Tata Tiago Price, Mileage And Features In Telugu: టాటా టియాగో బాహ్య రూపం ఆధునిక డిజైన్‌తో ఆకట్టుకుంటుంది. దీని షార్ప్ హెడ్‌ల్యాంప్స్‌ & వైడ్‌ గ్రిల్‌ కారు ముందు భాగాన్ని స్పోర్టీ అపీల్‌తో చూపిస్తాయి. స్మూత్‌ కర్వ్‌లతో కూడిన బాడీ లైన్లు దీనిని చాలా స్టైలిష్‌గా మార్చాయి. అలాయ్ వీల్స్‌ & డ్యుయల్ టోన్ పెయింట్ ఆప్షన్స్‌ టియాగోకు ప్రత్యేకమైన లుక్ ఇస్తాయి. వీటన్నింటితోపాటు, ఇది మంచి మైలేజ్‌ ఇచ్చే కారు కూడా. ప్రతిరోజూ ఆఫీసుకు వెళ్లి రావడానికి, టూర్లు తిరగడానికి ఈ కారు చక్కగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం, పెట్రోల్ & డీజిల్ ధరలు పెరిగిన తర్వాత, డ్రైవింగ్‌ చేయడం ఖరీదైన వ్యవహారంగా మారింది. ఈ పరిస్థితిలో, ప్రతి ఒక్కరూ అందుబాటు ధరలో, మంచి మైలేజీ ఇవ్వడమే కాకుండా, గొప్ప ఫీచర్లు కలిగి ఉన్న కారును కోరుకుంటారు. టాటా టియాగోలో అలాంటి అన్ని లక్షణాలు కనిపిస్తాయి.

టాటా టియాగో పై డిస్కౌంట్ ఆఫర్‌మీడియా వెబ్‌సైట్ గాడివాడి రిపోర్ట్‌ ప్రకారం, ఆగస్టు 2025లో టాటా టియాగో కొనుగోలుపై మీరు రూ. 55,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ డిస్కౌంట్‌లో రూ. 10,000 నగదు తగ్గింపు & రూ. 15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి. ఈ ఆఫర్ పరిమిత కాలం వరకు మాత్రమే వర్తిస్తుంది. టాటా టియాగో ఎక్స్-షోరూమ్ ధర రూ. 5 లక్షల నుంచి ప్రారంభమై టాప్-ఎండ్ వేరియంట్‌కు రూ. 8.55 లక్షల వరకు ఉంటుంది. 

తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌-రోడ్‌ ధరరిజిస్ట్రేషన్‌ ఛార్జీలు, ఇన్సూరెన్స్‌, ఇతర ఖర్చులు కలుపుకుని, హైదరాబాద్‌లో టాటా టియాగో బేస్‌ వేరియంట్‌ దాదాపు రూ. 6.03 లక్షలు. ఆన్‌-రోడ్‌ రేటుకు (Tata Tiago on-road price, Hyderabad) వస్తుంది. విజయవాడలో ఆన్‌-రోడ్‌ ధర దాదాపు రూ. 6.05 లక్షలు (Tata Tiago on-road price, Vijayawada).

టాటా టియాగో పవర్‌ట్రెయిన్ టాటా టియాగో 1199 cc 1.2-లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌తో పని చేస్తుంది. ఈ కారులోని ఈ ఇంజన్ 6,000 rpm వద్ద 86 PS శక్తిని & 3,300 rpm వద్ద 113 Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. టాటా టియాగో CNGలో కూడా అందుబాటులో ఉంది. టియాగో CNGలోని ఇంజిన్ 6,000 rpm వద్ద 75.5 PS శక్తిని & 3,500 rpm వద్ద 96.5 Nm టార్క్‌ను ఇస్తుంది. 

టాటా టియాగో కారు 242 లీటర్ల బూట్ స్పేస్‌తో వస్తుంది. ఈ కారు గ్రౌండ్ క్లియరెన్స్ 170 mm. టాటా టియాగో ముందు భాగంలో డిస్క్ బ్రేక్‌లు & వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి. 

టాటా టియాగో మైలేజ్దీని పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ దాదాపు 20.09 kmpl మైలేజీని ఇస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ఈ టాటా కారు 19 kmpl వరకు మైలేజీని ఇస్తుందని కంపెనీ డేటా చూపుతోంది.

టాటా టియాగో కారు CNG మోడ్‌లో మెరుగైన మైలేజీని ఇస్తుంది. టియాగో CNG వేరియంట్‌ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 26.49 కి.మీ./కిలో & ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో 28.06 కి.మీ./కిలో మైలేజీని ఇస్తుంది. ఈ కారులో 35 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ & 60 లీటర్ల CNG ట్యాంక్ ఉన్నాయి, వీటిని పూర్తిగా నింపితే, కంపెనీ లెక్క ప్రకారం, ఈ కారు 900 km వరకు డ్రైవింగ్‌ రేంజ్‌ ఇస్తుంది.