Septic Tank Dump in Gandipet Lake : హైదరాబాద్ సిటీ మొత్తానికి తాగునీరు అందించే జంట జలశాయాల్లో ఒకటైన ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్​లో సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలని డంపింగ్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలో హిమాయత్ నగర్ సమీపంలో ఎఫ్టీఎల్ పాయింట్ నంబర్ 428 వద్ద ఓ సెప్టిక్ ట్యాంకర్ వ్యర్థాలను చెరువులో డంప్ చేస్తుండగా.. ఇది గమనించిన స్థానికులు వెంటనే ఆ ట్యాంకర్‌ను అడ్డగించి డ్రైవర్‌ను నిలదీశారు. మొత్తం ఘటనను వీడియో తీయడమే కాకుండా అధికారాలకు కూడా సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే పెట్రోలింగ్ సిబ్బంది అక్కడికి చేరుకొని సెప్టిక్ ట్యాంక్ డంప్ చేస్తున్న డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ట్యాంకర్‌ను సీజ్ చేశారు.

Continues below advertisement

అధికారుల విచారణలో డ్రైవర్‌ను సైదాబాద్ ఏరియాలోని సింగరేణి కాలనీకి చెందిన రామావత్ శివ నాయక్‌గా గుర్తించారు. అనంతరం వాటర్ బోర్డు ఎస్బీ ఉస్మాన్ నగర్ సెక్షన్ డీజీఎంఈ నరహరి ఈ ఘటనపై కంప్లైంట్ ఇవ్వడంతో.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. వారిద్దరిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. గండిపేట్ ఉస్మాన్ సాగర్ జలాశయాల్లోకి వ్యర్ధాలను వదిలిన డ్రైవర్ శివ, ఓనర్ రాములపైన కేసు రిజిస్టర్‌ చేశారు. ప్రజా నీటి వనరులని కలుషితంచేసినందుకుగాను కేసు నమోదు చేశారు. Bns 279 సెక్షన్ వాటర్ క్రిమేషన్ ఆఫ్ పొల్యూషన్ కంట్రోల్ యాక్ట్ కింద కేసులు పెట్టారు. సెప్టిక్ ట్యాంకర్‌పైన అనుమతి లేకుండా జిహెచ్ఎంసి, జలమండలి, లోగోను ఏర్పాటు చేసినట్టు తేల్చారు. ఈ ఘటనపై మండిపడ్డ స్థానికులు.. ప్రజలు తాగే నీటిలో సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలు కలుపుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

Continues below advertisement

దుండిగల్ సర్కిల్ పరిధి బౌరం పేట్ ఔటర్ రింగ్ ప్రాంతంలో ఇలాంటి పరిస్థితి ఉందని ప్రజలు వాపోతున్నారు. ఇక్కడ కూడా కెమికల్ మాఫియా బుసలు కొడుతుందని అంటున్నారు. జీడిమెట్ల పారిశ్రామిక, కాజిపల్లి , గడ్డపోతారం ప్రాంతాలలో కెమికల్ కంపెనీలు విపరీతంగా ఉండడంతో అక్కడి కంపెనీలు జి టి ఎల్‌కు కెమికల్ పంపిస్తే లక్షల కొద్ది డబ్బులు కట్టాల్సి వస్తుందని ఉద్దేశంతో కెమికల్  మాఫియాకు డబ్బు ఆశ చూపి కెమికల్ పారబోయిస్తున్నారు. వీళ్లు నిర్మానుష్య ఖాళీ ప్రదేశంలో డ్రమ్ములలో తీసుకువచ్చి పడేస్తున్నారు. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో బోర్ వేస్తే చాలు కెమికల్ నీరు దర్శనమిస్తుంటాయి. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఎటు చూసినా భూగర్భ జలం పూర్తిగా కలుషితమై పోతున్నాయి. ఇక్కడి నుంచి కొన్ని పరిశ్రమలను తరలించినప్పటికీ ఆ పరిశ్రమ గతంలో కెమికల్ పారాబోయడంతో ప్రస్తుతం ఆ కెమికల్ ఇప్పటికి కూడా కనిపిస్తూనే ఉంది. 

గత కొన్ని రోజులుగా రాత్రి సమయాల్లో వివిధ ప్రాంతాల నుంచి కెమికల్ తీసుకువచ్చి బౌరంపేట్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో గుట్టు చప్పుడు కాకుండా వ్యర్ధాలను తీసుకువచ్చి పారబోస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. బౌరంపేట పరిసర ప్రాంతాల్లో ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. బౌరంపేట పరిసర ప్రాంతాల్లో అనేక ఇంటర్నేషనల్ స్కూల్స్, నివాస గృహాలు ఉండడంతో ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. పి సి బి అధికారులు, పోలీసు అధికారులు స్పందించి వెంటనే ఈ కెమికల్ మాఫియా ముఠాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. 

ట్రీట్మెంట్ ఖర్చు ఎక్కువ కావడం వల్లే ఫార్మా కంపెనీలు వ్యర్ధాలను బయట పారబోస్తున్నారనేదే కేవలం ఒక సాకు మాత్రమే, చాలా కంపెనీలు అనుమతి పొందిన ప్రోడక్ట్ కాకుండా ఇతర ప్రోడక్ట్ ను కూడా తయారు చేస్తున్నారు అనేది బహిరంగ రహస్య మంటున్నారు స్థానికులు. వాటిని ట్రీట్‌మెంట్‌కి పంపిస్తే చేసిన ప్రోడక్ట్ గుట్టురట్టు అవుతుందని కెమికల్ మాఫియాతో ఒప్పందాల కుదుర్చుకొని ఇలాంటి ఆగడాలను కెమికల్ కంపెనీ వారు చేస్తున్నారని విస్తుపోతున్నారు. 

సామాజిక కార్యకర్త రవీందర్ ముదిరాజ్ మాట్లాడుతూ..... జీడిమెట్లలోని సుభాష్ నగర్ గంపల బస్తి  గడ్డపోతారం కాజిపల్లి పారిశ్రామిక ప్రాంతాల నుండి విష రసాయనాలను తీసుకువచ్చి నిర్మానుష ప్రాంతాలలో అర్థరాత్రి సమయంలో గుట్టుచప్పుడు కాకుండా కెమికల్ వ్యర్ధాలను వదిలేసి వెళ్లిపోవడం సర్వసాధనమైపోయింది. అటు పీసీపీ అధికారులు మరియు పోలీస్ సిబ్బంది కెమికల్ మాఫియా పై నిఘా పెట్టి వీరిపై క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలి అని వారు తెలిపారు.