E20 petrol contamination: E20 పెట్రోల్‌లో క్లోరైడ్ & తేమ స్థాయిలు అధికంగా ఉన్నాయంటూ ఇటీవల వచ్చిన ఆరోపణలను ప్రభుత్వ రంగ చమురు సంస్థలు (OMCలు) ఖండించాయి. దేశవ్యాప్తంగా విస్తృత పరీక్షలు నిర్వహించిన OMCలు, E20 పెట్రోల్‌ కలుషితం అవుతోందన్న ఆధారాలు కనిపించలేదని ప్రకటించాయి.

Continues below advertisement

Indian Oil, Bharat Petroleum & Hindustan Petroleum సంస్థలు (OMCలు) ఈ వివరాలను వెల్లడించాయి. రిఫైనరీలు, ఇథనాల్ ప్లాంట్లు, నిల్వ కేంద్రాలు, ట్యాంకర్ వాహనాలు & పెట్రోల్ బంకుల్లో ఇంధన నమూనాలను సేకరించి పరీక్షించినట్లు అలి చెప్పాయి.

క్లోరైడ్ స్థాయిలు 0 నుంచి 3 ppm మధ్యే

Continues below advertisement

దేశవ్యాప్తంగా సేకరించిన ఇంధన నమూనాల్లో క్లోరైడ్ స్థాయిలు 0 నుంచి 3 ppm మధ్య ఉన్నట్లు OMCలు తెలిపాయి. గతంలో కొన్ని వందల ppm వరకు క్లోరైడ్ ఉన్నట్లు వచ్చిన నివేదికలను పరీక్షలు ధృవీకరించలేదని స్పష్టం చేశాయి.

రిఫైనరీల నుంచి సేకరించిన 100కు పైగా పెట్రోల్ నమూనాలను పరీక్షించారు. 80 ఇథనాల్ డిస్టిలరీల నుంచి వచ్చిన ఇథనాల్‌ను కూడా పరిశీలించారు. టెర్మినల్స్ నుంచి 80కి పైగా నమూనాలు & రిటైల్ పెట్రోల్ బంకుల నుంచి 160కి పైగా నమూనాలను పరీక్షించారు. ఈ పరీక్షల్లో అన్ని నమూనాల్లోనూ క్లోరైడ్ స్థాయిలు 0 నుంచి 3 ppm పరిధిలోనే ఉన్నాయని సంస్థలు తెలిపాయి. ఇథనాల్ పరీక్షలను OMCలు & పెట్రోలియం మంత్రిత్వ శాఖకు చెందిన సాంకేతిక విభాగం 'సెంటర్‌ ఫర్‌ హై టెక్నాలజీ' సంయుక్తంగా నిర్వహించింది.

ఇది కూడా చదవండి: కారు నుంచి లారీ వరకు.. ఫిట్‌నెస్‌ను ఇక యంత్రాలే పరీక్షిస్తాయి! తెలంగాణలో 15 చోట్ల కొత్త వ్యవస్థ

రెండు పెట్రోల్ బంకుల్లో మాత్రం సమస్య

దేశవ్యాప్త పరీక్షల్లో రెండు రిటైల్ పెట్రోల్ బంకుల్లో క్లోరైడ్ స్థాయిలు అధికంగా నమోదయ్యాయని OMCలు వెల్లడించాయి. దీంతో ఆ రెండు కేంద్రాలకు ఇంధన సరఫరాను తాత్కాలికంగా నిలిపేసి అక్కడ ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించారు. అవసరమైన దిద్దుబాటు చర్యలు చేపట్టిన తర్వాతే మళ్లీ ఇంధన సరఫరాను ప్రారంభించారు. అంటే దేశవ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకుల్లో కలుషిత E20 పెట్రోల్‌ ఉందన్న ఆరోపణలకు ఈ పరీక్షల్లో ఆధారాలు లభించలేదని సంస్థలు చెబుతున్నాయి.

పెట్రోల్‌లో తేమపై కూడా ప్రత్యేక తనిఖీలు

E20 పెట్రోల్‌లో నీరు లేదా తేమ కలిసే అవకాశం ఉందన్న అంశంపైనా OMCలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. దేశవ్యాప్తంగా సుమారు 90,000 పెట్రోల్ బంకుల్లో భూగర్భ ఇంధన నిల్వ ట్యాంకులను తనిఖీ చేయడం ప్రారంభించినట్లు తెలిపాయి. ఈ ట్యాంకుల్లో రోజుకు 8 నుంచి 12 సార్లు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఇప్పటివరకు, ఎక్కడా భూగర్భ ట్యాంకుల్లోకి నీరు చేరినట్లు గుర్తించలేదని స్పష్టం చేశాయి.

మొబైల్ ఇంధన పరీక్ష ప్రయోగశాలలను కూడా రంగంలోకి దించారు. పరీక్షల ఫలితాలను ప్రత్యేక ఇంధన ప్రయోగశాలల ద్వారా స్వతంత్రంగా ధృవీకరిస్తున్నట్లు OMCలు తెలిపాయి. పరీక్షల వివరాలను 'సెంటర్‌ ఫర్‌ హై టెక్నాలజీ' వెబ్‌సైట్‌లో కూడా ప్రచురిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: నిస్సాన్ గ్రావైట్ CNG రియల్‌ మైలేజ్‌ టెస్ట్‌.. కేజీకి ఎంత దూరం వెళ్లిందంటే?

SIAM నివేదికతో మొదలైన వివాదం

సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మానుఫాక్చరర్స్‌ (SIAM) ఇటీవల వెల్లడించిన సమాచారంతో E20 పెట్రోల్ కలుషితం వివాదం మొదలైంది. E20 ఇంధనంలో క్లోరైడ్ & తేమ స్థాయిలు పెరిగినట్లు ఆ సమాచారంలో SIAM పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. దీనివల్ల వాహనాల ఇంధన వ్యవస్థ భాగాలకు నష్టం కలిగే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి.

అయితే ఆ తర్వాత, SIAM తన సమాచారాన్ని ఉపసంహరించుకుంది. తన పత్రంలోని కొన్ని భాగాలను మీడియా ఎంపిక చేసి ప్రచురించిందని తెలిపింది. కొన్ని గణాంకాలను మరింత డేటా సేకరణ & సభ్య సంస్థలతో సంప్రదింపుల తర్వాతే ధృవీకరించాల్సి ఉందని స్పష్టం చేసింది.

ప్రస్తుతం OMCల తాజా పరీక్షల ప్రకారం, E20 పెట్రోల్‌లో పెద్ద స్థాయిలో క్లోరైడ్ లేదా తేమ కలుస్తున్నట్లు ఆధారాలు లేవు. మరిన్ని నమూనాల పరీక్షలు కొనసాగుతున్నాయని & ఆ ఫలితాలను కూడా వెల్లడిస్తామని OMCలు తెలిపాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.