్లిస్తే మిగతా అమౌంట్ లోన్‌గా ఇచ్చేందుకు అంగీకరిస్తున్నాయి. లక్షరూపాయలు చెల్లిస్తే రూ. 10.44 లక్షల రుణం తీసుకోవాలి. బ్యాంకు 9.8% వడ్డీ రేటుతో 5 సంవత్సరాలకు రుణం ఇస్తుందని అనుకుందాం, అప్పుడు మీ నెలవారీ EMI సుమారు రూ. 22,000 ఉంటుంది. ఈ కాలంలో మొత్తం వడ్డీ సుమారు రూ. 2.50 లక్షలు చెల్లించాలి. అయితే, ఫైనాన్స్ ప్లాన్ మీ క్రెడిట్ స్కోర్, బ్యాంకు విధానంపై ఆధారపడి ఉంటుంది. మంచి సిబిల్ స్కోర్ ఉంటే, మీకు తక్కువ వడ్డీ లేదా 100% రుణ సౌకర్యం లభించవచ్చు. మీ సిబిల్ స్కోర్ మెరుగైనది అయితే, బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు తక్కువ వడ్డీ రేటుతో రుణాలను అందిస్తాయి. కొన్ని సందర్భాల్లో 100% ఫైనాన్స్ సౌకర్యం కూడా కల్పిస్తాయి. దీనివల్ల డౌన్ పేమెంట్ రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ ఛార్జీలకు మాత్రమే పరిమితం అవుతుంది.
రెండున్నర లక్షల చెల్లిస్తే మాత్రం రూ. 9,53,547 లోన్ లభిస్తుంది. దీన్ని పదిశాతం వడ్డీకి ఏడు సంవత్సరాలకు తీసుకుంటే నెలకు 15,830 రూపాయల ఈఎంఐ చెల్లించాలి. అదై ఆరేళ్లకు రూ. 17,665లు చెల్లించాలి. ఐదేళ్లకు తీసుకుంటే 20,260 రూపాయల నెల కిస్తీ చెల్లించాల్సి ఉంటుంది.
ఇంజిన్, మైలేజ్
Mahindra Bolero Neoలో 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంది, ఇది 100 bhp పవర్, 260 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌తో 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లభిస్తుంది. కంపెనీ ఈ SUV సుమారు 17 కిమీ/లీటరు మైలేజీ ఇస్తుందని చెబుతోంది, ఇది ఈ సెగ్మెంట్‌లో మంచి సంఖ్య. ఈ ఇంజిన్ నగర ట్రాఫిక్, హైవే, గ్రామీణ రోడ్లలో అద్భుతమైన పనితీరును కనబరుస్తుంది.
సేఫ్టీ, ఫీచర్లు
ఈ ఆర్థికంగా అందుబాటులో ఉన్న SUVలో అనేక గట్టి ఫీచర్లు ఉన్నాయి, అవి డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ABS (యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్), రివర్స్ పార్కింగ్ సెన్సార్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పవర్ విండో , మాన్యువల్ ఎయిర్ కండిషనర్. ఈ ఫీచర్లన్నీ భద్రతను మరింత మెరుగుపరుస్తాయి, అలాగే దీన్ని నమ్మకమైన ఫ్యామిలీ కారుగా చెబుతారు. మీరు తక్కువ బడ్జెట్‌లో పటిష్టమైన, మన్నికైన, 7-సీటర్ SUVని వెతుకుతున్నట్లయితే, అది అన్ని రకాల రోడ్లలో అద్భుతమైన పనితీరును కనబరుస్తుంది, దాని నిర్వహణ ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది, అప్పుడు Mahindra Bolero Neo మీకు మంచి ఆప్షన్‌గా ఉండవచ్చు.