భారతదేశంలో డీజిల్ ఇన్నోవా క్రిస్టా కోసం బుకింగ్‌లు నిలిపివేశారు. రాబోయే కొద్ది నెలల పాటు పెట్రోల్ ఇన్నోవా బుకింగ్‌లు మాత్రమే చేసుకోవచ్చు. అంటే మోస్ట్ పాపులర్ ఇన్నోవా డీజిల్ ఆగిపోయినట్లే అనుకోవచ్చు. భారతదేశం మొత్తం మీద ఇన్నోవా అమ్మకాల్లో ఇన్నోవా క్రిస్టా డీజిలే ముందంజలో ఉండేది.
ఒకవైపు కారు ధరలు పెరుగుతున్నప్పటికీ దానికి ప్రజాదరణ తగ్గలేదు. కాబట్టి డీజిల్ ఇన్నోవా బుకింగ్‌లు నిలిపివేయడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కస్టమర్‌లు పెట్రోల్ ఇన్నోవాను బుక్ చేసుకోగలిగినప్పటికీ, రాబోయే కొత్త తరం ఇన్నోవా పెట్రోల్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో వస్తుంది. కొంతకాలం తర్వాత మార్పులతో డీజిల్ కరెంట్ ఇన్నోవాను మళ్లీ ప్రారంభించే అవకాశం ఉంది.
ఈ విషయమై టొయోటా నుంచి అధికారిక ప్రకటన రాలేదు కానీ తదుపరి తరం ఇన్నోవాను ప్రస్తుత ఇన్నోవా క్రిస్టాతో పాటు విక్రయించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది రాబోయే తరం ఇన్నోవా హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో రాబోతోంది తప్ప డీజిల్ లేదా పెట్రోల్‌తో కాదు అనే విషయం కూడా తెలుస్తోంది. టొయోటా హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ల గురించి స్పష్టమైన ఐడియా రావాలంటే హైరైడర్‌ను గమనించవచ్చు.
తదుపరి తరం ఇన్నోవా కొత్త ప్లాట్‌ఫారమ్, కొత్త హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్, చాలా విలాసవంతమైన ఇంటీరియర్‌లతో చాలా భిన్నంగా ఉంటుంది. డీజిల్ ఇంజన్ కలిగిన ఇన్నోవాకు ఇప్పటికీ భారతదేశంలో భారీ అభిమానులు ఉన్నారు . ప్రస్తుతం డీజిల్ కార్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉందని అర్థం అవుతోంది.
టొయోటా హైరైడర్ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. ఇది ఒక సెల్ఫ్ చార్జింగ్ ఎలక్ట్రిక్ స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టం ఉన్న కారు కావడం విశేషం. ఈ విభాగంలో లాంచ్ అయిన పూర్తిస్థాయి మొదటి హైబ్రిడ్ కారు ఇదే. 1.5 లీటర్ కే-సిరీస్ ఇంజిన్‌ను ఇందులో అందించారు. ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ కూడా ఈ కారులో ఉంది. దీని ఇంజిన్ పవర్ అవుట్‌పుట్ 100 హెచ్‌పీ కాగా, పీక్ టార్క్ 135 ఎన్ఎంగా ఉంది. ఇంజిన్, హైబ్రిడ్ మోటార్ పవర్‌ను కలిపినపుడు ఈ కారు 113 హెచ్‌పీ పవర్ అవుట్‌పుట్‌ను అందించనుంది.
ఈ డిపార్ట్‌మెంట్‌లో ఆల్ వీల్ డ్రైవ్ ఫీచర్ ఉన్న మొదటి కారు అర్బన్ క్రూజర్ హైరైడరే. ఫైవ్ స్పీడ్ మాన్యువల్ లేదా సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్లు ఇందులో ఉన్నాయి. టొయోటా హైఎండ్ ఉత్పత్తులు కామీ, వెల్‌ఫైర్‌ల్లో కూడా ఇదే హైబ్రిడ్ టెక్నాలజీ ఉంది.
ఇక మైలేజ్ విషయానికి వస్తే... ఈ అర్బన్ క్రూజర్ హైరైడర్‌ను 40 నుంచి 50 శాతం ఇంప్రూవ్ చేశారు. అయితే దీని మైలేజ్ నంబర్లను కంపెనీ అధికారికంగా విడుదల చేయలేదు. 27 శాతం తక్కువ కర్బన ఉద్గారాలను ఈ కారు విడుదల చేయనుంది.
యాంబియంట్ లైటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ చార్జర్, తొమ్మిది అంగుళాల ఇన్‌ఫోటెయిన్‌మెంట్ సిస్టం, వెంటిలేటెడ్ డ్యూయల్ టోన్ సీట్ల వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఆరు ఎయిర్ బ్యాగ్‌లు, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, డీసెంట్, ఆల్ వీల్ డిస్కులు వంటి సేఫ్టీ ఫీచర్లను టొయోటా ఇందులో అందించింది.
ఏడు మోనోటోన్ కలర్ ఆప్షన్లు, నాలుగు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లలో ఈ కారును కొనుగోలు చేయవచ్చు. టొయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. కానీ దీని బుకింగ్స్ కూడా ప్రారంభం అయ్యాయి. రూ.25 వేలు చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు. దీని ధర రూ.10 లక్షల రేంజ్ నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?