Hero Splendor Plus vs Honda Shine 100 Price Comparison: భారత ప్రభుత్వం, 350cc లోపు ఇంజిన్ ఉన్న ద్విచక్ర వాహనాలపై GSTని 28% నుంచి 18%కి ‍‌తగ్గించింది (GST Reforms 2025). ఈ తగ్గింపు మరికొన్ని రోజుల్లో, సెప్టెంబర్ 22, 2025 నుంచి అమలులోకి వస్తుంది. జీఎస్టీ ట్రిమ్మింగ్‌ నుంచి కస్టమర్లు నేరుగా ప్రయోజనం పొందుతారు. 

ధరలు

తెలుగు రాష్ట్రాల్లో, హీరో స్ల్పెండర్‌ ప్లస్ ప్రస్తుత ఎక్స్‌-షోరూమ్‌ ధర 80,216 రూపాయలు. GST తగ్గింపు తర్వాత (18 శాతం జీఎస్టీ అమలులోకి రాగానే), స్ల్పెండర్‌ ప్లస్ కొత్త ధర దాదాపు 73,910 రూపాయలు (Hero Splendor Plus ex-showroom price, Hyderabad Vijayawada) కు దిగి వస్తుంది. అంటే, సెప్టెంబర్ 22 లేదా ఆ తర్వాత ఈ బండిని కొన్నవాళ్లకు రూ. 6,300 వరకు ఆదా అవుతుంది.

తెలుగు నగరాల్లో, హోండా షైన్ 100 ప్రస్తుత ఎక్స్‌-షోరూమ్‌ ధర 70,562 రూపాయలు. 18 శాతం జీఎస్టీ అమలులోకి రాగానే దీని కొత్త ధర దాదాపు రూ. 64,862 కావచ్చు. దీని అర్థం.. షైన్ 100 రేటు దాదాపు రూ. 5,700 (Honda Shine 100 ex-showroom price, Hyderabad Vijayawada)వరకు తగ్గుతుంది.

ఇంజిన్ & పనితీరు

హీరో స్ల్పెండర్‌ ప్లస్ 97.2 cc ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో పని చేస్తుంది, ఇది 7.9 bhp & 8.05 Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. ఈ ఇంజిన్‌కు 4-స్పీడ్ గేర్‌బాక్స్ & ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్‌ను యాడ్‌ చేశారు. ఆక్సిలేటర్‌ను ఫుల్‌ రైజ్‌ చేస్తే, హీరో స్ల్పెండర్‌ ప్లస్ గరిష్టంగా గంటకు 87 కి.మీ. వేగంతో దూసుకెళ్లగలదు.

హోండా షైన్ 100 ఇంజిన్‌ కెపాసిటీ 98.98cc, ఇది 10.6 bhp & 8.05 Nm టార్క్‌ జనరేట్‌ చేస్తుంది. ఈ ఇంజిన్‌ PGM-Fi ఇంధన వ్యవస్థతో అనుసంధానమై ఉంటుంది. స్మూత్‌ రైడింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ కోసం ఈ మోటార్‌ సైకిల్‌కు కూడా 4-స్పీడ్ గేర్‌బాక్స్‌ ఇచ్చారు. హోండా షైన్‌ 100 గరిష్టంగా గంటకు 102 km వేగాన్ని చేరుకోగలదు. దీనిని బట్టి, పనితీరు పరంగా, షైన్ 100 స్ల్పెండర్‌ ప్లస్ కంటే శక్తిమంతమైనది.

మైలేజీ

మన దేశంలో కమ్యూటర్ బైకులను ఎంచుకోవడానికి మైలేజ్ ఒక ప్రధాన కారణం. హీరో స్ల్పెండర్‌ ప్లస్ లీటరు పెట్రోల్‌కు దాదాపు 70 కి.మీ. మైలేజీ అందిస్తుంది, ఇది దాని విభాగంలో అత్యుత్తమ నంబర్‌. 

హోండా షైన్ 100 లీటరుకు సుమారు 55-60 కి.మీ. మైలేజీని అందిస్తుంది. అందువల్ల, తరచుగా ప్రయాణించేవారికి & పెట్రోల్ ఆదా చేయాలనుకునే వారికి హీరో స్ల్పెండర్‌ ప్లస్ మంచి ఎంపిక అవుతుంది.

ఫీచర్లు & డిజైన్

హీరో స్ల్పెండర్‌ ప్లస్ i3S ఐడిల్ స్టార్ట్-స్టాప్ సిస్టమ్, ట్యూబ్‌లెస్ టైర్లు & xSENS Fi టెక్నాలజీని కలిగి ఉంది. ఇది ఎక్కువ ఇంధన-సమర్థవంతంగా & నమ్మకంగా పని చేస్తుంది. 

హోండా షైన్ 100 కొత్త గ్రాఫిక్స్, డిజిటల్ LCD డిస్‌ప్లే & ఆధునిక టచ్‌లను కలిగి ఉన్న ఫ్రెష్‌ & మోర్‌ స్టైలిష్ డిజైన్‌తో ఉంటుంది. కొంచెం స్టైల్ & ఆధునిక ఆకర్షణ కోసం చూస్తున్న వారికి షైన్ 100 మంచి ఎంపికగా కనిపిస్తుంది.

ఏది కొనడం ఎక్కువ లాభదాయకం?

GST తగ్గింపు తర్వాత రెండు బైకులు చౌకగా మారాయి. బడ్జెట్‌లో ఎక్కువ పవర్ & స్టైల్ కావాలంటే హోండా షైన్ 100 సరైన ఎంపిక. ఎక్కువ మైలేజ్ & ఎక్కువ కాలం పాటు నమ్మకమైన పనితీరు కావాలంటే హీరో స్ల్పెండర్‌ ప్లస్ ఇప్పటికీ సురక్షితమైన & అత్యంత అందుబాటు ధర ఎంపిక.