గుండె నిండా గుడి గంటలు నవంబర్ 14 ఎపిసోడ్ - Gunde Ninda Gudi Gantalu 2025 November 14th Episode
సందడిగా పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయ్..అంతా ఉన్నారు బాలు తప్ప... కేక్ అరెంజ్ చేశాం రా బామ్మా కట్ చేద్దుగానివి అని రవి శ్రుతి పిలుస్తారు. కానీ బాలు రాకుండా కేక్ కట్ చేయను అని చెప్పేస్తుంది సుశీలమ్మ. మేమంతా ఉన్నాం కదా అని మనోజ్ అనగానే.. మీతో పాటూ వాడుకూడా ఉండాలి అంటుంటి. ఎక్కడో తాగి తందనాలు ఆడుతుంటాడు అని అక్కసు వెళ్లగక్కుతుంది ప్రభావతి. మీకు దివ్యదృష్టి ఉన్నట్టు మాట్లాడుతున్నారే అని సెటైర్ వేస్తుంది మీనా. ఇక్కడే ఉండి ఆయన ఎక్కడ ఏం చేస్తున్నారో ఎలా చెప్పేస్తున్నారని అడుగుతుంది. అంతకన్నా ఏం చేస్తాడు..తాగడం తప్ప అని మనోజ్ కూడా నోరుపారేసుకుంటాడు..ఆపుతారా అని మీనా గట్టిగా అడగ్గానే వణికి వెనక్కు తగ్గుతాడు. తన భర్త తాగిరాడు అని గట్టిగా చెబుతుంది. ఏదో పనిపై వెళ్లిఉంటారు, లాంగ్ ట్రిప్ ఏదైనా పడి ఉంటుందని చెబుతుంది. బాలుపై మీనాకున్న నమ్మకాన్ని మెచ్చుకున్న సుశీలమ్మ..ప్రభావతి , మనోజ్ కి ఇంత గడ్డి పెడుతుంది.
బాలు వచ్చేలోగా గిఫ్టులు తీసుకోబామ్మా అంటారు అందరూ... మనోజ్ రవ్వల హారం ఇస్తాడు, రవి నీకోసం కేక్ చేశాను బామ్మా అంటాడు, రోహిణి మేకప్ వేస్తుంది, శ్రుతి మొబైల్ ఫోన్ ఇస్తుంది...ప్రభావతి టీవీ ఇస్తుంది.. ఇంకా బాలు రాలేదు..ఆలస్యం అవుతోందంటూ అంతా అనుకున్న టైమ్ లో ఎంట్రీ ఇస్తాడు బాలు. ఈ రోజు నేను నీకోసం పెద్ద బహుమతి తెచ్చాను షీలా డార్లింగ్ అంటాడు. అంతా అవాక్కై చూస్తారు. అప్పుడు కూడా బాలు గెలుస్తాడేమో అనే అక్కసుతో సెటైర్స్ వేస్తుంది ప్రభావతి. సుశీలమ్మ కళ్లు మూసి సర్ ప్రైజ్ అంటాడు బాలు. అప్పుడే ఎంట్రీ ఇస్తారు ఆమె చిన్ననాని స్నేహితులు ఇద్దరూ... మీనాతో మాట్లాడుతూ నా చిన్నప్పటి స్నేహితులు ముగ్గురున్నారు ...ఎంతో సంతోషంగా, సందడిగా ఉండేవారం..మళ్లీ వాళ్లను కలుస్తానో లేదో...నా చివరి కోరిక తీరుతుందో లేదో అని బాధపడుతుంది. ఆ వీడియో బాలుకి పంపిస్తుంది మీనా. వాళ్లని వెతికి పట్టుకునే పనిలోనో బాలు రోజు మొత్తం బయటే ఉంటాడు. ఎట్టకేలకు నానమ్మ సుశీల బెస్ట్ ఫ్రెండ్స్ ముగ్గురినీ తీసుకొస్తాడు.
కళ్లు తెరిచిన సుశీలమ్మ..తన చిన్ననాటి స్నేహితులను చూసి చిన్న పిల్లైపోతుంది. బాల్యంలో ఆడుకున్న ఆటపాటలు, చేసిన అల్లరిపనులు గుర్తుచేసుకుంటుంది. నా ఆటో గ్రాఫ్ స్వీట్ మెమొరీస్ మూవీలో గుర్తుకొస్తున్నాయి అనే పాట బ్యాగ్రౌండ్ లో ఈ స్నేహితులు సబ్బులు, రాజీ, సత్య, సుశీల చేసిన అల్లరి చూపించారు. వృద్ధాప్యంలో జ్ఞాపకాలను మించిన బహుమతి లేదు..అలాంటి జ్ఞాపకాలను బహుమతిగా ఇచ్చిన బాలుకి సుశీలమ్మ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. ఆ గిఫ్ట్ ఏంటో చూడాలి...
ఇంకా నకిలీ బంగారం లెక్క పెండింగ్ లో ఉందండోయ్... శ్రుతి తల్లికి అంటే ఏదో సమాధానం చెప్పి పంపించారు... సుశీలమ్మ వెళ్లిపోయిన తర్వాత బాలు అడిగే ప్రశ్నలకు ప్రభావతి-మనోజ్ ఏం చెబుతారో చూడాలి....
వారణాసి నుంచి శివుడి ప్రపంచ సంచారం, SSMB29 లో మహేష్ క్యారెక్టర్ పై క్లారిటీ! 'సంచారి' పాటలో శివతత్వం!