Electric Car vs Hybrid Car Comparison: పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశంలో ఉన్న ఈ కాలంలో & కాలుష్య నియంత్రణ నియమాలు కఠినతరం అవుతున్న తరుణంలో, కొత్త కారు కొనే వ్యక్తి తనకు తానే ఒక ప్రశ్న వేసుకోవాలి - "నేను ఎలక్ట్రిక్ కారు కొనాలా లేదా హైబ్రిడ్ కారు కొనాలా?". ఈ రెండు రకాల కార్లకు దేని ప్రయోజనాలు & పరిమితులు దానికి ఉన్నాయి. సరైన నిర్ణయం తీసుకోవాలంటే ఈ రెండు టెక్నాలజీల మధ్య తేడా ఏమిటో మీరు తెలుసుకోవాలి.
పవర్‌ట్రెయిన్ & టెక్నాలజీ
- ఎలక్ట్రిక్ కారు లేదా EV.. బ్యాటరీ & ఎలక్ట్రిక్ మోటార్‌తో మాత్రమే నడుస్తుంది, వాటికి పెట్రోల్ లేదా డీజిల్ అవసరం లేదు.
- ఈ వాహనాలు పొగను విడుదల చేయవు. అంటే, టెయిల్ పైప్ నుంచి ఎటువంటి కాలుష్యం ఉండదు. ఇవి పర్యావరణానికి పరిశుభ్రమైనవి & సురక్షితమైనవి.
- దీనికి విరుద్ధంగా, హైబ్రిడ్ కార్లు రెండు వ్యవస్థలను కలిగి ఉంటాయి - పెట్రోల్ లేదా డీజిల్ ఇంజిన్ & ఎలక్ట్రిక్ మోటారు.
- ఈ కార్లలో మూడు ప్రధాన రకాలు ఉన్నాయి. మొదటిది - మైల్డ్ హైబ్రిడ్, దీనిలో ఎలక్ట్రిక్ మోటారు మాత్రమే ఇంజిన్‌కు పవర్ ఇస్తుంది.
- రెండోది- స్ట్రాంగ్ హైబ్రిడ్, ఇది కొంత దూరం వరకు పూర్తిగా బ్యాటరీతో నడుస్తుంది.
- మూడోది ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV). దీని బ్యాటరీని బాహ్య ఛార్జర్‌తో కూడా ఛార్జ్ చేయవచ్చు.
- ఎలక్ట్రిక్ కార్లకు సంప్రదాయ ఇంధనం అవసరం లేదు. హైబ్రిడ్ కార్లు సాంప్రదాయ ఇంధనాన్ని ఆదా చేస్తాయి తప్ప దాని నుంచి పూర్తిగా మినహాయింపు పొందవు.
మైలేజ్ & రన్నింగ్ ఖర్చు
- ఇంజిన్ & మోటారు రెండింటి సమన్వయం కారణంగా హైబ్రిడ్ కార్లు మంచి మైలేజీని ఇస్తాయి.
- ఉదాహరణకు, టయోటా ఇన్నోవా హైక్రాస్, మారుతి గ్రాండ్ విటారా హైబ్రిడ్ కార్లు దాదాపు 28 KMPL మైలేజీని అందిస్తున్నాయి.
- ఎలక్ట్రిక్ కార్లు విద్యుత్తుతో నడుస్తాయి. భారతదేశంలో ఒక యూనిట్ విద్యుత్ ధర రూ.6 నుంచి రూ.8 వరకు ఉంటుంది. అందువల్ల వీటి నిర్వహణ ఖర్చు కిలోమీటరుకు రూ.1 కంటే తక్కువగా ఉంటుంది.
- అయితే, EVలకు ఉన్న అతి పెద్ద అవరోధం వాటి పరిధి. సుదీర్ఘ ప్రయాణంలో ఉన్నప్పుడు ఛార్జింగ్ గురించి ఎప్పుడూ ఆందోళన ఉంటుంది.
- హైబ్రిడ్ కార్లకు ఈ సమస్య ఉండదు, సమీపంలోని పెట్రోల్ బంక్ నుంచి ఇంధనం పొందవచ్చు &ఎక్కడా ఆగకుండా ప్రయాణం సాగించవచ్చు.
- పర్యావరణ పరంగా EVలు పూర్తిగా “జీరో టెయిల్ పైప్ ఎమిషన్” కార్లు, అంటే అవి నడుస్తున్నప్పుడు ఎలాంటి పొగ లేదా వాయువును విడుదల చేయవు.
ఛార్జింగ్ & ఇంధనం నింపే సౌకర్యం
- EVలను ఛార్జ్ చేయడానికి ఇంట్లో ఛార్జర్ లేదా పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ అవసరం.
- ఈ సౌకర్యం ఇప్పుడు నగరాల్లో పెరుగుతోంది, కానీ చిన్న నగరాలు & పట్టణాలలో ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు ఇప్పటికీ బలహీనంగా ఉన్నాయి.
- ఎలక్ట్రిక్ కార్లతో పోలిస్తే హైబ్రిడ్ కార్లకు ఛార్జింగ్ అవసరం లేదు. ఏ పెట్రోల్ పంపులోనైనా సులభంగా ఇంధనం నింపుకోవచ్చు.
- ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) కార్లు అవసరమైనప్పుడు బ్యాటరీతో పాటు పెట్రోల్‌తోనూ నడుస్తాయి, ప్రయాణాన్ని మరింత సులభంగా మారుస్తాయి.
ధర & నిర్వహణ
- ఎలక్ట్రిక్ కార్ల ప్రారంభ ధర రూ. 9 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు ఉంటుంది. హైబ్రిడ్ కార్ల ధర రూ. 15 నుంచి రూ. 22 లక్షల మధ్య ఉంటుంది.
- EVలకు ఇంజిన్లు & గేర్‌బాక్స్‌లు ఉండవు, అందువల్ల వాటి నిర్వహణ ఇతర కార్ల కంటే తక్కువగా ఉంటుంది. అయితే, EV బ్యాటరీ దెబ్బతింటే దానిని మార్చడం చాలా ఖరీదైన వ్యవహారం.
- హైబ్రిడ్ కార్లకు ఇంజిన్ & మోటారు వ్యవస్థలు ఉండడం వల్ల వాటి నిర్వహణ కొంచెం ఎక్కువగా ఉండవచ్చు & ఎక్కువ సర్వీస్ కూడా అవసరం కావచ్చు.
కాబట్టి, ఎలక్ట్రిక్ కార్ vs హైబ్రిడ్ కార్‌లలో దేని ప్రయోజనాలు, పరిమితులు దానికి ఉన్నాయి. పైన చెప్పిన విషయాలను దృష్టిలో పెట్టుకుని, మీ అవసరాల ఆధారంగా ఒక కారును ఎంపిక చేసుకోవచ్చు.