Upcoming Tata SUVs Under Rs 10 Lakh: మీరు టాటా మోటార్స్ బ్రాండ్ నుంచి కొత్త SUV కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఈ వార్త మీ కోసమే. ఈ కంపెనీ, త్వరలో, రూ. 10 లక్షల కంటే తక్కువ ధరలో మూడు కొత్త SUVలను మార్కెట్లో విడుదల చేయవచ్చు. 4 మీటర్ల విభాగంలో తన పట్టును బలోపేతం చేయడమే ఈ లాంచ్‌ల లక్ష్యం. ముందుగా, కంపెనీ ఈ సంవత్సరం నవంబర్‌లో టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్‌ను ప్రారంభించవచ్చు. మిగిలిన రెండు మోడళ్లను రాబోయే మూడు సంవత్సరాలలో తీసుకురానుంది.
Tata Punch Facelift 20252025 నవంబర్‌లో లాంచ్ కానున్న కొత్త టాటా పంచ్, ఇప్పుడున్న మోడల్ కంటే మరింత అధునాతన ఫీచర్లతో వస్తోంది. రిపోర్ట్స్ ప్రకారం, పంచ్ ఫేస్‌లిఫ్ట్ 2025 వెర్షన్‌లో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది, ఇది ప్రస్తుతం ఉన్న 7.0-అంగుళాల స్క్రీన్‌ను భర్తీ చేస్తుంది. దీంతో పాటు, 4-అంగుళాల డ్రైవర్ డిస్‌ప్లే స్థానంలో పెద్ద డిజిటల్ ప్యానెల్ ఏర్పాటు చేస్తారని భావిస్తున్నారు. ఇంజిన్ ఎంపికల్లో - ఇప్పటికే ఉన్న 1.2 లీటర్ పెట్రోల్ & పెట్రోల్-CNG ఇంజిన్ పంచ్ ఫేస్‌లిఫ్ట్ 2025లోనూ అందుబాటులో ఉంటాయి. అయితే, కొత్త CNG వెర్షన్‌ను 5-స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (AMT)తో కూడా ప్రారంభించవచ్చు, ప్రస్తుతం పంచ్ CNG 5-స్పీడ్ మాన్యువల్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.
2027లో రానున్న కొత్త Tata Nexonభారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ SUVలలో టాటా నెక్సాన్ ఒకటి. కంపెనీ, తన రెండో తరం మోడల్ (కోడ్‌నేమ్: గరుడ) ను 2027లో విడుదల చేయవచ్చు. ఈ SUVలో 1.2 లీటర్ పెట్రోల్ & పెట్రోల్-CNG ఇంజిన్లు ఉంటాయి. అయితే, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఇందులో ఇవ్వడం లేదు. కొత్త నెక్సాన్‌లో 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, లెవెల్-2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవింగ్ అసిస్ట్ సిస్టమ్) సూట్ & పవర్ డ్రైవర్ సీటు సహా చాలా ప్రీమియం ఫీచర్లు ఇస్తారు. ఈ లక్షణాల కారణంగా, ఈ SUV తన విభాగంలో మరింత బలమైన పోటీదారుగా మారుతుంది.
Tata Scarlett: కొత్త ఆఫ్-రోడ్ SUVటాటా మోటార్స్ తన కొత్త స్కార్లెట్ SUVని కూడా లాంచ్ చేయనుంది. ఇది పవర్‌ఫుల్ & మస్క్యులర్ SUV అవుతుంది, దీనిని ప్రత్యేకంగా ఆఫ్-రోడింగ్ కోసం డిజైన్ చేశారు. ఇది మహీంద్రా థార్ & మారుతి సుజుకి జిమ్నీలతో డైరెక్ట్‌గా పోటీ పడగలదు. స్కార్లెట్, రూపంలో మాత్రమే కాకుండా పనితీరులో కూడా రఫ్ & టఫ్ అనిపించే విధంగా రూపొందిస్తున్నారు. రాబోయే సంవత్సరాల్లో జరిగే ఆటో ఎక్స్‌పోల్లో కంపెనీ ఈ వెహికల్‌ను ప్రదర్శించే పనిలో ఉంది.