ఏయ్, మేం ఐటీ డిపార్ట్ మెంట్ నుంచి వచ్చాం, మీ షాపులో బంగారం లెక్కల్లో తేడాలున్నాయంటూ 8 మంది ముఠా ఈరోజు నెల్లూరులో హల్ చల్ చేసింది. మండపాల వీధిలోని ఓ షాపులో దూరి వారిని బయటకు పోనీయకుండా అడ్డుకుంది. అందులో ఓ వ్యక్తి పోలీస్ యూనిఫామ్ వేసుకోని ఉండటంతో షాపు యజమానులు కంగారు పడ్డారు. రెండు మూడు షాపుల్లో ఇలానే బెదిరించి 12 కేజీల బంగారాన్ని మూటగట్టుకొని పోవడానికి ప్రయత్నించారు.
అచ్చం గ్యాంగ్ సినినిమాలో చూపించినట్టే చేశారు. ఇక్కడ మాత్రం బొమ్మ తిరగబడింది. ముఠాపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తే అసలు సంగతి వెలుగు చూసింది. వారి వ్యవహారశైలిపై అనుమానం వచ్చిన గోల్డ్ మర్చంట్స్ అసోసియేషన్ నాయకులు నిలదీశారు. ఎందుకైనా మంచిదని పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. ఫిర్యాదు అందుకొని సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు ఆ ముఠా గుట్టును రట్టు చేశారు.
నెల్లూరు జిల్లా బంగారు షాపుల్లో పండగ సీజన్లో బిజినెస్ బాగా సాగుతుంది. అయితే ఇక్కడ చాలా షాపుల్లో చెన్నై నుంచి బంగారాన్ని జీఎస్టీ లేకుండా తెచ్చుకుంటారు. ఆభరణాలు చేసి అమ్ముతుంటారు. చిన్న చిన్న షాపుల్లో జరిగే తంతు ఇది. ఇటీవల ఐటీ దాడుల కలవరం పెరిగే సరికి దాదాపుగా అలాంటి బిజినెస్ కి ఫుల్ స్టాప్ పడిందని అంటారు. కానీ ఏడాదికి కనీసం రెండుసార్లు నెల్లూరులోని బంగారు షాపుల్లో ఐటీ దాడులు జరుగుతుంటాయి. ఈ క్రమంలో ఈరోజు కూడా ఐటీ డిపార్ట్ మెంట్ దాడులంటూ నెల్లూరులో కలవరం మొదలైంది. కట్ చేస్తే అది ఫేక్ అని తేలింది. మొత్తం 8మంది ముఠా ఐటీ అధికారులం అంటూ నెల్లూరు బంగారు షాపుల్లో చొరబడి లెక్కలు తీయండి అంటూ భయపెట్టారు. హడావిడి చేశారు.
నెల్లూరులో మండపాల వీధిలోని ఓ షాపులో దూరి వారిని బయటకు పోనీయకుండా అడ్డుకుంది. అందులో ఓ వ్యక్తి పోలీస్ యూనిఫామ్ వేసుకోని ఉండటంతో షాపు యజమానులు కంగారు పడ్డారు. రెండు మూడు షాపుల్లో ఇలానే బెదిరించి 12 కేజీల బంగారాన్ని మూటగట్టుకొని పోవడానికి ప్రయత్నించారు. ఇంతలో గోల్డ్ మర్చంట్స్ అసోసియేషన్ నాయకులు అనుమానంతో పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు వచ్చి వారు నకిలీ అధికారుగా నిర్థారించారు. అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు.
వాస్తవానికి ఇలాంటి దాడుల్లో అప్పటికప్పుడు సెటిల్మెంట్ లు జరుగుతాయని అంటారు. కానీ.. ఇక్కడ షాపుల్లో తనిఖీలకు వచ్చిన ముఠా మొత్తంగా బంగారాన్ని దోచేయాలని చూసింది. ఏకంగా 12 కేజీల బంగారాన్ని మూటగట్టుకొని కారులో పారిపోవడానికి ప్రయత్నించింది. దీంతో షాపు యజమానులకు, గోల్డ్ మర్చంట్స్ అసోసియేష్ వారికి అనుమానం వచ్చింది. వెంటనే వారు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు హుటాహుటిన వచ్చి వారి ఐడీకార్డులు తనిఖీలు చేశారు. వచ్చినవారంతా ఫేక్ అని తేల్చారు. వీరికి తోడుగా ఓ వ్యక్తి ఏకంగా పోలీస్ యూనిఫామ్ వేసుకుని రావడం మరీ విశేషం. పోలీస్ యూనిఫామ్ లో వచ్చిన వ్యక్తి కూడా నకిలీ ఐడీ కార్డ్ తో హల్ చల్ చేశాడు. వీరందర్నీ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఒక్కసారిగా నెల్లూరులో నకిలీ ముఠా దిగింది, బంగారు షాపుల యజమానుల్ని బెదిరిస్తోంది అనే విషయం కలకలం రేపింది. తనిఖీలు జరుగుతున్నాయనే వార్తలతో నెల్లూరులోని చిన్న చిన్న షాపులన్నీ మూతబడ్డాయి. ఆ తర్వాత అది నకిలీ ముఠా పని అని తెలిసిన తర్వాత అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నకిలీ ముఠాని పోలీసులు అరెస్ట్ చేయడంతో బంగారు షాపుల యజమానులు కుదుటపడ్డారు. షాపుల్లో దోపిడీ జరగకుండా పోలీసులు అడ్డుకున్నారు. నెల్లూరు త్రీ టౌన్ సీఐ అన్వర్ బాషా, ఎస్సై.. ఇతర సిబ్బందితో కలసి సంఘటన స్థలానికి చేరుకుని దొంగల ముఠాని అరెస్ట్ చేశారు. విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ కు తరలించారు