BYD Hybrid SUV | భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. దాంతో హైబ్రిడ్ కార్ల డిమాండ్ పుంజుకుంటోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ వాహన తయారీ సంస్థ BYD దేశంలో తన మొట్టమొదటి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ SUVని లాంచ్ చేయడానికి రెడీగా ఉంది. బీవైడీ కంపెనీ జూన్ 9న కొత్త BYD Sealion 6 మోడల్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. ఇప్పటివరకు BYD భారత్‌లో కేవలం ఎలక్ట్రిక్ కార్ల (EVs) ద్వారానే గుర్తింపు తెచ్చుకుంది. ఈ Sealion 6 ద్వారా కంపెనీ తొలిసారిగా భారత వినియోగదారులకు ప్లగ్-ఇన్ హైబ్రిడ్ టెక్నాలజీ (PHEV) ఆప్షన్‌ను అందించనుంది. 

Continues below advertisement

BYD Sealion 6లో కంపెనీకి చెందిన ప్రత్యేకమైన DM-i హైబ్రిడ్ టెక్నాలజీని వాడారు. ఈ సిస్టమ్ "ఎలక్ట్రిక్ ఫస్ట్" అనే ఫార్మూలాపై పనిచేస్తుంది. అంటే, నగరాల్లో డ్రైవింగ్ సమయంలో ఈ కారు ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ సహాయంతోనే నడుస్తుంది. దీనివల్ల పెట్రోల్ వినియోగం తగ్గడంతో పాటు రన్నింగ్ కాస్ట్ చాలా వరకు తగ్గుతుంది. అవసరమైనప్పుడు మాత్రమే పెట్రోల్ ఇంజన్ పనిచేస్తుంది. తద్వారా లాంగ్ జర్నీ చేయడం సులువవుతుంది.

Also Read: E85 Fuel India: ప్రతి కారు లేదా బైక్‌లో E85 ఇంధనాన్ని వాడవచ్చా? మైలేజీపై ప్రభావం చూపుతుందా..

Continues below advertisement

కారు డిజైన్ ఎలా ఉంది?డిజైన్ విషయానికి వస్తే.. Sealion 6 లుక్ చాలా మోడ్రన్, ప్రీమియంగా ఉంటుంది. ఈ SUV పొడవు దాదాపు 4.77 మీటర్లు ఉండటంతో దీని రోడ్ ప్రెజెన్స్ చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. ముందు భాగంలో స్లీక్ ఎల్‌ఈడీ (LED) హెడ్‌లైట్లు, ఎల్‌ఈడీ డే-టైమ్ రన్నింగ్ లైట్లు, స్పోర్టీ బంపర్ అందించారు. అలాగే వెనుక వైపు కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు, లైట్ బార్, రూఫ్ స్పాయిలర్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ దీనికి మరింత అట్రాక్షన్ ఇస్తాయి. బీవైడీ కంపెనీ ఇందులో స్టైలిష్ అల్లాయ్ వీల్స్‌ను అమర్చింది.

ఈ SUV క్యాబిన్ లోపల సాఫ్ట్-టచ్ మెటీరియల్, ప్రీమియం ఫినిషింగ్, అట్రాక్టివ్ కలర్ థీమ్‌ను ఉపయోగించారు. ఇందులో లెదరెట్ సీట్లు, త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్, 15.6 అంగుళాల భారీ రొటేటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ఇస్తారు. ఈ ఫీచర్లతో సాంకేతికత, ఫీచర్ల పరంగానూ ఈ SUV చాలా కార్లతో పోల్చితే ముందంజలో కనిపిస్తుంది.

Read Also: వర్షాకాలంలో జర్నీ చేయడానికి 5 Best SUVలు ఇవే.. మీరూ ట్రై చేయండి

భద్రత, స్పెషల్ ఫీచర్లుసేఫ్టీ విషయంలో కూడా కంపెనీ ఎక్కడా రాజీ పడలేదు. బీవైడీ Sealion 6 మోడల్‌లో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీల కెమెరా, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS), ఫ్రంట్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్లు, పనోరమిక్ సన్రూఫ్, 10 స్పీకర్ల ఆడియో సిస్టమ్ వంటి మోడ్రన్ ఫీచర్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ ఫీచర్లన్నీ కలిసి దీనిని అత్యంత సురక్షితమైన, హైటెక్ SUVగా మారుస్తాయి.

BYD Sealion 6 అతిపెద్ద ప్లస్ పాయింట్ దీని అద్భుతమైన డ్రైవింగ్ రేంజ్ అని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో ఈ SUV 1.5 లీటర్ల పెట్రోల్ ఇంజన్, బ్యాటరీ కాంబినేషన్‌తో వస్తోంది. బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ చేసి, పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేస్తే ఈ SUV 1,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. లాంగ్ జర్నీల సమయంలో పదే పదే ఛార్జింగ్ పెట్టాలనే లేదా ట్యాంక్ ఫుల్ చేపించాలనే టెన్షన్ ఉండదు. 

ధర ఎంత ఉండవచ్చు?భారత్‌లో కంపెనీ దీని ఏ పవర్‌ట్రెయిన్ (ఇంజన్/బ్యాటరీ) వేరియంట్‌ లాంచింగ్ వివరాలు తెలియలేదు. అయినప్పటికీ, దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 35 లక్షల నుండి రూ. 45 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా. ఒకవేళ ఇదే ధరతో వస్తే.. ఎలక్ట్రిక్ కారు లాంటి తక్కువ రన్నింగ్ కాస్ట్ కోరుకుంటూనే, లాంగ్ జర్నీ కోసం పెట్రోల్ ఇంజన్ వదులుకోవడానికి ఇష్టపడని కస్టమర్లకు ఈ SUV ఒక బెస్ట్ ఆప్షన్‌గా మారుతుంది.