Toyota Innova Hycross Down Payment | మీరు ఎక్కువ స్పేస్, ప్రీమియం ఫీచర్లు, పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే 7 సీటర్ కారును కొనుగోలు చేయాలనుకుంటే, టయోటా ఇన్నోవా హైక్రాస్ కారు మీకు అద్భుతమైన ఆప్షన్ అవుతుంది. ఈ MPV తన హైబ్రిడ్ టెక్నాలజీ, అద్భుతమైన మైలేజ్, బెస్ట్ కేబిన్ వల్ల భారత మార్కెట్‌లో చాలా పాపులర్ అయింది. దీని ధర కాస్త ఎక్కువగానే ఉన్నప్పటికీ, పూర్తి పేమెంట్ ఒకేసారి చేయకుండా ఫైనాన్స్ ద్వారా సైతం కొనుగోలు చేయవచ్చు. 1 లక్ష రూపాయల డౌన్ పేమెంట్ చేస్తే, ప్రతి నెలా ఎంత EMI చెల్లించాలో ఇక్కడ తెలుసుకోండి. 

Continues below advertisement

కారు ఆన్ రోడ్ ధర ఎంత?

టయోటా ఇన్నోవా హైక్రాస్ G ఫ్లీట్ 7 సీటర్ వేరియంట్‌ హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర ₹18,70,000 కాగా, ఆన్-రోడ్ ధర దాదాపు ₹23.93 లక్షలుగా ఉంది. మీరు ₹1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే, మిగిలిన మొత్తం కార్ లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. బ్యాంక్ మీ ఆదాయం, క్రెడిట్ స్కోర్ ఆధారంగా లోన్ మంజూరు చేస్తుంది. బెస్ట్ క్రెడిట్ స్కోర్ ఉంటే తక్కువ వడ్డీకి లోన్ ఇస్తారు. 

Continues below advertisement

ప్రతి నెలా EMI ఎంత చెల్లించాలి?4 ఏళ్ల కాల వ్యవధి: బ్యాంక్ మీకు సంవత్సరానికి 9 శాతం వడ్డీ రేటుతో 4 సంవత్సరాలకు కార్ లోన్ ఇస్తే, మీరు నెలవారీ EMI దాదాపు 52, 53 వేలు వరకు చెల్లించాలి. ఈ ఆప్షన్‌లో కారు లోన్ త్వరగా పూర్తయి, మొత్తం వడ్డీ కూడా తక్కువ చెల్లించాల్సి వస్తుంది.

5 ఏళ్ల కాల వ్యవధి: మీరు EMI భారాన్ని కొద్దిగా తగ్గించుకోవాలి అనుకుంటే, 5 సంవత్సరాల కారు లోన్ ఎంచుకోవచ్చు.  మీ EMI నెలకు సుమారు 44 వేల వరకు ఉంటుంది. ప్రతి నెలా కొద్దిగా తక్కువ EMI చెల్లించాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా చెప్పవచ్చు. 

Also Read: EVలకు తగ్గని డిమాండ్ - జులైలో 32 వేలకుపైగా అమ్మకాలు, ఏ కంపెనీ ఎన్ని కార్లను విక్రయించిందంటే..?

ఈ విషయాలు గుర్తుంచుకోండి

ఎక్కువ కాల వ్యవధి ఉన్న లోన్ తీసుకోవడం వల్ల నెలవారీ ఈఎంఐ వాయిదా తగ్గుతుంది. కానీ కారు కోసం చెల్లించే వడ్డీ మొత్తం పెరుగుతుంది. కనుక కారు లోన్ కాలాన్ని ఎంచుకునే ముందు మీ బడ్జెట్, అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలి. బ్యాంకుల వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు చెక్ చేసుకుని తీసుకోవాలి. డౌన్ పేమెంట్ ఎక్కువ చేస్తే కారు లోన్ మొత్తం తగ్గుతుంది. తద్వారా EMI తగ్గుతుంది. 

టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫీచర్లు

టయోటా ఇన్నోవా హైక్రాస్ తన పెద్ద, ప్రీమియం కేబిన్‌తో ఆకట్టుకుంటోంది. ఇందులో 7, 8 సీటర్ సీటింగ్ ఆప్షన్లు, పనోరమిక్ సన్‌రూఫ్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా, ADAS సేఫ్టీ ఫీచర్లు, ఎయిర్‌బ్యాగ్స్, ఆధునిక సౌకర్యాలు లభిస్తాయి. హైబ్రిడ్ వేరియంట్ మెరుగైన మైలేజ్‌తో స్మూత్ డ్రైవింగ్ అనుభవాన్ని ఇస్తుంది.

Also Read: వర్షంలోనే టూవీలర్‌ నడుపుతున్నారా..? ఈ తప్పులు చేస్తే మీ బండి మధ్య రోడ్డులోనే ఆగిపోవచ్చు!

భారత మార్కెట్‌లో టయోటా ఇన్నోవా హైక్రాస్‌కు కొన్ని కార్లు పోటీ ఇస్తున్నాయి. వాటిలో మహీంద్రా XUV700, మారుతి సుజుకి ఇన్విక్టో,  టాటా సఫారీ, టయోటా ఇన్నోవా క్రిస్టా, కియా కేరెన్స్ వంటి 7 సీటర్ కార్లు ఉన్నాయి. ఎక్కువ స్పేస్, హైబ్రిడ్ టెక్నాలజీ, బ్రాండ్ వ్యాల్యూ వల్ల హైక్రాస్ తనదైన ప్రత్యేక గుర్తింపును నిలుపుకుంది.