Guru Purnima 2025 Remedies according to zodiac sign : ఆషాఢ మాసం పౌర్ణమి (Ashadha Purnima 2025) గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ. గురు పూర్ణిమ నాడు శిష్యులు తమ గురువులను పూజిస్తారు, గౌరవిస్తారు కృతజ్ఞతలు తెలుపుకుంటారు.
ఏటా ఆషాఢ పౌర్ణమి రోజున గురు పూర్ణిమ జరుపుకుంటారు. ఈ సంవత్సరం గురు పూర్ణిమ గురువారం జూలై 10వ వచ్చింది. ఈ రోజు మీ రాశి ప్రకారం పరిహారాలు చేయడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి..వెంటాడుతున్న సమస్యలు తొలగిపోతాయి.
గురు పూర్ణిమ రోజున రాశి ప్రకారం చేయవలసిన పరిహారాలు (Guru Purnima 2025 Remedies)
మేష రాశి (Aries)
గురు పూర్ణిమ రోజున ఆలయానికి వెళ్లి శ్రీ మహా విష్ణును పూజించండి. ఆ తర్వాత పేదలకు పసుపు రంగు దుస్తులు లేదా పసుపు మిఠాయిలు దానం చేయండి. ఈ రోజున మీ గురువును దర్శించి వారి ఆశీర్వాదం పొందండి.
వృషభ రాశి (Taurus)
గురు పూర్ణిమ నాడు మీ గురువు, విష్ణుమూర్తి , శివుడిని పూజించండి. ఈ రోజున భగవద్గీత లేదా ఇతర ఆధ్యాత్మిక గ్రంథాలను పఠించండి. ఆ తర్వాత మీ సామర్థ్యం మేరకు పేదలకు సహాయం చేయండి.
మిథున రాశి (Gemini)
గురువు ఇచ్చిన మంత్రాలను జపించండి. గురువుకు బహుమతి ఇచ్చి కృతజ్ఞతలు తెలుపుకోండి. శ్రీ మహావిష్ణువును పూజించండి. పూజలో భగవంతునికి అన్నం పాయసం నైవేద్యంగా సమర్పించండి.
కర్కాటక రాశి (Cancer)
ఆలయంలో లేదా పూజా మందిరంలో నెయ్యి దీపం వెలిగించి మీ గురువును తలుచుకోండి. ఈ రోజు మీరు శ్రీ మహావిష్ణువుని పూజిస్తే విశేష ఫలితాలు పొందుతారు. గురు మంత్రాన్ని జపించండి.
సింహ రాశి (Leo)
గురు పూర్ణిమ శుభ దినాన పిల్లలకు, విద్యార్థులకు విద్యా సామగ్రిని దానం చేయండి, పేదలకు సహాయం చేయండి. ఏదైనా విద్యా సంస్థకు వెళ్లి కొత్తగా ఏదైనా కోర్సులు నేర్చుకునే ప్రయత్నం చేయండి.
కన్యా రాశి (Virgo)
కన్యా రాశి వారు గురు పూర్ణిమ రోజు రాత్రి సమయంలో విష్ణువును పూజించండి. మీ గురుదేవుల వద్దకు వెళ్లి కానుకలు సమర్పించి ఆశీర్వచనం తీసుకోండి తులా రాశి (Libra)
తులా రాశి వారు గురు పూర్ణిమ రోజు కుటుంబ సభ్యులు, ప్రియమైన వారితో ఆధ్యాత్మిక విషయాలపై చర్చించండి. మతపరమైన ప్రదేశానికి వెళ్లి గురువుల ఆశీర్వాదం పొందండి.
వృశ్చిక రాశి (Scorpio)
వృశ్చిక రాశి వారు గురు మంత్రాన్ని జపించండి. పేదలకు, నిరుపేదలకు భోజనం ఏర్పాటు చేయండి, మీ గురువుల ఆశీర్వాదం తీసుకోండి , వారికి బహుమతులు సమర్పించండి
ధనుస్సు రాశి (Sagittarius)
గురు పూర్ణిమ రోజున మీరు ఏదైనా ఆధ్యాత్మిక ప్రదేశానికి వెళ్లిరండి. ఇంట్లో సత్యనారాయణ కథవినడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది మకర రాశి (Capricorn)
మకర రాశి వారు ఈ రోజున చంద్రుడిని పూజించండి. గురు మంత్రాన్ని జపించండి. మీరు గురు పూర్ణిమ నాడు ఆలయంలో హోమం నిర్వహిస్తే శుభ ఫలితాలు పొందుతారు. విష్ణువుని పూజించండి కుంభ రాశి (Aquarius)
మీ గురువు సేవ కోసం కొంత సమయం కేటాయించండి. ఇకపై అబద్ధం చెప్పను అని ప్రమాణం చేయండి. ఈ పరిహారంతో భవిష్యత్ లో చాలా సమస్యల నుంచి బయటపడతారు. ఇంటి శ్రేయస్సు పెరుగుతుంది
మీన రాశి (Pisces)
ఈ రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనండి. గురువుల నుంచి ఆశీర్వాదం తీసుకోండి. ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది..సమస్యల నుంచి బయటపడేస్తుంది
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.