కేంద్ర ప్రభుత్వం ఇటీవల GST స్లాబ్స్ తగ్గించింది. అందులో భాగంగా కొన్ని రకాల బైకులు, కార్లపై జీఎస్టీ భారాన్ని ప్రజలపై తగ్గించింది. మొదట ద్విచక్ర వాహనాలపై 28 శాతం GST ఉండేది, ఇప్పుడు దానిని 18 శాతానికి తగ్గించారు. సెప్టెంబర్ 22 నుండి కొత్త పన్ను స్లాబ్ అమలులోకి వస్తుంది. ఇది స్కూటర్లు, మోటార్‌సైకిల్స్ కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి నేరుగా ప్రయోజనం చేకూరుస్తుంది. హోండా యాక్టివా, TVS జూపిటర్ వంటి ఫేమస్ స్కూటీల ధరలు ఎంత తగ్గుతాయని కొనుగోలుదారులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
హోండా యాక్టివా vs టీవీఎస్ జూపిటర్
భారత మార్కెట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్ హోండా యాక్టివా. ఇది తక్కువ మెయింటనెన్స్ ఖర్చు, అధిక రీసేల్ విలువకు ఈ బ్రాండ్ ప్రసిద్ధి చెందింది. హోండా యాక్టివా ప్రస్తుత ఎక్స్-షోరూమ్ ధర రూ. 81,045 రూపాయలుగా ఉంది. అదే సమయంలో, GST 18 శాతానికి తగ్గింపు తర్వాత, దీని ధర దాదాపు 73,171 రూపాయలు అవుతుంది. టీవీఎస్ జూపిటర్ 110 ఎక్స్-షోరూమ్ ధర రూ. 77 వేలు ఉంది. GST కోత తర్వాత ఈ ధర 70 వేల రూపాయలకు దిగొస్తుంది. ఇది 113.3cc, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో మార్కెట్లోకి వస్తుంది. ఇది 7.91 PS పవర్, 9.8 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
భారతదేశంలో విక్రయించే చాలా ద్విచక్ర వాహనాల ఇంజిన్ సామర్థ్యం 350cc కంటే తక్కువ కలిగి ఉంటాయి. ప్రభుత్వం ఈ విభాగంపై దృష్టి సారించి GST రేటును 10 శాతం తగ్గించింది. అంటే, Honda Activa స్కూటీలతో పాటు TVS Jupiter వంటి స్కూటర్లు దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ద్విచక్ర వాహనాలు అని తెలిసిందే. సెప్టెంబర్ 22 నుంచి ఇవి మునుపటి కంటే చాలా చౌకగా లభిస్తాయి.
ప్రజలకు కేంద్రం నవరాత్రి కానుక
GST తగ్గింపు నిర్ణయం పండుగ సీజన్‌కు సిద్ధమవుతున్న సమయంలో వచ్చింది. ధనత్రయోదశి, దసరా, దీపావళి దర్భంగా ప్రజలు కొత్త వాహనాలు కొనడం మంచిదని భావిస్తారు. అటువంటి పరిస్థితిలో దేశంలో స్కూటర్లు, మోటార్‌సైకిళ్ల ధరలు తగ్గడంతో వాటి అమ్మకాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇది కంపెనీలు , కస్టమర్‌లకు ప్రయోజనం చేకూరుస్తుంది.
స్కూటీలే కాకుండా, బైకులు, కొన్ని రకాల కార్లు కూడా చౌకగా లభిస్తాయి. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న Hero Splendor బైకులపై కూడా కస్టమర్‌లకు మంచి ప్రయోజనం చేకూరుతుంది. దీని ప్రస్తుత ధర రూ. 79,426, GST రేట్ కట్ తర్వాత రూ. 71,483కి దిగొస్తుందని కంపెనీలు చెబుతున్నాయి. అంటే, Splendor బైకు ధర దాదాపు రూ. 7,943 మేర తగ్గుతుంది.