Tata EV Offers August 2026: కొత్త ఎలక్ట్రిక్ కారు (EV) కొనాలని చూస్తున్న వారికి టాటా మోటార్స్ శుభవార్త చెప్పింది. ఈ నెలలో (ఆగస్టు 2026) టాటా EV కొనేవాళ్ల కోసం భారీ బెనిఫిట్లు ప్రకటించింది. నగదు తగ్గింపు, ఎక్స్‌చేంజ్ బోనస్, స్క్రాపేజ్ ప్రోత్సాహకం & లాయల్టీ బెనిఫిట్ల రూపంలో ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
టాటా కర్వ్ EV కొంటే అత్యధిక ప్రయోజనంఈసారి అత్యధిక బెనిఫిట్ Tata Curvv EVపై లభిస్తోంది. ముఖ్యంగా పాత Non-X వేరియంట్లపై మొత్తం రూ.3.35 లక్షల వరకు తగ్గింపు లభించే అవకాశం ఉంది. ఇందులో రూ.3 లక్షల నగదు తగ్గింపు రూపంలో & రూ.35 వేల స్క్రాపేజ్ బెనిఫిట్ రూపంలో ఉన్నాయి. Tata Curvv EV Creative వేరియంట్‌పై రూ.2.50 లక్షల నగదు తగ్గింపు లభిస్తుంది. రూ.35 వేల స్క్రాపేజ్ బెనిఫిట్‌తో కలిపి ఈ మోడల్‌పై మొత్తం రూ.2.85 లక్షల వరకు ప్రయోజనం పొందవచ్చు.
Curvv EV X సిరీస్‌ను కొనుగోలు చేసే వారికి కూడా ప్రత్యేక బెనిఫిట్లు ఉన్నాయి. ఎక్స్‌చేంజ్‌పై రూ.30 వేల బోనస్ లేదా స్క్రాపేజ్‌పై రూ.35 వేల వరకు ఇన్సెంటివ్ లభిస్తుంది. ఇప్పటికే టాటా ICE లేదా EV వాహనం ఉండి, కొత్త Curvv EV X సిరీస్‌కు మారే వారికి రూ.30 వేల లాయల్టీ బెనిఫిట్ కూడా అందుతుంది. మొత్తం కలిపి రూ.65 వేల వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: మీ కారు పక్కనున్న వాహనాలతో మాట్లాడుతుంది.. V2V టెక్నాలజీతో ప్రమాదాలకు చెక్!
హారియర్ EVHarrier EV కొనాలనుకున్నా కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి. Adventure, Fearless+ & Empowered వేరియంట్లపై రూ.50 వేల ఎక్స్‌చేంజ్ బోనస్ లేదా రూ.75 వేల స్క్రాపేజ్ బెనిఫిట్ పొందవచ్చు. ఇప్పటికే టాటా ICE వాహనం ఉన్నవాళ్లు కొత్త EVకు మారితే రూ.50 వేల లాయల్టీ బెనిఫిట్ పొందవచ్చు. ఇప్పటికే టాటా EV వాడుతున్నవాళ్లు కొత్త Harrier EVకి మారితే రూ.1 లక్ష వరకు లాయల్టీ బెనిఫిట్ అందుతుంది.
ఫ్రీడమ్ ఆఫర్‌అంతేకాదు, ఈ నెల 'Freedom Offer'ను కూడా టాటా అందిస్తోంది. Adventure వేరియంట్‌పై మరో రూ.75 వేల తగ్గింపు దొరుకుతుంది. Fearless+ & Empowered వేరియంట్లపై అదనంగా రూ.1 లక్ష బెనిఫిట్ ఉంటుంది. దీంతో Adventure వేరియంట్‌పై మొత్తం రూ.2.50 లక్షలు & మిగిలిన రెండు వేరియంట్లపై రూ.2.75 లక్షల వరకు బెనిఫిట్లు పొందే అవకాశం ఉంది.
పంచ్ EVPunch EVపై కూడా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఎంపిక చేసిన Medium Range, Long Range & Smart వేరియంట్లపై ఈ ఆఫర్లు వర్తిస్తాయి. Medium Range వేరియంట్‌పై రూ.90 వేల నగదు తగ్గింపుతో పాటు ఎక్స్‌చేంజ్ లేదా స్క్రాపేజ్ బెనిఫిట్ కలిపి మొత్తం రూ.1.25 లక్షల వరకు ప్రయోజనం వస్తుంది. Long Range వేరియంట్‌పై రూ.1.10 లక్షల నగదు తగ్గింపుతో మొత్తం రూ.1.45 లక్షల వరకు బెనిఫిట్ పొందవచ్చు. Smart వేరియంట్‌పై రూ.60 వేల నగదు తగ్గింపుతో మొత్తం రూ.95 వేల వరకు తగ్గింపు లభిస్తుంది.
ఇది కూడా చదవండి: రూ.1 లక్ష డౌన్ పేమెంట్‌పై Toyota Innova Hycross కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి
టియాగో EVTiago EVకి కూడా రూ.1.45 లక్షల వరకు బెనిఫిట్ ఉంది, అయితే ఇది పాత LR XT వేరియంట్‌కు మాత్రమే వర్తిస్తుంది. ఇందులో రూ.70 వేల నగదు తగ్గింపు, రూ.50 వేల ఫ్రీడమ్ ఆఫర్ & ఎక్స్‌చేంజ్ లేదా స్క్రాపేజ్ బెనిఫిట్ కలిసి ఉన్నాయి. ఎంపిక చేసిన MR & LR వేరియంట్లపై కూడా రూ.65 వేల నుంచి రూ.1.25 లక్షల వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.
నెక్సాన్ EVఈ నెలలో అత్యల్ప బెనిఫిట్ Nexon EVపై ఉంది. ఈ ఎలక్ట్రిక్ కారు కొంటే గరిష్టంగా రూ.45 వేల వరకు మాత్రమే తగ్గింపు లభిస్తుంది. ఇందులో రూ.10 వేల క్యాష్ డిస్కౌంట్, రూ.25 వేల ఎక్స్‌చేంజ్ బోనస్ లేదా రూ.35 వేల స్క్రాపేజ్ బెనిఫిట్ ఉన్నాయి.
టిగోర్ EV &సియెర్రా EVTata Tigor EV & Sierra EVపై ఈ ఆగస్టులో ప్రత్యేక ఆఫర్లు లేవు.
కొత్త Tata EV కొనాలని ఆలోచిస్తున్నవాళ్లకు Curvv EV & Harrier EVపై లభిస్తున్న భారీ బెనిఫిట్లు మంచి అవకాశమని చెప్పవచ్చు. ఈ ఆఫర్లు మోడల్ & వేరియంట్‌ను బట్టి మారతాయి, ఈ నెలాఖరు వరకే, అంటే 31 ఆగస్టు 2026 వరకు మాత్రమే అమల్లో ఉంటాయి. నగరాన్ని బట్టి & డీలర్ వద్ద ఉన్న స్టాక్‌ను బట్టి ఆఫర్లలో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి, కారు కొనే ముందు మీ ప్రాంతంలోని అధికారిక డీలర్‌ను సంప్రదించి తాజా ఆఫర్లు & స్టాక్ వివరాలను తెలుసుకోవడం ఉత్తమం.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
