Guru Purnima 2025: అజ్ఞానమనే చీకటిని తొలగించేవాడు గురువు.  గురువు లేని జీవితం అసంపూర్ణం, ఎందుకంటే గురువు లేకుండా విజయం సరైన మార్గంలో లభించదు. సన్మార్గంలో నడిపించే గురువుని పూజించే రోజే ఆషాఢ పూర్ణిమ. వ్యాసమహర్షి జన్మించిన ఈ రోజు గురువుని పూజిస్తే జీవితంలో ఎప్పుడూ ఆనందం వెల్లివిరుస్తుందని చెబుతారు.

ప్రతి వ్యక్తి జీవితంలో  ప్రతి దశలోనూ గరువు అత్యంత కీలకం గురు పూర్ణిమ రోజు మీరు మీ గురువుని కలిసే అవకాశం లేకుంటే ఇంట్లోనే పూజించండి.  గురు పూర్ణిమ 2025 ముహూర్తం (Guru Purnima 2025 Date)

గురు పూర్ణిమ తిథి ప్రారంభం - జూలై  9 బుధవారం అర్థరాత్రి ప్రారంభమై జూలై 10 అర్థరాత్రి వరకూ ఉంటుంది. ఎలాంటి సందేహం లేకుండా గురు పూర్ణిమ జూలై 10 గురువారమే. 

గురు పూర్ణిమ రోజు

బ్రహ్మ ముహూర్తం - ఉదయం 4:10  నుంచి 4:50 వరకు

అభిజిత్ ముహూర్తం - 11:59 AM నుంచి 12:54 PM వరకు

విజయ్ ముహూర్తం - 12:45 PM  నుంచి 3:40 PM వరకు

గోధూళి ముహూర్తం - 7:21 PM  నుంచి 7:41 PM వరకు  గురు పూర్ణిమ నాడు ఇంట్లో ఇలా పూజచేసుకోండి

సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానమాచించి శుభ్రమైన దుస్తులు ధరించాలి. పవిత్ర నదుల్లో స్నానమాచరించండి. లేదంటే గంగాజలం ఉంటే ఇంట్లో స్నానమాచించే నీటిలో కలుపుకోండి

ఇంట్లో పూజా స్థలాన్ని శుభ్రం చేసి అక్కడ ఒక పీఠం లేదా ఆసనం వేయాలి

పండ్లు, పూలు, ధూపం, దీపం, నీరు,  నైవేద్యం వంటి అన్ని ముఖ్యమైన పూజా సామాగ్రిని  ముందుగా సిద్ధం చేసుకోండి

ఈ రోజు శ్రీ మహావిష్ణువును, లక్ష్మీ దేవిని పూజించడం శుభప్రదం అని చెబుతారు. ఇంకా వేద వ్యాసుడిని, మీకు విద్య నేర్పించిన గురువులను పూజించండి

శ్రీ మహా విష్ణువును పూజించేటప్పుడు తులసి ఆకులు సమర్పించడం మర్చిపోవద్దు...ఎందుకంటే విష్ణుపూజలో తులసి లేకుంటే ఆ పూజ అసంపూర్ణం

రాత్రి చంద్రోదయం తర్వాత, చంద్ర దర్శనం చేసుకుని పూజ చేయండి. చంద్రునికి అర్ఘ్యం సమర్పించి, ధూపం, దీపాలు వెలిగించండి.

ప్రతి వ్యక్తికి పుట్టిన తర్వాత తొలి గురువు తల్లిదండ్రులే. అందుకే గురు పూర్ణిమ రోజు మొదటగా తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకోండి.  గురువు ఫొటో ఏర్పాటు చేసుకుంటే కుంకుమ పెట్టి, చందనం పూసి, అక్షతలు, పూలతో పూజించి నైవేద్యం పెట్టండి గురు పౌర్ణమి రోజు వేదవ్యాసుడు అందించిన పురాణ గ్రంధాలను పఠించాలి

గురువు ద్వారా మీరు నేర్చుకున్న మంత్రాలను పఠించండి

ఓం గురుభ్యో నమః మంత్రాన్ని జపించండి

గురువుకు వస్త్రాలు, పాదుకలు లేదా వారికి ఉపయోగపడే వస్తువులను బహుమతిగా ఇవ్వండి

గురువులు బోధించిన ఉపదేశాలను గుర్తుపెట్టుకుని వాటిని అనుసరిస్తామని ప్రతిజ్ఞ చేయండి

మీ శక్తి మేరకు పేదలకు పసుపు రంగు వస్తువులను లేదా విద్యకు సంబంధించిన వస్తువులను దానం చేయండి.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు  ఆధారంగా సేకరించింది మాత్రమే. దీనిని పరిగణలోకి తీసుకోవాలా వద్దా అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం. అనుసరించే ముందు మీరు విశ్వసించే నిపుణులు, పండితుల సలహాలు స్వీకరించండి.  

అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఏ రోజు చేస్తే మంచిది - పౌర్ణమి వేళ అగ్నిలింగ క్షేత్రంలో భక్తుల రద్దీ ఎందుకుంటుంది... పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి 

అరుణాచల గిరిప్రదక్షిణ - ఈ 44 ఎనర్జీ పాయింట్స్ మిస్ చేయొద్దు ..ఇదిగో రూట్ మ్యాప్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి!