Illu Illalu Pillalu Serial Today Episode భాగ్యం పచ్చళ్ల బిజినెస్ చేస్తానని 25 లక్షలు అప్పుగా ఇప్పించమని వేదవతిని అడుగుతుంది. నర్మద, ప్రేమ వీళ్లు కొత్త నాటకం మొదలు పెట్టారు అంతు చూడాలి అని అనుకుంటారు. పచ్చళ్లు పెట్టడానికి అంత డబ్బు ఎందుకు అని నర్మద అడుగుతుంది. దానికి భాగ్యం ఈ భాగ్యం పెట్టేది అల్లాటప్పా పచ్చళ్లు కాదు అదీ ఇదీ అని సెల్ప్‌ డబ్బా కొడుతుంది. 

Continues below advertisement

వల్లీ కూడా ప్రచారానికే 2, 3  లక్షలు అవుతాయి అని  అంటుంది. దాంతో నర్మద, ప్రేమలు అవన్నీ సరే అసలు మీకు పచ్చళ్లు పెట్టడం వచ్చా అని అడుగుతారు. ఎవరి పట్టుకొని ఏం అడుగుతున్నావ్..  చేయి తిరిగింది.. కాలు కూడా తిరిగుతుంది అని ఇడ్లీ బాబాయ్ కూస్తాడు. ప్రేమ కావాలనే అతన్ని రెచ్చగొట్టడంతో కావాలంటే ఇక్కడే ఇప్పుడే నా భార్య పచ్చళ్లు పెడుతుంది మామిడి కాయలు తీసుకురండి అని చెప్తాడు. మీరు పచ్చడి బాగా పెడితే మా మామయ్యకి టేస్ట్ నచ్చితే పాతికేంటి అవసరం అయితే 30 లక్షలు అయినా ఇస్తారు అని ప్రేమ అంటుంది. 

ఇదే మంచి అవకాశం అంటూ ఇడ్లీబాబాయ్, భాగ్యం, వల్లీ పచ్చళ్లు పెట్టడం మొదలు పెడతారు. వల్లీ తల్లికి తనకు కూడా పది లక్షలు ఇవ్వమని అంటుంది. పది లక్షలే అవేమైనా చాక్లెట్లు అనుకున్నావా అలా అడుగుతున్నావ్ అని అంటే ఆ బండ సచ్చినోడు చంపేస్తున్నాడు అందుకే వాడికి ఇచ్చేస్తా నేను ప్రశాంతంగా ఉంటా అని వల్లీ అంటుంది. అలాగేలేవే అని భాగ్యం అంటుంది.

Continues below advertisement

నర్మద, ప్రేమలు వచ్చి పచ్చళ్లు అద్భుతంగా చేస్తున్నారు.. విదేశాల్లో వ్యాపారం చేస్తారు.. మూమూలుగా ఉంటాయా.. అంటూ మాటల్లో పెట్టి నర్మద పచ్చళ్లలో ఎక్కువ ఉప్పు కలిపేస్తుంది. భాగ్యానికి అనుమానం వచ్చి మీరు ఏదో తేడాగా మాట్లాడుతున్నారు.. వీళ్ల ప్లాన్ అర్థం కావడం లేదు అని భాగ్యం అంటుంది. వాళ్ల గురించి మనకు ఎందుకు పచ్చడిలో ఉప్పు వేయి అని అంటాడు. భాగ్యం మరోసారి ఉప్పు వేసేసి కలుపుతుంది. టేస్ట్ చూసే టైంకి ఇడ్లీబాబాయ్ ఆపేస్తాడు. నర్మద వాళ్లు నవ్వుకుంటారు. పచ్చళ్లు అదుర్స్ మనకు 25 లక్షలు గ్యారెంటీ అని అనుకుంటారు.

రామరాజు వచ్చి అందర్ని భోజనాలకు పిలుస్తాడు. వేదవతి దగ్గరుండి వడ్డిస్తుంది. ఇంతలో భాగ్యం వచ్చి అవకాయ పచ్చడితోనే తినమని అంటుంది. నర్మద, ప్రేమలు  రామరాజు దగ్గర బాగా బిల్డప్ ఇస్తారు. మంచి ఆలోచన అని రామరాజు పొగుడుతాడు. 25 లక్షల అప్పు గురించి కూడా వేదవతి చెప్తుంది. దాంతో భాగ్యం నెలనెలా కట్టేస్తాం అని అంటుంది. దాంతో రామరాజు సాయం చేస్తా అని అంటాడు. ఇక టేస్ట్ చూడటానికి అవకాయ వేసుకుంటాడు. 

రామరాజు టేస్ట్ చూసి అలా ఉండిపోతాడు. అంత బాగుందా అని సాగర్, చందు, తిరుపతి కూడా అడిగి మరీ తిని నలుగురు వాంతులు చేసుకోవడానికి ఒకే సారి పరుగెడతారు. రామరాజు ఏంటమ్మా ఇది అసలు ఇది పచ్చడేనా.. ఉప్పు నషాలానికి అంటుతుందని పచ్చడి చండాలంగా ఉంది అని అంటాడు. మీ పచ్చళ్ల వ్యాపారం మీ వల్ల కాదు.. ఇంకేమైనా వ్యాపారం చూసుకో అని అంటాడు. మీరు ఏదో చేస్తారు అని మీకు అప్పు ఇవ్వమని చెప్పా కానీ మీ వల్ల ఆయన తినకుండా వెళ్లిపోయారు అని వేదవతి అంటుంది. 

భాగ్యం వాళ్లు కూడా టేస్ట్ చూసి చీ అనుకుంటారు. ఎందుటి వాళ్లని మాయ చేయాలి అనుకుంటే ఇలాగే జరుగుతుంది. మీరు కష్టపడి పని చేస్తే మీకు అండగా మేం ఉంటాం అని నర్మద, ప్రేమ అంటారు. చేతులు దాకా వచ్చిన డబ్బు నోటి దాకా రాకుండా చేస్తారా మీ ఇద్దరి పని చెప్తా అని భాగ్యం రగిలిపోతుంది. 

ప్రేమ కాలేజ్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్‌తో కలిసి రోడ్డు మీద ఉంటుంది. ఇంతలో ధీరజ్ కారులో వచ్చి ఆపితే ప్రేమ ఎక్కదు. ఎంత హారన్ కొట్టినా ఎక్కకపోవడంతో ఎక్కవే నిన్ను కిడ్నాప్ చేస్తా అని ధీరజ్ అంటాడు. ప్రేమ ఎక్కకపోవడంతో ధీరజ్ బలవంతంగా ఎక్కించి నీకు ఓ సర్‌ఫ్రైజ్ అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.