TATA New SUVs: టాటా మోటార్స్ భారతీయ మార్కెట్లో SUV విభాగంలో అనేక కొత్త కార్లను అందిస్తోంది. కంపెనీ ఎలక్ట్రిక్ కార్లు Nexon EV, Tiago EV, Punch EVలకు దేశవ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోంది, అయితే ఇప్పుడు టాటా కేవలం EVలతోనే కాకుండా, పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో నడిచే SUVలతో కూడా మార్కెట్లో కొత్త వేగాన్ని తీసుకురావడానికి సిద్ధమవుతోంది.
మీరు కొత్త SUV కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, రాబోయే కొన్ని నెలల నుంచి 2 సంవత్సరాల వరకు సమయం మీకు చాలా ప్రత్యేకంగా ఉండవచ్చు. టాటా మోటార్స్ ఏయే కొత్త SUVలను విడుదల చేయబోతోంది. వాటిలో ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందాం.
Tata Sierra
టాటా కంపెనీకి చెందిన మోస్ట్ అవైటెడ్ SUV Sierra 2025 చివరి నాటికి రావచ్చు. ఇది 90వ దశకంలో మొదటి SUVగా ప్రజలు గుర్తించిన సియెర్రానే, కానీ ఇప్పుడు ఇది పూర్తిగా కొత్త అవతారంలో రాబోతోంది. కొత్త టాటా సియెర్రాను 2025 భారత మొబిలిటీ ఎక్స్‌పోలో ప్రదర్శించారు . అనేకసార్లు టెస్టింగ్ సమయంలో కూడా గుర్తించారు. ఈ SUVలో 1.5-లీటర్ tGDi పెట్రోల్ ఇంజిన్, 2.0-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ ఎంపిక ఉండవచ్చు.
Tata Harrier అండ్ Safari ICE
ప్రస్తుతం టాటా ఫ్లాగ్‌షిప్ SUV లు - Harrier అండ్ Safari డీజిల్ ఇంజిన్లలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే, కంపెనీ ఇప్పుడు ఈ రెండింటి పెట్రోల్ వెర్షన్‌ను కూడా తీసుకురావడానికి సిద్ధమవుతోంది. 2026 ప్రారంభంలో, ఈ కార్లలో 1.5-లీటర్ tGDi పెట్రోల్ ఇంజిన్ ఇస్తున్నారు. ఇది 168bhp శక్తిని, 350Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్ష్‌మిషన్‌తో జత చేసి ఉంటుంది. పెట్రోల్ వెర్షన్ రావడం వల్ల ఈ SUVల ధర కొంచెం చౌకగా ఉండవచ్చు, దీనివల్ల ఎక్కువ మంది కస్టమర్లు వాటిని ఎంచుకోగలుగుతారు.
Tata Punch Facelift
టాటా మోటార్స్ కంపెనీకి అత్యధికంగా అమ్ముడవుతున్న చిన్న SUV Punch ఫేస్లిఫ్ట్ వెర్షన్ 2025 చివరి నాటికి విడుదల కావచ్చు. ఈ అప్డేట్‌లో కారు రూపాన్ని చాలా మార్పులు చేస్తారు. ఇందులో పెద్ద 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్స్ట్రూమెంట్స్ క్లస్టర్, కొత్త అప్‌హోల్సరీ వంటి ఫీచర్లు ఉంటాయని భావిస్తున్నారు. అయితే, ఇంజిన్ సెటప్ ప్రస్తుత మోడల్లో ఇచ్చిన విధంగానే ఉంటుంది. టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ ముఖ్యంగా కాంపాక్ట్ సైజులో ప్రీమియం SUV ఫీచర్లను కోరుకునే కస్టమర్లకు ఉత్తమ ఎంపిక అవుతుంది.
Tata Nexon Facelift
టాటా మోటార్స్ అత్యంత విజయవంతమైన SUVలలో ఒకటైన Nexon తదుపరి ఫేస్‌లిఫ్ట్ మోడల్ 2027లో విడుదల కావచ్చు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ను కంపెనీ గరుడ్ కోడ్‌నేమ్‌తో అభివృద్ధి చేస్తోంది. ఈ SUV ప్రస్తుత ప్లాట్‌పారమ్‌పై ఆధారపడి ఉంటుంది, అయితే దాని బాహ్య అంతర్గత రూపకల్పనలో పెద్ద మార్పులు కనిపిస్తాయి. ఈ అప్డేట్‌లో మెరుగైన భద్రతా ఫీచర్లు, స్మార్ట్ కనెక్టెడ్ టెక్నాలజీ, మెరుగైన రైడ్ క్వాలిటీని చేర్చనున్నారు. కొత్త నెక్సాన్ సరికొత్త సాంకేతికత, శైలితో SUV కొనాలనుకునే కస్టమర్లకు ఉపయోగపడుతుంది.