Honda Electric Bike E-VO Launching: ప్రజలు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న హోండా మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌ సైకిల్ "హోండా E-VO"ను ఆవిష్కరించింది. ఈ బైక్‌ను చైనా కంపెనీ సహాయంతో తయారు చేసింది & మొదట అక్కడే లాంచ్ చేసింది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలో హోండా మొట్టమొదటి ప్రజంటేషన్‌ ఇది. లాంగ్‌ రేంజ్‌, అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు, ఫ్యూచరిస్టిక్‌ డిజైన్‌లో ఈ మోటార్‌ సైకిల్‌ను హోండా తీసుకువచ్చింది.

డిజైన్‌ హోండా E-VO డిజైన్ స్పోర్టీ స్ట్రీట్ ఫైటర్ బైక్ లాగా ఉంటుంది, ఇది యువతను బాగా ఆకర్షిస్తుంది. ముందు చక్రం 16 అంగుళాలు & వెనుక చక్రం 14 అంగుళాలతో సెమీ-స్లీక్ టైర్లను కంపెనీ అందించింది. సెమీ-స్లిక్ టైర్లను హై-పెర్ఫార్మెన్స్‌ బండ్ల కోసం ఉపయోగిస్తారు. రోడ్డుపై ఇవి సరైన గ్రిప్‌ కలిగి ఉంటాయి, తడి రోడ్ల మీద కూడా బండిని జారిపోనివ్వవు. మెరుగైన హ్యాండ్లింగ్, స్టీరింగ్ వీల్ రెస్పాన్స్ & మిడ్-కార్నర్ కంట్రోల్‌ నియంత్రణను కోరుకునే రైడర్లు వీటిని ఇష్టపడతారు. హోండా E-VO బేస్ మోడల్‌ బైక్ బరువు 143 కిలోలు & హై-రేంజ్ మోడల్‌ బరువు 156 కిలోలు. ఇది బ్లాక్‌ & వైట్‌ కలర్‌ ఆప్షన్స్‌తో లాంచ్‌ అయింది. ఈ బైక్‌లో 7-అంగుళాల డిజిటల్ TFT డాష్‌బోర్డ్ కూడా ఉంది.

బ్యాటరీ & రేంజ్‌హోండా E-VOలో రెండు బ్యాటరీ ఎంపికలు (Honda Electric Bike E-VO Battery Options) అందించారు. మొదటి వేరియంట్ 4.1kWh బ్యాటరీతో వస్తుంది, ఇది 120 కిలోమీటర్ల రేంజ్‌ (Honda Electric Bike E-VO Range) ఇస్తుంది & 1 గంట 30 నిమిషాల్లోనే ఛార్జ్ అవుతుంది. రెండోది హై-రేంజ్ వేరియంట్, ఇది 6.2kWh బ్యాటరీతో వచ్చింది, ఫుల్‌ ఛార్జ్ చేస్తే 170 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు & 2 గంటల 30 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. ఈ రెండు వేరియంట్‌లను పోర్టబుల్ AC ఛార్జర్‌తో ఛార్జ్ చేయవచ్చు.

పనితీరు & పవర్‌హోండా E-VOలో గరిష్టంగా 20.5 bhp పవర్‌ను ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్‌ ఉంది. ఇది బండి రన్నింగ్‌ను మృదువుగా ఉంచుతునే వేగవంతమైన రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది. రైడర్ల వెసులుబాటు కోసం ఎకో, నార్మల్ & స్పోర్ట్ వంటి రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. డ్యూయల్-ఛానల్ ABS, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) & బ్యాటరీ SOC డిస్‌ప్లే వంటి అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లను కూడా ఈ బండిలో యాడ్‌ చేశారు.

ధరహోండా E-VO ధర (Honda Electric Bike E-VO Price) చైనాలో CNY 30,000 నుంచి CNY 37,000 మధ్య నిర్ణయించారు. భారత కరెన్సీలో దాదాపు రూ. 3.56 లక్షల నుంచి రూ. 4.39 లక్షల వరకు ఉంటుంది. 

భారతదేశంలో ఎప్పుడు లాంచ్‌ అవుతుంది?ప్రస్తుతం, భారతదేశంలో హోండా E-VO లాంచ్ గురించి ఎటువంటి అధికారిక సమాచారం లేదు. ఇది, లోకల్‌ పార్ట్‌నర్‌ సహకారంతో చైనా కోసం అభివృద్ధి చేసిన మోడల్‌. అయితే, భారతదేశంలో ఎలక్ట్రిక్ టూవీలర్‌ విభాగం వేగంగా అభివృద్ధి చెందుతోంది కాబట్టి, భవిష్యత్తులో ఇండియాలోనూ ఈ బండి లాంచింగ్‌ సాధ్యమే. హోండా E-VO భారతదేశంలో లాంచ్ అయితే TVS iQube, Ola S1 Pro & Ather 450X వంటి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు గట్టి పోటీని ఇవ్వగలదు. లాంగ్‌ రేంజ్‌, అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ  & హోండా బ్రాండ్‌పై ఉన్న నమ్మకం ఈ బండిని EV బైక్ విభాగంలో గేమ్ ఛేంజర్‌గా మార్చగలవు.