Hero Motocorp Sales Report: 2023 జూన్‌లో హీరో మోటోకార్ప్ మొత్తం 4,36,993 యూనిట్లను విక్రయించింది. 2022 జూన్‌లో కంపెనీ మొత్తం 484,867 యూనిట్లను విక్రయించింది. గత నెలలో హీరో మొత్తం దేశీయ విక్రయాలు 422,757 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇది గత ఏడాది జూన్‌లో విక్రయించిన 463,210 యూనిట్ల కంటే 8.7 శాతం తక్కువ. దేశంలోని చాలా ప్రాంతాల్లో రుతుపవనాల ప్రారంభం ఉంది. అలాగే మొత్తం ఆర్థిక డిమాండ్‌లో పెరుగుదల బాగానే ఉంది. రాబోయే పండుగ సీజన్‌లో అమ్మకాలు బాగా పెరుగుతాయని భావిస్తున్నారు.


త్వరలో కొత్త మోటార్‌సైకిల్‌ విడుదల
Hero MotoCorp, Harley-Davidson తమ మొదటి మోటార్‌సైకిల్ Harley-Davidson X440ని జైపూర్‌లోని హీరో సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ (CIT)లో జూలై 3వ తేదీన ఆవిష్కరించనున్నాయి. దీని కారణంగా కంపెనీ అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది.


హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 4వీ లాంచ్
ఈ సంవత్సరం అనేక కొత్త ఉత్పత్తులను ప్రారంభించడంతో పాటు, కంపెనీ గత నెలలో ప్రీమియం విభాగంలో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 4వీని కూడా పరిచయం చేసింది. దీంతో పాటు ఈ విభాగంలో కంపెనీ తన పట్టును మరింత వేగంగా పెంచుకుంటోంది. మోటార్‌సైకిల్ అనేక కాస్మెటిక్, మెకానికల్ అప్‌డేట్‌లను పొందినప్పటికీ ఇది కొత్త తరం మోడల్‌గా లాంచ్ అయింది.


రెండు కొత్త బైక్‌లు లాంచ్
2023 జూన్‌లో కంపెనీ తన అత్యంత ప్రజాదరణ పొందిన 100సీసీ మోటార్‌సైకిళ్లలో ఒకటైన హెచ్ఎఫ్ డీలక్స్, ప్యాషన్ ప్లస్‌లను కొత్త లుక్‌ల్లో విడుదల చేసింది. కొత్త డిజైన్ ఐ హెచ్‌ఎఫ్ డీలక్స్‌తో, కంపెనీ మార్కెట్‌లో అమ్మకాలను పెంచుతుందని భావిస్తున్నారు. కంపెనీ తన జనాదరణ పొందిన ప్యాషన్ మోడల్‌ను బలోపేతం చేసి, కొత్త ప్యాషన్ ప్లస్‌గా మళ్లీ లాంచ్ చేసింది. మరిన్ని ఫీచర్లను పెంచుతూ దాని డిజైన్‌కు కొత్త టచ్ ఇచ్చింది.


ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీ
'హీరో వి కేర్' ఫ్లాగ్‌షిప్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్సార్) ప్లాట్‌ఫారమ్‌లో దాని వృద్ధిని పెంచడానికి కంపెనీ తన ప్రత్యేకమైన 'హీరో సెల్యూట్స్ హీరోస్ ఆఫ్ ది నేషన్' కార్యక్రమంలో భాగంగా నేవీ వెల్ఫేర్ & వెల్‌నెస్ అసోసియేషన్‌తో భాగస్వామ్యం కలిగి ఉంది. ఈ భాగస్వామ్యం ప్రకారం నాడీ సంబంధిత వైకల్యాలతో పుట్టిన పిల్లలకు ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ థెరపీ, స్పోర్ట్స్, కౌన్సెలింగ్‌ను అందించే ఢిల్లీలోని ఇనిషియల్ ఇంటర్వెన్షన్ సెంటర్ అయిన చేత్నాకు కంపెనీ మద్దతు ఇస్తుంది.


కొత్త డియో హెచ్ స్మార్ట్‌ను లాంచ్ చేసిన తర్వాత హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా కొత్త ఓబీడీ2 కంప్లైంట్ 2023 యూనికార్న్‌ను కూడా ఇటీవలే మన దేశంలో విడుదల చేసింది. దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.1,09,800గా ఉంది. ఇది పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, ఇంపీరియల్ రెడ్ మెటాలిక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, పెర్ల్ సైరన్ బ్లూ కలర్ ఆప్షన్లలో లాంచ్ అయింది.


కొత్త 2023 హోండా యూనికార్న్‌లో బీఎస్6 OBD2 కంప్లైంట్ 160 సీసీ PGM-FI ఇంజన్ అందించారు. ఇది మెరుగైన పనితీరు, మైలేజీని అందిస్తుందని పేర్కొన్నారు. ఈ ఇంజన్ 7,500 ఆర్పీయం వద్ద 12.9 బీహెచ్‌పీ శక్తిని, 5,500 rpm వద్ద 14 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో పెయిర్ అయింది. కౌంటర్ వెయిట్ బ్యాలెన్సర్‌ను కూడా అమర్చారు. ఇది వైబ్రేషన్‌ను తగ్గిస్తుంది. తక్కువ నుంచి అధిక rpm వరకు యాక్సెలరేషన్ వేగంగా లభిస్తుంది.













Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!



Join Us on Telegram: https://t.me/abpdesamofficial