Motorcycle Reserve Fuel | కారు అయినా, బైక్ అయినా ప్రతి వాహనంలోనూ పెట్రోల్ లేదా డీజిల్ రిజర్వ్ చేయడానికి ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. వెహికల్ నడుస్తున్నప్పుడు ఫ్యూయల్ ఖర్చవుతూ ఉంటుంది. బైక్ నడుపుతుండగా చాలాసార్లు హఠాత్తుగా పెట్రోల్ తగ్గిపోయి, బైక్ రిజర్వ్‌లోకి వస్తుంది. నిజానికి, రిజర్వ్ అనేది మీ వాహనంలో పెట్రోల్ అయిపో వచ్చిందని, వెంటనే రీఫ్యూయల్ చేయించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తుంది. ఇలాంటప్పుడు చాలా మంది మనస్సులో ఒక ప్రశ్న వస్తుంది. అయితే రిజర్వ్‌లో ఎంత పెట్రోల్ మిగిలి ఉంటుంది? బైక్ ఎంత దూరం వరకు వెళ్లగలదు? రిజర్వ్ అనేది వేరే ప్రత్యేక ట్యాంక్ ఏమీ కాదు, అది మెయిన్ ఫ్యూయల్ ట్యాంక్‌లో ఒక భాగమే.
టూవీలర్లో ఉండే రిజర్వ్ పెట్రోల్ సైజ్ ఆ బైక్ మోడల్, దాని మొత్తం ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఇది 1 లీటర్ నుండి 2.5 లీటర్ల వరకు ఉంటుంది. ట్యాంక్‌లో పెట్రోల్ ఒక లిమిట్ కంటే కిందకు పడిపోయినప్పుడు, బైక్ రిజర్వ్ ఫ్యూయల్ వాడుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే.. రైడర్ సేఫ్‌గా సమీపంలోని పెట్రోల్ బంకుకు చేరుకునేందుకు వీలుంటుంది. అందుకే రిజర్వ్‌ను ఎల్లప్పుడూ ఒక ఎమర్జెన్సీ ఆప్షన్‌గా వినియోగించుకోవాలి.
Read Also: వర్షాకాలంలో జర్నీ చేయడానికి 5 Best SUVలు ఇవే.. మీరూ ట్రై చేయండి
రిజర్వ్‌లో బైక్ ఎంత దూరం వెళ్తుందిమీ బైక్ మోడల్, మైలేజ్, రిజర్వ్ ఫ్యూయల్ కెపాసిటీపై ఎంత దూరం వెళ్తుందనేది ఆధారపడి ఉంటుంది. సాధారణంగా మొత్తం ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యంలో 10 శాతం వరకు రిజర్వ్‌లో ఉంటుంది. వేర్వేరు బైకుల్లో రిజర్వ్ పెట్రోల్ పరిమాణం మారుతూ ఉంటుంది. సాధారణంగా చాలా బైకుల్లో రిజర్వ్ ఫ్యూయల్ దాదాపు 1 నుండి 1.5 లీటర్ల వరకు ఉంటుంది. ఒకవేళ మీ బైక్ లీటరుకు 60 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తే, అది రిజర్వ్‌లోకి వచ్చిన తర్వాత దాదాపు 50 నుండి 80 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. అయితే ఈ దూరం రోడ్డు కండీషన్, ట్రాఫిక్, వేగం, బైక్ కండిషన్‌ను బట్టి హెచ్చుతగ్గులు ఉంటాయి. కనుక బైక్ రిజర్వ్‌లోకి వచ్చిన తర్వాత ఎక్కువ దూరం వెళ్లకుండా సాధ్యమైనంత త్వరగా పెట్రోల్ కొట్టించాలి.
రిజర్వ్‌లో నడపితే ఇంజన్‌పై ప్రభావం పడుతుందా?సాధారణంగా కొన్ని కిలోమీటర్ల దూరం వరకు రిజర్వ్‌లో బైక్ నడపడం వల్ల ఇంజన్‌కు అంత నష్టం జరగదు. అవసరమైనప్పుడు మీరు పెట్రోల్ బంకుకు చేరుకోవాలనే ఉద్దేశంతోనే కంపెనీ ఈ సిస్టమ్‌ను అందిస్తుంది. కానీ పదే పదే బైక్‌ను రిజర్వ్ స్థాయికి తెచ్చి నడపడం లేదా ట్యాంక్‌ను పూర్తిగా ఖాళీ చేస్తే సమస్యలు రావచ్చు. ట్యాంక్ అడుగు భాగంలో పేరుకుపోయిన మురికి లాంటివి ఫ్యూయల్ సిస్టమ్‌లోకి చేరతాయి. ఫ్యూయల్ పంప్‌పై కూడా అదనపు ఒత్తిడి పడుతుంది. అందుకే రిజర్వ్‌ను కేవలం అత్యవసర సమయాల్లో మాత్రమే ఉపయోగిస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
Also Read: BYD Sealion 6: భారత్‌లోకి BYD తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ SUV.. ఫుల్ ట్యాంక్‌తో 1000 కి.మీ పైగా రేంజ్
ఒకవేళ మీ బైక్ 50 kmpl మైలేజ్ ఇస్తూ, రిజర్వ్‌లో 1.5 లీటర్ల పెట్రోల్ ఉంటే మీరు గరిష్టంగా 65 - 75 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లవచ్చు. బైకులో ఫ్యూయల్ ఇండికేషన్ (ఇంధనం తక్కువగా ఉందని చూపే లైట్) పడగానే మీరు 20-30 కిలోమీటర్ల లోపు పెట్రోల్ కొట్టించడం మంచిది.
