Brahmamudi Serial Today Episode: తమ భర్తలు రాసిన లవ్‌ లెటర్స్‌ చదివిన తర్వాత ఇవి లవ్‌ లెటర్సా అని తిడతారు అపర్ణ, కావ్య, ధాన్యలక్ష్మీ. దీంతో ఇవే లెటర్స్ పేపర్‌కు పంపిస్తే మొదటి పేజీలో వేస్తారని సుభాష్ చెప్తాడు. అయితే ప్రకాష్‌ మాత్రం లవ్‌ లెటర్‌ అద్బుతంగా రాసి చివరలో లత అనే పేరు రాయడంతో దాన్యలక్ష్మీ కోపంగా ప్రకాష్‌ను కొడుతుంది. తర్వాత రాహుల్‌ రెడీ అవుతుంటే రుద్రాణి వెళ్తుంది.

Continues below advertisement

రుద్రాణి: ఏంట్రా మార్నింగ్‌ నుంచి చాలా హడావిడిగా కనిపిస్తున్నావు..? పైగా త్వరగా రెడీ అయ్యావు. మళ్లీ ఏమైనా పార్టీ పెట్టుకున్నావా..?

రాహుల్: చూశావా నువ్వు కూడా నన్ను నమ్మడం లేదు. నీ అభిప్రాయాన్ని మార్చడానికే వెళ్తున్నాను..

Continues below advertisement

రుద్రాణి: నువ్వు అంటే ఏంటో నాకు తెలుసు కాబట్టి అడిగాను.. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు..

రాహుల్‌: పని చేయడానికి వెళ్తున్నాను

రుద్రాణి: నీకు పని ఎవరు ఇస్తున్నారు..

రాహుల్‌: పెద్ద పెద్ద జాబులైతే ఎవ్వరూ ఇవ్వరు చిన్నవి అయితే ఎవరైనా ఇస్తారు

రుద్రాణి: ఇప్పుడు చీఫ్‌గా నువ్వు అలాంటి పనులు చేయడం ఏంటి..?

రాహుల్‌: స్వప్న ఇప్పుడిప్పుడే నన్ను నమ్ముతుంది. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా..? నిలబెట్టుకోవడానికి నా కష్టార్జితంతో తనను పోషిస్తున్నాను అని తనకు అనిపించడానికే వెళ్తున్నాను

రుద్రాణి: దానికి కష్టపడటం దేనికి కష్టపడినట్టు నట్టించొచ్చు కదా..? ఆ డబ్బులేవో నేను ఇస్తాను

రాహుల్‌: నో మమ్మీ మనం చేసేది మోసమే అయినా అందులో నిజాయితీ ఉండాలి అప్పుడే స్వప్న నన్ను నమ్ముతుంది. పైగా ఇంట్లో వాళ్ల కళ్లన్నీ నా మీదే ఉన్నాయి. కొంచెం డౌటు వచ్చినా దొరికిపోతాను. ఈ సారి మాత్రం ఆ అవకాశం ఎవ్వరికీ ఇవ్వాలనుకోవడం లేదు.. కొడితే కుంభస్థలం బద్దలయిపోవాలి. వెల్లి రాజ్‌ ప్లేస్‌లో కూర్చోవాలి

రుద్రాణి: ఎంత మారిపోయావురా..? ఇప్పుడు నిన్ను చూస్తుంటే.. నాకు గర్వంగా ఉంది

రాహుల్‌: ఇప్పుడేనా మమ్మీ సాధించాల్సింది ఇంకా చాలా ఉంది బై మమ్మీ

అని చెప్పి రాహుల్‌ వెళ్లిపోతాడు. రాహుల్‌కు స్వప్న ఎదురు వస్తుంది.

స్వప్న: ఇంత ఎర్లీగా ఎక్కడికి వెళ్తున్నావు రాహుల్‌

రాహుల్‌: ఇప్పటి వరకు నా గురించే ఆలోచించాను. ఇక నుంచి నీ గురించి ఆలోచించాలని నీ గురించి ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. అందుకే వెళ్తున్నాను.

స్వప్న: అర్థం కాలేదు రాహుల్‌..

రాహుల్‌: ఈ ఇంట్లో ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు నమ్మావు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి వెళ్తున్నాను. ఈవెనింగ్‌ నీకో సర్‌ప్రైజ్‌ ఉంది. వెయిట్‌ అండ్‌ సీ

అంటూ చెప్పి వెళ్లిపోతాడు రాహుల్‌. ఇంతలో ఇందిరాదేవి వచ్చి ఎక్కడికి వెళ్తున్నాడు అని అడుగుతుంది.

స్వప్న: తెలియదు అమ్మమ్మ  ఏదో పని మీద వెళ్తున్నట్టు ఉన్నాడు

ఇందిరాదేవి: నువ్వు మళ్లీ తప్పు చేస్తున్నావు స్వప్న

స్వప్న: నేనేం చేశాను అమ్మమ్మ

ఇందిరాదేవి: వాడిని అలా ఇష్టం వచ్చినట్టు తిరగనిచ్చినందుకే కదా అలా తయారయ్యాడు. ఎక్కడికి వెళ్తున్నాడు. ఏం చేస్తున్నాడు అనేది భార్యగా నువ్వు తెలుసుకోవాలి కదా..?

స్వప్న: లేదు అమ్మమ్మ రాహుల్‌ లో మార్పు వచ్చింది

ఇందిరాదేవి: అది నీ భ్రమ స్వప్న.. వాడు పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం కదా..? వాడు మారడు

స్వప్న: ముందు నేను అలాగే అనుకున్నాను అమ్మమ్మ కానీ తను మారుతున్నాడని నా మనసుకు అనిపిస్తుంది. అందుకే తనకు సపోర్ట్‌ చేయాలనిపిస్తుంది

ఇందిరాదేవి: అడవిలో ఎలాంటి మృగంతో నైనా స్నేహం చేయోచ్చు ఒక్క నక్కతో తప్ప.. నీ మొగుడిని నక్కతో పోల్చినందుకు నీకు కోపం వచ్చినా అదే నిజం. మోసం చేయడం వాడి రక్తంలోనే ఉంది. ముఖం జాలిగా పెట్టాడని నమ్మితే మోసం చేస్తాడు జాగ్రత్తగా ఉండు

అంటూ ఇందిరాదేవి  వెళ్లిపోతుంది. తర్వాత రాజ్‌, కావ్యను రెస్టారెంట్‌ కు వెళ్దామని రెడీ అవ్వమని చెప్తాడు. అయితే తనకు శారీ కట్టమని కావ్య అడుగుతుంది. సరేనని రాజ్‌ శారీ కడుతుంటాడు. సరిగ్గా శారీ కట్టడం రావడం లేదని కావ్యనే శారీ కట్టుకుంటుంది. ఇద్దరు కలిసి రెస్టారెంట్‌కు వెళ్తారు. అక్కడ కావ్యకు సర్‌ప్రైజ్‌ ఇస్తాడు రాజ్‌. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!