Reduced Car Prices After GST Cut 2025: జీఎస్టీ రేట్లు మారుస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భారతదేశవ్యాప్తంగా కార్ల ధరల్లో భారీ షార్ట్‌ఫాల్‌ కనిపించింది. చిన్న కార్లపై జీఎస్టీ 28% నుంచి 18% కు తగ్గింది. అలాగే, SUVలపై ఉన్న సెస్‌ తొలగించడంతో వాటి రేట్లు కూడా తగ్గాయి. ఈ పండుగ సీజన్‌లో కొత్త కారు కొనేవాళ్లకు ఇప్పుడు గట్టి ప్రయోజనం కలుగుతుంది.

కంపెనీ వారీగా కారు ధరల తగ్గుదల:

ఫోక్స్‌వ్యాగన్ (22 సెప్టెంబర్ 2025 నుంచి)

  • టిగువాన్ ఆర్-లైన్ - రూ.3.26 లక్షలు తగ్గింపు
  • విర్టస్‌పై రూ.66,900, టైగన్‌పై రూ.68,400 వరకు

టయోటా (కిర్లోస్కర్ మోటార్స్) (22 సెప్టెంబర్ 2025 నుంచి)

  • ఫార్చునర్: రూ.3.49 లక్షలు
  • లెజెండర్: రూ.3.34 లక్షలు
  • హైలక్స్: రూ.2.52 లక్షలు
  • వెల్‌ఫైర్: రూ.2.78 లక్షలు
  • కామ్రీ: రూ.1.01 లక్షలు
  • ఇన్నోవా క్రిస్టా: రూ.1.08 లక్షలు
  • ఇన్నోవా హైక్రాస్: రూ.1.15 లక్షలు

టాటా మోటార్స్ (8 సెప్టెంబర్ 2025 నుంచి)

  • సఫారీ: దాదాపు రూ.1.45 లక్షలు
  • టియాగో: రూ.75 వేలు
  • టిగోర్: రూ.80 వేలు
  • ఆల్ట్రోస్: రూ.1.10 లక్షలు
  • పంచ్: రూ.85 వేలు
  • నెక్సాన్: రూ.1.55 లక్షలు
  • కర్వ్: రూ.65 వేలు
  • హ్యారియర్: రూ.1.40 లక్షలు

స్కోడా (22 సెప్టెంబర్ 2025 నుంచి)

  • స్కైలాక్: రూ.1.19 లక్షల వరకు
  • కోడియాక్: రూ.3.30 లక్షలు
  • కుషాక్: రూ.66 వేలు
  • స్లావియా: రూ.63 వేలు

మారుతి సుజుకి (22 సెప్టెంబర్ 2025 నుంచి)

  • స్విఫ్ట్: రూ.1.06 లక్షలు
  • ఆల్టో K10: రూ.53 వేలు
  • ఎస్-ప్రెస్సో: రూ.53 వేలు
  • వ్యాగన్‌ ఆర్: రూ.64 వేలు
  • సెలెరియా: రూ.63 వేలు
  • డిజైర్: రూ.87 వేలు
  • బాలెనో: రూ.85 వేలు

మహీంద్రా (6 సెప్టెంబర్ 2025 నుంచి)

  • XUV 3XO డీజిల్: రూ.1.56 లక్షలు
  • బొలెరో నియో: రూ.1.27 లక్షలు
  • XUV 3XO పెట్రోల్: రూ.1.40 లక్షలు
  • థార్: రూ.1.35 లక్షలు
  • థార్‌ రాక్స్: రూ.1.33 లక్షలు
  • స్కార్పియో: రూ.1.01 లక్షలు
  • స్కార్పియో ఎన్: రూ.1.45 లక్షలు
  • XUV 700: రూ.1.43 లక్షలు

కియా (22 సెప్టెంబర్ 2025 నుంచి)

  • సోనెట్: రూ.1.64 లక్షలు
  • సైరోస్: రూ.1.86 లక్షలు (!!)
  • సెల్టోస్: రూ.75 వేలు
  • కారెన్స్: రూ.48 వేలు
  • కారెన్స్ క్లావిస్: రూ.78 వేలు
  • కార్నివాల్: రూ.4.48 లక్షలు

హ్యుందాయ్ ఇండియా (22 సెప్టెంబర్ 2025 నుంచి)

  • వెన్యూ: రూ.1.23 లక్షలు
  • నియోస్: రూ.73 వేలు
  • ఎక్స్‌టర్: రూ.89 వేలు
  • ఐ20: రూ.98 వేలు
  • ఐ20 N లైన్: రూ.1.08 లక్షలు
  • వెన్యూ న్ లైన్: రూ.1.19 లక్షలు
  • వెర్నా: రూ.60 వేలు
  • క్రెటా: రూ.72 వేలు, N లైన్: రూ.71 వేలు
  • ఆల్కాజార్: రూ.75 వేలు

ఈ కొత్త జీఎస్టీ విధానంతో, కార్ కొనాలని ప్లాన్ చేసుకున్నవారికి ఇది బంగారు సమయం! మీరు మీ ఇష్టమైన మోడల్ కొంటే… ఇప్పుడు ధర తగ్గిందేమో చెక్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు.