Brahmamudi Serial Today Episode: ఇందిరాదేవి ధైర్యం ఇవ్వడంతో రాజ్ హాల్లోకి వెళ్లి కావ్యతో తన మనసులో మాట చెప్తా అంటాడు. దీంతో కావ్య ఏంటో ఆ మాట అంటూ అడగడంతో రాజ్ ప్రపోజ్ చేయబోతుంటే వైదేహి కాల్ చేస్తుంది. రాజ్ కట్ చేస్తాడు. అయినా మళ్లీ మళ్లీ చేస్తుంది. రాజ్ ఫోన్ లిఫ్ట్ చేయగానే వైదేహి కంగారుగా యామిని కళ్లు తిరిగి కింద పడిపోయింది అని చెప్తుంది. వెంటనే రాజ్ నేను వస్తున్నాను ఆంటీ అంటూ కావ్యకు చెప్పి వెళ్లిపోతాడు. రుద్రాణి హ్యాపీగా ఫీలవుతుంది. ఇక కావ్య, రాజ్ పర్మినెంట్‌గా విడిపోయినట్టే అని మనసులో అనుకుంటుంది. మరోవైపు కావ్య రూంలోకి వెళ్లిన రాహుల్ అక్కడ అప్పు పెట్టిన నగలు కొట్టేస్తాడు. యామినికి డాక్టర్ ట్రీట్‌మెంట్ ఇస్తుంటాడు. ఇంతలో రాజ్ వస్తాడు.
డాక్టర్: సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల ఇలా జరిగింది
రాజ్: ఇప్పుడు తన కండీషన్ ఎలా ఉంది డాక్టర్
డాక్టర్: పర్వాలేదు.. మెడిసిన్స్ రాశాను రెగ్యులర్‌గా వాడండి.. బాబు మీరు ఒకసారి బయటకు రండి (రాజ్‌ను బయటకు తీసుకెళ్తాడు.) తను కళ్లు తిరిగి పడిపోయింది. ఫుడ్ వల్ల కాదు. డిప్రెషన్ వల్ల.. పేషెంట్ ముందు చెప్పకూడదు కాబట్టి ఇక్కడ చెప్తున్నాను. ముందు అదేంటో కనుక్కోండి
అని చెప్పి డాక్టర్ వెళ్లిపోతాడు. ఇంతలో వైదేహి ఆమె భర్త వస్తారు.
రాజ్: మీరు యామిని గురించి ఎందుకు పట్టించుకోవడం లేదా..?
వైదేహి: అది ఇలా కావడానికి కారణం మేము కాదు మీరే.. అది మీ వల్లే ఇలా అయిపోయింది
యామిని డోర్ చాటు నుంచి వింటుంది.
రాజ్: ఏంటి అంటీ మీరు అంటున్నది.
వైదేహి: అవును బాబు ఇన్నేళ్లకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకున్న దాని కల నిజం అవుతుందని అది ఎగిరి గంతేసింది. పెళ్లి జరిగేంత వరకు నీ పక్కనే ఉంటూ ప్రతిక్షణం నీతోనే గడపాలని ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ మీరు దాని మనసులో ఏముందో తెలుసుకుంటేనే కదా అర్తం అయ్యేది.
వైదేహి భర్త: అవును బాబు తన మనసులోని బాధను మాతో చెప్పుకోలేక.. తనలో తానే నలిగిపోయింది. తన మనసులోని బాధను ఎవరి మీద చూపించాలో అర్తం కాక ఆకలి మీద చూపించింది.
వైదేహి: పుడ్ మీద కోపంతో ఇలా బెడ్ మీదకు వచ్చేలా చేసుకుంది అసలు మీకు ఈ పెళ్లి ఇష్టమేనా కాదా
రాజ్: అదేంటి ఆంటీ అలా మాట్లాడుతున్నారు ఇష్టం లేకపోతే ఇంతదూరం ఎందుకు తీసుకొస్తాను
వైదేహి: నిజంగా మీకు ఈ పెళ్లి ఇష్టం అని నేను నమ్మాలంటే నాకు ఒక మాట ఇవ్వండి
రాజ్: ఏంటి ఆంటీ అది
వైదేహి: ముందు నాకు ప్రామిస్ చేయండి అప్పుడు చెప్తాను
రాజ్: మాట ఇస్తున్నాను ఆంటీ ఏంటో చెప్పండి
వైదేహి: నా కూతురుని రెండు రోజులు ఎటైనా తీసుకెళ్లండి.. తనను మళ్లీ సంతోషపెట్టి నార్మల్ మనిషిని చేయండి. అది కూడా రేపే
రాజ్: రేపా.. రేపు నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉంది ఆంటీ..
వైదేహి: నా కూతురు కన్నా ఇంపార్టెంట్ పనా బాబు..
అంటూ వైదేహి తన భర్త ఇద్దరూ కలిసి ఎమోనల్ అయినట్టు యాక్టింగ్ చేస్తారు. అది నిజమే అనుకున్న రాజ్ వారి ఎమోషన్‌కు కనెక్ట్ అవుతాడు. వారి కండీషన్‌కు ఓకే చెప్తాడు. దీంతో డోర్ చాటు నుంచి వింటున్న యామిని హ్యాపీగా ఫీలవుతుంది. వేదేహియామిని దగ్గకు వెళ్లి నువ్వు చెప్పినట్టే రిసార్ట్‌కు తీసుకెళ్లెందుకు ఒప్పించాము ఇప్పటికైనా నీ ప్లానేంటో చెప్పు అని అడుగుతుంది. దీంతో రాజ్‌తో తన శోభనం చేసుకుంటున్నట్టు యామిని చెప్తుంది. దీంతో వైదేహి షాక్ అవతుంది. ఇలాంటి పిచ్చి పనులు చేయకు అంటూ హెచ్చరిస్తుంది. అయినా వినకుండా వెళ్లిపోతుంది యామిని. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!