Hero Xpulse 210 Full Details: భారతీయ మార్కెట్‌లో అడ్వెంచర్ బైక్‌లకు డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా సిటీ రైడింగ్‌తో పాటు ఆఫ్‌రోడ్ ట్రిప్స్ కూడా చేయాలనుకునే వారికి Hero Xpulse సిరీస్ ఒక నమ్మకమైన పేరు. ఇప్పుడు Hero MotoCorp, పాపులర్ అయిన Xpulse 200 4V కి వారసుడిగా Xpulse 210 ను తీసుకొచ్చింది. పాత మోడల్‌తో పాటు కొత్తది కూడా ప్రస్తుతం అమ్మకాల్లో ఉంది. అయితే, Xpulse 210 కొనేముందు తెలుసుకోవాల్సిన కొన్ని కీలక విషయాలు ఉన్నాయి.
1. Xpulse 210లో ఉన్న ఇంజిన్ ఏమిటి?
Hero Xpulse 210లో 210cc సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఇచ్చారు. ఇది 24.6hp పవర్, 20.7Nm టార్క్ ఇస్తుంది. ఇదే ఇంజిన్‌ను Karizma XMRలో కూడా వాడుతున్నా, Xpulse అవసరాలకు తగ్గట్టుగా హీరో దీనిని బాగా రీ-వర్క్ చేసింది. కొత్త క్యామ్‌లు, షార్టర్ ఫైనల్ డ్రైవ్ గేరింగ్ ఇచ్చి, లో స్పీడ్‌లో మెరుగైన కంట్రోల్ వచ్చేలా ట్యూన్ చేశారు. ఆఫ్‌రోడ్‌లో ఇది చాలా ఉపయోగపడుతుంది.
2. సస్పెన్షన్ ట్రావెల్ ఎంత ఉంటుంది?
Xpulse 210లో ముందు టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ ఉంది. ముందు 210 మి.మీ, వెనుక 205 మి.మీ. ట్రావెల్ అందిస్తున్నారు. వెనుక సస్పెన్షన్‌కు ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ మాత్రమే ఇస్తున్నారు. గ్రావెల్ రోడ్లు, మట్టి దారులు, లైట్ ట్రయల్ రైడింగ్ చేసే వారికి ఇది చాలిపోతుంది.
3. ఎన్ని వేరియంట్లు ఉన్నాయి?
Hero Xpulse 210ను రెండు వేరియంట్లలో అందిస్తున్నారు, అవి:
బేస్ వేరియంట్
టాప్ వేరియంట్
బేస్ వేరియంట్‌లో LCD డిస్‌ప్లే, చిన్న విజర్ మాత్రమే ఇస్తారు. లగేజ్ ర్యాక్, నకిల్ గార్డ్స్ ఇందులో ఉండవు.
టాప్ వేరియంట్‌లో మాత్రం TFT డిస్‌ప్లే, ఎత్తైన వైజర్, లగేజ్ ర్యాక్, నకిల్ గార్డ్స్ స్టాండర్డ్‌గా వస్తాయి.
4. కలర్ ఆప్షన్స్ ఏమున్నాయి?
బేస్ వేరియంట్‌ను వైట్ కలర్‌లో మాత్రమే ఇస్తున్నారు. టాప్ వేరియంట్‌కు మాత్రం రెండు ఆప్షన్స్ ఉన్నాయి –
సిల్వర్ – రెడ్ కలర్ స్కీమ్
రెడ్ – బ్లూ – వైట్ కలర్ స్కీమ్
5. ధర ఎంత?
Hero Xpulse 210 ధరలు ఇలా ఉన్నాయి –
బేస్ వేరియంట్: ₹1.62 లక్షలు (ఎక్స్-షోరూమ్ ధర)
టాప్ వేరియంట్: ₹1.71 లక్షలు (ఎక్స్-షోరూమ్ ధర)
ఈ ధరకు లిక్విడ్ కూల్డ్ ఇంజిన్, లాంగ్ సస్పెన్షన్ ట్రావెల్, అడ్వెంచర్ ఫ్రెండ్లీ సెటప్ రావడం పెద్ద ప్లస్.
ఫైనల్‌గా... మీరు Xpulse 200 4V నుంచి అప్‌గ్రేడ్ అవ్వాలనుకుంటే, లేదా మొదటిసారి అడ్వెంచర్ బైక్ కొనాలని చూస్తే, Hero Xpulse 210 ఖచ్చితంగా పరిశీలించాల్సిన బైక్. డైలీ రైడ్‌తో పాటు వీకెండ్ ఆఫ్‌రోడ్ ఎంజాయ్ చేయాలనుకునే తెలుగు రైడర్లకు ఇది ఒక ఆల్ రౌండర్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.