Tata Harrier EV Price, Mileage And Features: టాటా మోటార్స్, తన ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్ పోర్ట్‌ఫోలియో నుంచి కొత్త కారును బయటకు తీస్తోంది, ఆల్-ఎలక్ట్రిక్ హారియర్‌ను లాంచ్ చేయబోతోంది. మంగళవారం (జూన్ 03, 2025) నాడు మంగళప్రదంగా ఈ కారు తెర తీయనుంది. ఈ కార్ నమూనాను మొదటిసారిగా ఈ సంవత్సరం జనవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2025లో ప్రదర్శించారు, కారు ప్రేమికుల దృష్టిని ఆకర్షించారు.
టాటా హారియర్ టార్గెట్ కస్టమర్లు మాత్రమే కాదు, మహీంద్రా & మహీంద్రా కంపెనీ కూడా. మహీంద్రా నుంచి రాబోతున్న ఎలక్ట్రిక్ కారు XUV.e9 మోడల్‌కు పోటీగా, దాని కన్నా ముందే దీనిని రంగంలోకి దించుతున్నారు. ఇది ఒక పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ SUV. దీని డిజైన్, ఫీచర్లు, పవర్‌ట్రెయిన్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు.
టాటా హారియర్ ఈవీ ఫీచర్లు
టాటా హారియర్ EV లో అత్యంత ఆకర్షించే అతి పెద్ద లక్షణం దాని శక్తిమంతమైన బ్యాటరీ ప్యాక్ & డ్యూయల్-మోటార్ ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్. ఈ సిస్టమ్‌తో ఈ కారును తారు రోడ్ల మీదే కాదు.. మట్టి రోడ్లు, గుంతల రోడ్లపైనా సులభంగా నడపొచ్చు & అన్ని రకాల కఠినమైన రోడ్లపై గొప్ప పనితీరును అందించేలా దీనిని డిజైన్ చేశారు. ఈ SUVలో 75 kWh లిథియం అయాన్ బ్యాటరీని అమర్చారు. ఈ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేసి, కారును స్టార్ట్ చేస్తే 500 కిలోమీటర్లకు పైగా (Tata Harrier EV Range) ఈల వేసుకుంటూ వెళ్లిపోవచ్చు. ఈ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి కూడా మద్దతు ఇస్తుంది, తద్వారా వాహనాన్ని తక్కువ సమయంలో ఛార్జ్ చేయవచ్చు.
టాటా హారియర్ ఎలక్ట్రిక్ SUVలో చాలా ఆధునిక సాంకేతికతలు & భద్రతలు ఏర్పాటు చేశారు, ఈ విభాగంలో అత్యంత అధునాతన కార్లలో ఒకటిగా ఇది నిలుస్తుంది. ఈ SUVలో మొదట ఆకర్షించే ఫీచర్ దాని పెద్ద 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇది Android Auto & Apple CarPlay సపోర్ట్‌తో పని చేస్తుంది. ఈ సిస్టమ్‌తో ప్రయాణీకులకు వినోదంతో పాటు సింగిల్ టచ్‌తో కారు నావిగేషన్‌ను, ఇతర సెట్టింగ్స్‌ను నియంత్రించవచ్చు. ఈ కారులో 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే కూడా అందుబాటులో ఉంటుంది. ఇంకా.. హారియర్ EV డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్‌తోనూ వస్తోంది. అంటే... డ్రైవర్ & ప్రయాణీకుడు ఇద్దరూ వేర్వేరు ఉష్ణోగ్రతలను సెట్ చేసుకోవచ్చు. ఈ కారు కనెక్టెడ్ కార్ టెక్నాలజీని కూడా సపోర్ట్ చేస్తుంది.
టాటా హారియర్ EV ధర ఎంత?
టాటా మోటార్స్ ఇంకా హారియర్ EV ధరను అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఆటోమొబైల్ నిపుణుల అంచనా ప్రకారం దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర (Tata Harrier EV ex-showroom price) రూ. 28 లక్షల నుంచి రూ. 32 లక్షల మధ్య ఉండవచ్చు. టాటా హారియర్ EV డెలివరీ జూన్ 2025 రెండో వారం లేదా మూడో వారం నుంచి ప్రారంభం అవుతాయి. ఈ ఎలక్ట్రిక్ SUVని టాటా మోటార్స్‌కు చెందిన అన్ని ప్రధాన ఎలక్ట్రిక్ వెహికల్ డీలర్‌షిప్స్‌లోనూ బుక్ చేసుకోవచ్చు.