Ethanol Powered EV Charger: భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. ప్రభుత్వాలు సబ్సిడీలతో ప్రోత్సహిస్తున్నప్పటికీ, ప్రధాన రహదారులు, హైవేలపై ఛార్జింగ్ స్టేషన్ల కొరత ఈవీ వినియోగదారులకు పెద్ద సవాలుగా మారింది. దీనికి పరిష్కారంగా తెలంగాణలో దేశంలోనే తొలిసారిగా ఇథనాల్ ఆధారిత ఈవీ ఛార్జింగ్ సిస్టమ్‌ను కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి సమక్షంలో ప్రారంభించారు. సాంప్రదాయ విద్యుత్ గ్రిడ్‌పై ఆధారపడకుండా పనిచేసే ఈ సాంకేతికత, దేశీయ క్లీన్ ఎనర్జీ రంగానికి, బయోఫ్యూయల్ వినియోగానికి సరికొత్త దిశను చూపిస్తోంది.

Continues below advertisement

సాధారణ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ల నిర్వహణకు హై-వోల్టేజ్ పవర్ గ్రిడ్లు, విస్తృత విద్యుత్ కనెక్షన్లు అవసరం ఉంటుంది. కానీ ఈ కొత్త 150kW ఫాస్ట్ ఛార్జింగ్ సిస్టమ్ ఇథనాల్‌ను ఇంధనంగా వాడుకుని అక్కడికక్కడే విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆ విద్యుత్‌తో వాహనాల బ్యాటరీలను అత్యంత వేగంగా ఛార్జ్ చేస్తుంది. దీనివల్ల భారీ పవర్ గ్రిడ్లతో లేదా విద్యుత్ లైన్లతో సంబంధం లేకుండా ఛార్జింగ్ సేవలు అందిస్తుంది. 

సాధారణ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటుకు స్థల సమీకరణ, ట్రాన్స్‌మిషన్ లైన్లు, ప్రభుత్వ అనుమతులు, ట్రాన్స్‌ఫార్మర్ల అమరికకు నెలల సమయం పడుతుంది. అయితే ఈ ఇథనాల్ మొబైల్ ఛార్జింగ్ యూనిట్‌ను కేవలం 72 గంటల్లో (మూడు రోజుల్లో) ఎక్కడైనా సిద్ధం చేయవచ్చని కంపెనీ తెలిపింది. దీనివల్ల ప్రాథమిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు మరియు సమయం దాదాపు 50 శాతం వరకు తగ్గుతాయి. హైవేలపై ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరించడానికి ఎంతో ఉపయోగపడుతుంది.

Continues below advertisement

రైతులకు ప్రయోజనం..

ఈ వినూత్న సాంకేతికత వల్ల దేశీయ వ్యవసాయ రంగానికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు గొప్ప ప్రయోజనం చేకూరనుంది. ఇథనాల్‌ను చెరకు, మొక్కజొన్న, వ్యవసాయ వ్యర్థాల నుంచి తయారు చేస్తారు కాబట్టి, దీని వినియోగం పెరిగితే రైతులకు అదనపు ఆదాయం లభించడమే కాకుండా పంటలకు మంచి ధర దక్కుతుంది. అలాగే ముడి చమురు దిగుమతులపై భారత్ ఆధారపడటం తగ్గి, భారీగా విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుంది.

Also Read: మీ కారు పక్కనున్న వాహనాలతో మాట్లాడుతుంది.. V2V టెక్నాలజీతో ప్రమాదాలకు చెక్!

విద్యుత్ అందుబాటులో లేనప్పుడు వాడే డీజిల్ జనరేటర్ల కంటే ఈ ఇథనాల్ సిస్టమ్ అత్యంత పర్యావరణ అనుకూలమైనది. ఇది కార్బన్ ఉద్గారాలను దాదాపు 80 శాతం వరకు తగ్గిస్తుంది. వాహనంపై సులభంగా తరలించగల ఈ మొబైల్ ఛార్జర్, హైవేలపై అత్యవసర పరిస్థితుల్లో బ్యాటరీ ఖాళీ అయిన కార్లకు అక్కడికక్కడే ఛార్జింగ్ సేవలు అందించి ఆదుకుంటుంది. మొత్తానికి ఈ ఇథనాల్ ఛార్జింగ్ పరిజ్ఞానం గ్రీన్ మొబిలిటీ, భారతీయ వ్యవసాయ రంగాలలో ఒక విప్లవాత్మక మార్పుగా నిలవనుంది.

ఈ ఛార్జర్ ఎలా పనిచేస్తుంది?సాధారణంగా ఫాస్ట్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌ను నడపడానికి భారీ పవర్ గ్రిడ్, హై-వోల్టేజ్ విద్యుత్ కనెక్షన్ అవసరమని తెలుస్తోంది. తెలంగాణలో ప్రవేశపెట్టిన ఈ 150kW ఫాస్ట్ ఈవీ ఛార్జర్ ఈ పాత పద్ధతికి పూర్తిగా స్వస్తి పలుకుతుంది. ఈ సిస్టమ్ లోపల ఇథనాల్ నుండి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ఒక ప్రత్యేక యంత్రం అమర్చి ఉంటుంది. ఈ యంత్రం మొదట బయోఫ్యూయల్ అంటే ఇథనాల్‌ను ఉపయోగించి అక్కడికక్కడే విద్యుత్‌ను తయారు చేస్తుంది. ఆ తర్వాత అలా ఉత్పత్తి చేసిన విద్యుత్‌తో వాహనాల బ్యాటరీలను ఛార్జ్ చేస్తుంది. అంటే ఇది వాహనానికి లభించే విద్యుత్ సోర్స్ మారుస్తుంది, దీనివల్ల గ్రిడ్ తో ఉండే సమస్య తీరుతుంది.

Also Read: కొత్త ఎలక్ట్రిక్‌ కారు కొనబోతున్నారా? Tata EVల్లో చాలా మోడళ్లపై కచ్చితమైన బెనిఫిట్స్‌!, ఈ నెల మాత్రమే