Honda Shine 100 Specifications: హోండా మోటార్‌సైకిల్స్, స్కూటర్స్ ఇండియా ఇటీవలే కొత్త షైన్ 100 కమ్యూటర్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేయడం ద్వారా భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 100 సీసీ కమ్యూటర్ విభాగంలోకి ప్రవేశించింది. ఈ కొత్త బైక్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.


సరికొత్త ఇంజన్ వచ్చింది
హోండా షైన్ 100లో అత్యంత ఆకర్షణీయమైన విషయం ఏమిటంటే, దాని కొత్త ఫ్యూయల్-ఇంజెక్ట్ 99.7 సీసీ ఇంజన్. ఇది 7.61 hp పవర్, 8.05 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ 100 సీసీ సెగ్మెంట్‌లో పోటీని పెంచబోతోంది. ఈ ఇంజన్ 4 స్పీడ్ గేర్‌బాక్స్‌తో మార్కెట్లోకి వచ్చింది.


హోండా షైన్ 100 ఛాసిస్
షైన్ 100లో కొత్త డైమండ్-రకం ఫ్రేమ్‌ను అందించారు. ఈ ఫ్రేమ్‌ను బైక్ కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఇందులో టెలిస్కోపిక్ ఫోర్క్, ట్విన్ షాక్ అబ్జార్బర్స్ కూడా ఉన్నాయి. దీని రెండు చక్రాలకు డ్రమ్ బ్రేక్‌లు అందించారు. దీని బరువు 100 కిలోల కంటే తక్కువగా ఉంది. సీటు ఎత్తు 786 మిల్లీ మీటర్లు. దీంతో పాటు 168 మిల్లీ మీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఇందులో అందుబాటులో ఉంది.


ఫీచర్లు ఎలా ఉన్నాయి?
ఎంట్రీ లెవల్ బైక్ కావడం వల్ల ఇందులో పెద్దగా ఫీచర్లు లేవు. ఇది సాధారణ హాలోజన్ హెడ్‌లైట్‌తో అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందుతుంది. ఇందులో డిస్క్ బ్రేక్ కూడా లేదు. అయితే దీనికి కాంబి-బ్రేకింగ్ సిస్టమ్, ఫ్యూయల్ ఇంజెక్షన్, ఆటో చోక్ సిస్టమ్ ఫీచర్లు మాత్రం అందించారు.


బుకింగ్, డెలివరీ
కంపెనీ తన కొత్త హోండా షైన్ 100 కోసం బుకింగ్‌ను ప్రారంభించింది. వచ్చే నెల నుంచి హోండా ఈ బైక్ ఉత్పత్తిని ప్రారంభించనుంది. అయితే వినియోగదారులు మే నెలలో దీని డెలివరీలను పొందుతారు.


ధర ఎంత?
హోండా తన కొత్త షైన్ 100ని రూ.64,900 ధరలో విడుదల చేసింది. ఇది ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర. 100 సీసీ కమ్యూటర్ సెగ్మెంట్‌లో ఇది మంచి కాంపిటీటివ్ స్ట్రాటజీ. కొత్త బైక్ కావాలనుకునే వారికి మంచి ఆప్షన్ కూడా.


ఏ బైక్‌లతో పోటీ పడనుంది?
ఈ బైక్ హీరో హెచ్ఎఫ్ 100, Hero Splendor+, Bajaj Platina 100 వంటి బైక్‌లతో పోటీపడుతుంది. Hero HF 100 మార్కెట్‌లో ఒక వేరియంట్, రెండు కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఇది 97.2 cc BS6 ఇంజిన్‌ను పొందుతుంది.


ఈ హోండా బైక్ రెడ్ స్ట్రిప్, బ్లాక్ విత్ బ్లూ స్ట్రిప్, బ్లాక్ విత్ గ్రీన్ స్ట్రిప్, బ్లాక్ విత్ గోల్డ్ స్ట్రైప్, బ్లాక్ విత్ గ్రే స్టైప్ పెయింట్ స్కీమ్ ఆప్షన్‌లతో మార్కెట్లలో లాంచ్ అయింది. కంపెనీ తన హోండా షైన్ 100 సీసీ బైక్‌పై ఆరు సంవత్సరాల వారంటీని అందిస్తోంది. ఇందులో మూడు సంవత్సరాల స్టాండర్డ్,  మూడు సంవత్సరాల ఎక్స్‌టెండెడ్ వారంటీ ఉంటుంది. దేశీయ మార్కెట్లో 100 సీసీ సెగ్మెంట్ బైక్‌లు అత్యధికంగా అమ్ముడు అవుతున్నాయి. హీరో స్ప్లెండర్, బజాజ్ ప్లాటినా ఈ సెగ్మెంట్‌లో ముందంజలో ఉన్నాయి. ఈ సెగ్మెంట్‌లో అత్యధికంగా ప్రజలు ఇష్టపడే బైక్‌లు ఇవే. కాబట్టి ఈ విభాగంలో స్ప్లెండర్, బజాజ్ ప్లాటినాకు హోండా షైన్ గట్టి పోటీనిస్తుంది.