Electric Cars Sale Report: మనదేశంలో ఎలక్ట్రిక్ కార్ల సేల్ తగ్గినట్లు సేల్స్ నంబర్స్ చెబుతున్నాయి. 2024 జూన్ వరకు అందుబాటులో ఉన్న  డేటా ప్రకారం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయం గణనీయంగా తగ్గింది. అదే సమయంలో ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు, ప్యాసింజర్ వాహనాలు, వాణిజ్య వాహనాల మొత్తం రిటైల్ విక్రయాలు 16 శాతం పెరిగాయి. 2024 ప్రథమార్థంలో ఎలక్ట్రిక్ కార్లు 42,217 యూనిట్లు అమ్ముడుపోయాయి. అయితే ఇది గతేడాదితో పోలిస్తే 14 శాతం తక్కువ.


గణాంకాల ప్రకారం టాటా, మహీంద్రా, ఎంజీ మోటార్, మెర్సిడెస్, బీఎండబ్ల్యూ, ఆడీ ఈవీ వంటి కంపెనీలు జూన్‌లో మొత్తం 5,562 ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించాయి. గత నెలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల విక్రయం 16.27 శాతం తగ్గిందని, గతేడాది జూన్‌తో పోలిస్తే ఈ కంపెనీల సేల్స్ ఏకంగా 20 శాతం తగ్గిందని ఈ గణాంకాలు చెబుతున్నాయి. అయితే 2024 మొదటి ఆరు నెలల్లో ఈ కంపెనీల అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 21 శాతం పెరిగాయి.


Also Read: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌‌కు పోటీగా రాబోతున్న బ్రిటిష్ బైక్, ఇండియాలో లాంచింగ్ ఎప్పుడంటే?


విత్‌డ్రా చేసుకోవడమే కారణం...
2024 మార్చి 31వ తేదీన ఫేమ్ II సబ్సిడీ స్కీమ్‌ను విత్‌డ్రా చేసుకున్నారు. ఇది ఎలక్ట్రిక్ టూ వీలర్, త్రీ వీలర్ వాహనాల అమ్మకాలపై ప్రభావం చూపింది. ఆ తర్వాత కంపెనీలు తమ కార్ల ధరలను పెంచాయి.


మొత్తం ఈవీ అమ్మకాల్లో టూ వీలర్లు, త్రీ వీలర్ల వాటా 94 శాతంగా ఉంది. మొదటి ఆరు నెలల్లో ఈ వాహనాలు 7,91,402 యూనిట్లు అమ్ముడయ్యాయి. మొత్తం ఈవీ అమ్మకాలను పరిశీలిస్తే, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు 57.46 శాతం, ఎలక్ట్రిక్ త్రీ వీలర్ల వాటా 36.49 శాతంగా ఉంది.


ఈ సంవత్సరం మార్చిలో ఫేమ్ II స్థానంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్‌ను (EMPS) ప్రవేశపెట్టారు. ఈ స్కీమ్ ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2024 జూలై 31వ తేదీ వరకు అమలు కానుంది. ఈఎంపీఎస్ మొత్తం బడ్జెట్ రూ. 500 కోట్లుగా ఉంది.



Read Also: ఇండియన్ సేఫ్టీ టెస్టులో 5 స్టార్లు సాధించిన ఈవీలు ఇవే - దేశంలో సేఫెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు!