E20 Fuel Impact On Bikes: భారత ప్రభుత్వం, ముడి చమురు దిగుమతులను తగ్గించడానికి & వాహనాల నుంచి విడుదలయ్యే CO2 లేదా కార్బన్ డయాక్సైడ్‌ను తగ్గించడానికి E20 ఇంధనాన్ని ప్రోత్సహిస్తోంది. వాస్తవానికి, E20 పెట్రోల్‌ను అందుబాటులోకి తేవడానికి కేంద్ర ప్రభుత్వం 2030 వరకు గడువు పెట్టుకున్నా, అది చాలా ముందే అందుబాటులోకి వచ్చింది. 2030 గడువుకు ముందే భారతదేశం అంతటా E20 ఇంధనం అందుబాటులో ఉందని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈ పరిస్థితిలో, E20 గురించి ప్రజల నుంచి, ముఖ్యంగా కార్‌ & బైకుల యజమానుల నుంచి చాలా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ కథనంలో, అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. 

E20 పెట్రోల్‌ అంటే కూడా పెట్రోలే. అయితే, పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపడం (Blending 20 percent ethanol into petrol) ద్వారా దానిని తయారు చేస్తారు. ఈ విషయం "E20 పెట్రోల్‌" పేరులోనే స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటి వరకు E10 ఇంధననాన్ని మన కార్లు, బైకులు, ఇతర వాహనాల్లో విస్తృతంగా ఉపయోగిస్తున్నాం, ఈ పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్ కలిసి ఉంటుంది. 

కొత్త కార్లకు సురక్షితమేనా? చాలా కార్ల తయారీ కంపెనీలు, ఇప్పటికే E20 కంప్లైంట్ కార్లను తయారు చేయడం ప్రారంభించాయి. 01 ఏప్రిల్ 2023 తర్వాత తయారైన అన్ని కార్లు E20కి అనుకూలంగా ఉంటాయి & అంతకు ముందు తయారు చేయబడిన కొన్ని కార్లు కూడా దీనికి అనుకూలంగా ఉంటాయి. కాబట్టి మీ కారు కొత్తది  లేదా & 01 ఏప్రిల్ 2023 తర్వాత ఉత్పత్తి అయినది అయితే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇంకా మీకు ఏదైనా సందేహం ఉంటే, మీ కారు మాన్యువల్‌లో కంపెనీ పేర్కొన్న ఇంధన సిఫార్సులను చెక్‌ చేయవచ్చు. 

నా కారు పాతదైతే పరిస్థితి ఏంటి, E20 పెట్రోల్‌ పోయవచ్చా?2012 తర్వాత & 2023 కి ముందు తయారైన వాహనాలు సాధారణంగా E10 ఇంధనానికి అనుకూలంగా ఉంటాయి & ఇక్కడే సమస్య ప్రారంభమవుతుంది. సోషల్ మీడియాలో చాలా మంది వినియోగదారులు E20 ఇంధనాన్ని ఉపయోగించడం వల్ల మైలేజ్‌లో స్వల్ప తగ్గుదల ఉందని ఫిర్యాదు చేశారు. ARAI ప్రకారం, మైలేజీలో స్వల్ప తగ్గుదల ఉండవచ్చు కానీ అది వాహనానికి పెద్దగా హాని కలిగించదు. సరళంగా చెప్పాలంటే, E20 ఇంధనాన్ని జోడించడం వల్ల మీ కారుకు వెంటనే నష్టం జరగదు, కానీ దీర్ఘకాలంలో ఇంజిన్ తరుగుదలకు కారణమవుతుంది. అయితే, ఇది మీ కారు వయస్సుపై కూడా ఆధారపడి ఉంటుంది. అందువల్ల, ఆడిటివ్స్‌ లేదా ఇథనాల్ లేకుండా హై ఆక్టేన్ ఫ్యూయల్‌ను ఉపయోగించడం మంచిది. అయితే,  హై ఆక్టేన్ ఫ్యూయల్‌ కొంచం ఖరీదు ఎక్కువ. 

కారు వారంటీకి ఏమి జరుగుతుంది?ఇది పెద్ద సమస్య కావచ్చు. కంపెనీ సిఫార్సు చేసిన ఇంధనాన్ని కారులో ఉపయోగించకపోతే వారంటీ రద్దు చేయవచ్చని టయోటా స్పష్టం చేసింది.

ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? E10 & E20 ఇంధనాలను అందించడం మంచి విషయమే కావచ్చు. దీనితో పాటు, E10 కార్లను E20 కోసం కూడా సిద్ధంగా ఉంచడం కూడా ఒక పరిష్కారం కావచ్చు. అంటే, కార్‌ తయారీ కంపెనీలు E20 అప్‌గ్రేడ్ సొల్యూషన్స్‌ను కూడా అందించవచ్చు. కానీ, ఇది మనం అనుకున్నంత సులభమైతే కాదు.