Engine Oil Grades Explained: ఇంజిన్‌ ఆయిల్‌ అంటే కేవలం లూబ్రికెంట్‌ కాదు, మీ వాహనానికి గుండె లాంటి ఇంజిన్‌ని సాఫీగా నడిపించే ప్రధాన శక్తి. మనం ప్రతి రోజు స్టార్ట్‌ చేసే కారు లేదా బైక్‌ అంత స్మూత్‌గా నడవడానికి కారణం సరైన ఇంజిన్‌ ఆయిల్‌ వినియోగం. చాలా మంది డ్రైవర్స్‌ ఆయిల్‌ను కేవలం సర్వీస్‌ సెంటర్‌ చెబితేనే మారుస్తారు. కానీ, ఆయిల్‌ ఎంపికలో తీసుకునే చిన్న తప్పులు ఇంజిన్‌ జీవితాన్ని తగ్గిస్తాయని చాలామందికి తెలియదు. అందుకే ఈ స్టోరీలో ఇంజిన్‌ ఆయిల్‌ పని విధానం నుంచి, ఏ గ్రేడ్‌ మంచిదో, సింథటిక్‌ vs మినరల్‌ ఆయిల్‌ పోలిక, కార్‌లో ఆయిల్‌ ఎలా చెక్‌ చేయాలో క్లియర్‌గా చెబుతున్నాం.

Continues below advertisement

ఇంజిన్‌ ఆయిల్‌ నిజంగా ఏం చేస్తుంది?

ఇంజిన్‌లో వేలాది రకాల మూమెంట్‌లు, ఫ్రిక్షన్స్‌ చోటుచేసుకుంటుంటాయి. ఈ రాపిడి వల్ల లోపలి భాగాలు డ్యామేజ్‌ కావచ్చు. ఇంజిన్‌ ఆయిల్‌ ఈ ఫ్రిక్షన్‌ నుంచి ఇంజిన్‌ భాగాలను కాపాడుతుంది. అదనంగా, హీట్‌ని కంట్రోల్‌ చేస్తుంది, మురికి, ఇతర డిపాజిట్స్‌ పేరుకుపోకుండా చూసుకుంటుంది. మంచి ఆయిల్‌ వాడితే ఇంజిన్‌ లైఫ్‌, మైలేజ్‌, పనితీరు అన్నీ మెరుగుపడతాయి.

Continues below advertisement

విస్కోసిటీ ‍‌(Viscosity) అంటే ఏమిటి? 5W-30 ఎందుకు ముఖ్యం?

మన కార్‌ మాన్యువల్‌లో కనిపించే "5W-30", "0W-20" లాంటి గణాంకాలు విస్కోసిటీ గ్రేడ్‌.

"W" అంటే ‘వింటర్‌’. 

5W-30 అనగా, చలి వాతావరణంలో ఆయిల్‌ ఎంత ఫ్రీగా ఫ్లో అవుతుందో సూచిస్తుంది. 

రెండో సంఖ్య (30) అంటే అధిక వేడి సమయంలో ఆయిల్‌ ఎంత స్థిరంగా ఉందో చెబుతుంది.

నేటి మోడర్న్‌ కార్లలో ఇంజిన్‌ భాగాల మధ్య క్లియరెన్స్‌ తక్కువగా ఉంటుంది. అందుకే తక్కువ విస్కాసిటీ ఉన్న 5W-30, 0W-20 ఆయిల్స్‌ ఇంజిన్‌కి సరిపోతాయి. ఇవి ఫ్యూయల్‌ ఎఫిషియెన్సీ కూడా పెంచుతాయి.

సింథటిక్‌ vs మినరల్‌ - ఏది మంచిది?

రెండూ క్రూడ్‌ ఆయిల్‌ నుంచే తయారవుతున్నా, సింథటిక్‌ ఆయిల్‌ ఎక్కువ ప్యూరిటీ, అధునాతన ప్రాసెస్‌తో వస్తుంది.

సింథటిక్‌ ఆయిల్‌ ప్రయోజనాలు:

  • చాలా త్వరగా ఇంజిన్‌లో ప్రసరిస్తుంది
  • వేడి, చలి కాలాల్లో ఏ టెంపరేచర్‌లోనైనా మంచి ప్రొటెక్షన్‌ ఇస్తుంది
  • మైలేజ్‌ మెరుగుపడుతుంది
  • డిపాజిట్స్‌ పేరుకుపోకుండా కాపాడుతుంది
  • ఎమిషన్స్‌ తగ్గిస్తుంది

మీ కారు మాన్యువల్‌లో "సెమీ-సింథటిక్‌" అని ఉన్నప్పటికీ, ప్యూర్‌ సింథటిక్‌ వాడితే మెరుగైన పనితీరు చూస్తారు.

ఇంజిన్‌ ఆయిల్‌ లైట్‌ వెలిగితే ఏం చేయాలి?

కార్‌ డాష్‌బోర్డ్‌లో కనిపించే చిన్న "ఆయిల్‌ క్యాన్‌ సింబల్‌" వెలిగితే దానిని అస్సలు లైట్‌గా తీసుకోకూడదు. ఇది లో ప్రెషర్‌, లేదా ఆయిల్‌ లెవెల్‌ తక్కువగా ఉందని సూచిస్తుంది. వెంటనే వాహనం ఆపి చెక్‌ చేయాలి.

డిప్‌స్టిక్‌తో ఆయిల్‌ ఎలా చెక్‌ చేయాలి?

కార్‌ బోనెట్‌ ఓపెన్‌ చేసి డిప్‌స్టిక్‌ను గుర్తించండి (సాధారణంగా పసుపు/ఎరుపు రంగులో ఉంటుంది).

దానిని బయటకు తీసి, వస్త్రంతో తుడిచి మళ్లీ లోపల పెట్టండి.

మళ్లీ బయటకు తీసి, ఆయిల్‌ లెవెల్‌ 'మినిమమ్‌-మాగ్జిమమ్‌' మధ్యలో ఉందో, లేదో చూడండి.

ఇంజిన్‌ ఆయిల్‌ మినిమమ్‌ లెవెల్‌ కంటే తక్కువగా ఉంటే వెంటనే టాప్‌ అప్‌ చేయాలి.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ డ్రైవర్స్‌కి ముఖ్యమైన సూచన

హైదరాబాద్, విజయవాడ లాంటి సిటీ ట్రాఫిక్‌లో ఇంజిన్‌ బాగా వేడెక్కుతుంది. సింథటిక్‌ ఆయిల్‌ వాడితే ఇంజిన్‌ మరింత కంఫర్ట్‌గా పనిచేస్తుంది. ప్రతి 8,000–10,000 kmకి ఒకసారి ఆయిల్‌ మార్చడం మంచి అలవాటు చేసుకోవాలి. హైవే డ్రైవింగ్‌ ఎక్కువ చేసే వాళ్లు తప్పనిసరిగా హై-పర్ఫార్మెన్స్‌ గ్రేడ్‌లను మాత్రమే వాడాలి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.