FASTag Annual Pass Benefits And Details in Telugu: జాతీయ రహదారులపై తరచుగా ప్రయాణించే డ్రైవర్లు లేదా వాహన యజమానులకు పెద్ద ఉపశమనం ఇచ్చేలా, కేంద్ర రహదారి రవాణా & జాతీయ రహదారి మంత్రిత్వ శాఖ (Ministry of Road Transport & Highways - MoRTH) కొత్తగా "FASTag ఆధారిత వార్షిక పాస్‌"ను ప్రకటించింది. ఈ పాస్‌ తీసుకున్నాక, టోల్‌ గేట్ల దగ్గర చెల్లింపుల కోసం పదేపదే రీఛార్జ్‌ చేయాల్సిన అవసరం తగ్గిపోతుంది, చాలా సమయం ఆదా అవుతుంది. ఫాస్టాగ్‌ రీఛార్జ్‌ చేయడం మరిచిపోవడం వల్ల ఏర్పడే ఇబ్బందులు కూడా తప్పుతాయి. ముఖ్యంగా ప్రైవేట్‌ కార్లు, జీప్‌లు, వ్యాన్‌లు వాడేవారికి ఇది మరింత ఉపయోగపడుతుంది. అయితే, కమర్షియల్‌ వాహనాలకు ఈ ఆఫర్‌ వర్తించదు.

ఎవరు కొనుగోలు చేయవచ్చు?FASTag వార్షిక పాస్‌ అనేది ఒకసారి చెల్లింపు పథకం (FASTag One-time payment Scheme), ఇందులో వాహన యజమాని ఒకేసారి రూ. 3,000 చెల్లిస్తే... 200 టోల్‌ క్రాసింగ్‌లు లేదా ఒక సంవత్సరం కాల పరిమితి (ఏది ముందు పూర్తయితే అది వర్తిస్తుంది) వరకు లాభం పొందవచ్చు.

FASTag వార్షిక పాస్‌ వల్ల ప్రయోజనాలు (FASTag Annual Pass Benefits):

  • మళ్లీ మళ్లీ ఆన్‌లైన్‌ రీఛార్జ్‌ అవసరం ఉండదు.
  • టోల్‌ ప్లాజాల్లో లైన్లు తగ్గుతాయి.
  • ప్రయాణ వేగం పెరుగుతుంది.
  • ఫాస్టాగ్‌ రీఛార్జ్‌ను మరిచిపోయే ఇబ్బందులు ఉండవు
  • వార్షిక పాస్‌ లిమిట్‌ పూర్తయిన తర్వాత (200 టోల్‌ క్రాసింగ్‌లు లేదా ఒక సంవత్సరం కాల పరిమితి) FASTag మళ్లీ సాధారణ పేమెంట్‌ మోడ్‌కు మారిపోతుంది.

FASTag వార్షిక పాస్‌ ఎలా కొనుగోలు చేయాలి?

  • Rajmarg Yatra యాప్‌ లేదా NHAI/MoRTH వెబ్‌సైట్‌ లోకి లాగిన్‌ అవ్వాలి.
  • మీ వాహన నంబర్‌, FASTag ID తో రిజిస్టర్‌ చేయాలి.
  • FASTag యాక్టివ్‌గా ఉందా, సరిగా అమర్చి ఉందా అని చెక్‌ చేయాలి.
  • రూ. 3,000 పేమెంట్‌ను UPI, డెబిట్‌/క్రెడిట్‌ కార్డ్‌, నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా చెల్లించాలి.
  • పాస్‌ ఆగస్ట్‌ 15 నుంచి యాక్టివ్‌ అవుతుంది. SMS ద్వారా కన్ఫర్మేషన్‌ వస్తుంది.

గమనిక:

  • నాన్‌-ట్రాన్స్‌ఫరబుల్‌ – ఈ పాస్‌ను ఇతర వాహనాలకు బదిలీ చేయలేరు, రిజిస్టర్‌ చేసిన వాహనం కోసం మాత్రమే ఉపయోగించాలి.
  • నాన్‌-రిఫండబుల్‌ – కొనుగోలు చేసిన తర్వాత డబ్బు తిరిగి రాదు.
  • గడువు పూర్తయిన తర్వాత మళ్లీ కొనుగోలు చేయాలి.

ఎక్కడ వర్క్‌ అవుతుంది?

FASTag వార్షిక పాస్‌ జాతీయ రహదారులు & నేషనల్‌ ఎక్స్‌ప్రెస్‌ వేలపై (NHAI లేదా MoRTH నిర్వహించే) మాత్రమే పని చేస్తుంది. రాష్ట్ర హైవేలపై లేదా మునిసిపల్‌ టోల్‌ రోడ్లపై ఇది వర్తించదు. అక్కడ సాధారణ టోల్‌ చార్జీలు చెల్లించాలి.

తెలుగు రాష్ట్రాల ప్రయోజనంఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో NH 16, NH 65, హైదరాబాద్‌-విజయవాడ, విజయవాడ-విశాఖపట్నం వంటి రూట్లపై తరచుగా ప్రయాణించే వారికి ఈ పాస్‌ చాలా లాభం. ముఖ్యంగా బిజినెస్‌ ట్రావెలర్స్‌, ఫ్యామిలీ ట్రిప్స్‌ చేసే వాళ్లు దీని ద్వారా సంవత్సరానికి వేల రూపాయలు ఆదా చేసుకోవచ్చు.

రూ. 3,000 FASTag వార్షిక పాస్‌ ఒక మంచి ఆప్షన్‌, ముఖ్యంగా తరచుగా జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి. ఒక్కసారి చెల్లించి ఏడాది పాటు సులభంగా ప్రయాణం చేయొచ్చు. టోల్‌ గేట్ల వద్ద సమయం, డబ్బు రెండూ సేవ్‌ అవుతాయి.