Hero Splendor GST Price Drop After GST 2025: దేశవ్యాప్తంగా, 22 సెప్టెంబర్‌ 2025 నుంచి కొత్త GST రేట్లు అమల్లోకి వచ్చాయి, కొత్త వెహికల్స్‌ కొనేవాళ్లకు పండుగ సంతోషాన్ని రెట్టింపు చేశాయి. కొత్త రేట్లు బైక్‌ మార్కెట్‌ను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తున్నాయి & సేల్స్‌ పెంచాయి. ప్రధానంగా, 5% & 18% GST శ్లాబ్‌ల మార్పు.. 350 సిసి కంటే తక్కువ ఇంజిన్‌ కలిగిన బైక్‌లు & స్కూటర్ల ధరలను సామాన్యుడి చేతికి అందే ఎత్తులోకి తగ్గించింది. తత్ఫలితంగా, సాధారణ కస్టమర్లు ఇప్పుడు తమకు ఇష్టమైన బైక్‌లను మునుపటి కంటే సరసమైన ధరలకు కొంటున్నారు. ఇలా, తగ్గింపు పొందిన మోటారు సైకిళ్లలో Hero Splendor కూడా ఒకటి.

Continues below advertisement

Hero Splendor తాజాగా మరింత ఆకర్షణీయమైన లుక్స్‌లో వచ్చింది. కొత్త ఫ్యారింగ్ డిజైన్ ఈ బైక్‌ను స్పోర్టీగా & మోడ్రన్‌గా చూపిస్తుంది. సీట్‌, ట్యాంక్ & హ్యాండ్‌ల్‌ బార్‌ల ఫినిష్ కలిసిపోతూ ఓవరాల్‌ స్టైలింగ్‌లో సరైన బ్యాలెన్స్‌ కుదిరింది. షార్ప్‌ హెడ్‌ల్యాంప్స్‌ & స్లీక్‌ రియర్ ఎండ్ డిజైన్ ఈ మోటార్‌ సైకిల్‌కు ప్రీమియం టచ్‌ ఇచ్చాయి.

GST తగ్గింపు తర్వాత, Hero Super Splendor XTEC లో రెండు వేరియంట్‌ల ధరలు సుమారు రూ. 7,000 తగ్గాయి & కొత్త కస్టమర్లకు ఈ డబ్బు మొత్తం ఆదా అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణలో, సూపర్ స్ల్పెండర్ XTEC డిస్క్ బ్రేక్ వేరియంట్‌ ఇప్పుడు రూ. 86,283 (ఎక్స్-షోరూమ్) కు & సూపర్ స్ల్పెండర్ XTEC డ్రమ్ బ్రేక్ OBD2B వేరియంట్ రూ. 82,734 (ఎక్స్-షోరూమ్) కు అందుబాటులో ఉంది.

Continues below advertisement

హీరో స్ప్లెండర్ ఇంజిన్ & మైలేజ్ Hero Splendor Plus స్ల్పెండర్ ప్లస్ 97.2 cc BS6 ఫేజ్-2 OBD2B కంప్లైంట్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో పని చేస్తుంది. ఈ ఇంజిన్ 8.02 PS పవర్ & 8.05 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది & 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో సాఫీగా సాగిపోతుంది. దీని గరిష్ట వేగం గంటకు 87 కి.మీ.  హీరో స్ప్లెండర్ అతి పెద్ద హైలైట్ దీని ఇంధన సామర్థ్యం, ఇది లీటరుకు 70-80 కి.మీ. మైలేజీ అందిస్తుంది. ఫలితంగా, తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఇంధన-సమర్థవంతమైన కమ్యూటర్ బైక్‌లలో ఒకటిగా నిలిచింది.

హీరో స్ప్లెండర్ ప్లస్ డిజైన్ Hero Splendor Plus డిజైన్ టఫ్‌గా ఉండదు, చాలా సింపుల్‌గా & క్లాసిక్‌గా ఉంటుంది, అన్ని వయసుల వారికి చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. కొత్త మోడల్‌లో మెరుగైన గ్రాఫిక్స్ & డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్స్‌ ఉన్నాయి. ఈ కలర్‌ ఆప్షన్స్‌లో -  హెవీ గ్రే విత్ గ్రీన్, బ్లాక్ విత్ పర్పుల్ & మ్యాట్ షీల్డ్ గోల్డ్ ఉన్నాయి. కాంపాక్ట్ బాడీ & లైట్ వెయిట్ కారణంగా ఈ బండిని సిటీ ట్రాఫిక్‌లో & గ్రామీణ ప్రాంతాలలో చాలా సులభంగా నడపవచ్చు.

హీరో స్ప్లెండర్ ఫీచర్లుహీరో స్ప్లెండర్ XTEC అనేది మోడ్రన్‌ ఫీచర్లతో కూడిన ప్రీమియం కమ్యూటర్ బైక్ & రోజువారీ ప్రయాణాలకు ఇది అద్భుతమైన ఎంపిక. LCD డిస్‌ప్లే & బ్లూటూత్ కనెక్టివిటీ దీని ప్రత్యేకతలు. మిస్డ్ కాల్ అలర్ట్‌లు, SMS అలర్ట్‌లు & ఇన్‌కమింగ్ కాల్ నోటిఫికేషన్‌లు వంటి ఫీచర్లను ఇది అందిస్తుంది.

మన మార్కెట్లో, Honda Shine & Bajaj Platina వంటి బైక్‌లతో హీరో స్ప్లెండర్ పోటీ పడుతుంది. హీరో స్ప్లెండర్ ప్లస్‌ క్లెయిమ్డ్‌ మైలేజ్ లీటరుకు 70 కిలోమీటర్లు. దీంతో పోలిస్తే. బజాజ్ ప్లాటినా 100 క్లెయిమ్డ్‌ మైలేజ్ లీటరుకు 70 నుంచి 75 కిలోమీటర్లు.