Honda CB125 Hornet vs Bajaj Pulsar N125 Comparison: హోండా, తన కొత్త 125cc సెగ్మెంట్ బైక్ CB125 హార్నెట్‌ను లాంచ్ చేసింది, బజాజ్ పల్సర్ N125 కు డైరెక్ట్ పోటీగా దీనిని మార్కెట్‌లోకి దింపింది. ఈ రెండు బైక్‌లు 125cc రేంజ్‌లో ఉన్నప్పటికీ.. రెండింటి స్టైల్, టెక్నాలజీ & పెర్ఫార్మెన్స్ భిన్నంగా ఉంటాయి. మీరు, బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే ఫీచర్-రిచ్ 125cc బైక్‌ను కొనాలనుకుంటే, ముందుగా వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి.
ధరహోండా CB125 హార్నెట్ ఎక్స్-షోరూమ్ ధర (Honda CB125 Hornet Price) దాదాపు రూ. 95,000 నుంచి రూ. 1 లక్ష వరకు ఉండవచ్చు, దీనిని ఆగస్టు 1, 2025న అధికారికంగా ప్రకటిస్తారు. బజాజ్ పల్సర్ N125 ధర (Bajaj Pulsar N125 Price) రూ. 93,158 నుంచి రూ. 99,213 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. బజాజ్ పల్సర్ కొంచెం చౌకగా ఉంటుంది, కానీ హోండా హార్నెట్‌లో అందుబాటులో ఉన్న ప్రీమియం ఫీచర్లు మీ డబ్బుకు తగిన విలువను అందిస్తాయి.
డిజైన్ & స్టైల్ హోండా CB125 హార్నెట్ డిజైన్ స్పోర్టీ & స్ట్రీట్ ఫైటర్ లుక్‌తో ఉంటుంది. ఇందులో షార్ప్ ట్యాంక్ డిజైన్, స్ల్పిట్ LED హెడ్‌లైట్లు & గోల్డెన్ USD ఫోర్కులు ఉన్నాయి. ఈ బైక్ నాలుగు స్టైలిష్ రంగులలో లభిస్తుంది. మరోవైపు, బజాజ్ పల్సర్ N125 లుక్ కొంచెం సాంప్రదాయకంగా ఉంటుంది, కానీ దాని ట్యాంక్‌ను బలంగా & ADV-ఇన్‌స్పిరేషన్‌తో డిజైన్ చేశారు. దీనిలో LED లైటింగ్ కూడా అందుబాటులో ఉంది. హోండా హార్నెట్ లుక్ మరింత ఆధునికంగా & స్పోర్టీగా ఉంటుంది, అయితే క్లాసిక్ & నమ్మకమైన డిజైన్‌ను కోరుకునే వారు పల్సర్ N125 ను ఇష్టపడతారు.
ఇంజిన్ & పనితీరుహోండా CB125 హార్నెట్ 123.94cc ఇంజిన్‌ను కలిగి ఉంది, ఇది 11.14 PS శక్తిని & 11.2 Nm టార్క్‌ను ఇస్తుంది. ఈ బైక్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది & కేవలం 5.4 సెకన్లలో 0 నుంచి 60 kmph వేగాన్ని అందుకుంటుంది. దీని బరువు 124 కిలోలు, 166 mm గ్రౌండ్ క్లియరెన్స్ & 12 లీటర్ల ఫ్యూటల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. బజాజ్ పల్సర్ N125 లో 124.58cc ఇంజిన్ ఉంది, ఇది 12 PS శక్తిని & 11 Nm టార్క్‌ను ఇస్తుంది. దీని బరువు 127.5 కిలోలు, 198 mm గ్రౌండ్ క్లియరెన్స్ & 9.5 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంది. ఇంజిన్ పవర్‌లో పల్సర్ N125 కొంచెం శక్తివంతమైనది. హోండా హార్నెట్ కాస్త తేలికైనది & పెద్ద ఇంధన ట్యాంక్ వల్ల సుదూర ప్రయాణాలకు చక్కగా సరిపోతుంది.
అధునాతన ఫీచర్లుహోండా CB125 హార్నెట్‌లో 4.2 అంగుళాల TFT డిస్‌ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, హోండా రోడ్‌సింక్ యాప్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, USB టైప్-సి ఛార్జర్ పోర్ట్, సింగిల్ ఛానల్ ABS, గోల్డెన్ USD ఫోర్క్ & 5-స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ వంటి అనేక అధునాతన ఫీచర్లు ఉన్నాయి. బజాజ్ పల్సర్ N125లో LCD డిస్‌ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ (టాప్ వేరియంట్లలో మాత్రమే) & సైలెంట్-స్టార్ట్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఉన్నాయి; TFT డిస్‌ప్లే, & USD ఫోర్క్ ఇందులో లేవు.
మైలేజ్ & ఇంధన రకంహోండా CB125 హార్నెట్ అంచనా వేసిన మైలేజ్ లీటరుకు 50 km నుంచి 55 kmలు; కాగా, బజాజ్ పల్సర్ N125 లీటరు దాదాపు 50 km మైలేజ్ ఇస్తుంది. రెండు బైక్‌లు E20 ఇంధనానికి అనుకూలంగా ఉంటాయి, అంటే భవిష్యత్తులో అవి పర్యావరణ అనుకూల ఇంధనానికి సిద్ధంగా ఉంటాయి.