Cloud burst in Kashmir: జమ్మూ కశ్మీర్‌లోని కిష్టవార్ జిల్లాలోని పద్దర్ సబ్ డివిజన్‌లోని చిషోటి గ్రామంలో గురువారం మధ్యాహ్నం హఠాత్తుగా భారీ క్లౌడ్ బరస్ట్ సంభవించింది. ఈ ఘటన మచైల్ మాతా యాత్ర మార్గంలో జరిగింది. ఈ క్లౌడ్ బరస్ట్‌లో కనీసం 12 మంది మరణించినట్లు అధికారులు నిర్ధారించారు. వారి మృతదేహాలను వెలికి తీశారు. శిథిలాల కిందట మరికొంత మంది ఉండవచ్చని భావిస్తున్నారు. స్థానిక వర్గాల ప్రకారం, 200 నుండి 300 మంది, యాత్రికులతో సహా, ఈ వరదల్లో చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు.
క్లౌడ్ బరస్ట్ చసోటి గ్రామంలో, మచైల్ మాతా ఆలయానికి వెళ్ళే మార్గంలో, మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో జరిగింది. చసోటి ఆలయానికి వెళ్ళే రహదారి ముగిసే చివరి గ్రామం, ఇక్కడ నుండి యాత్రికులు 8.5 కిలోమీటర్ల ట్రెక్కింగ్ చేస్తారు. క్లౌడ్ బరస్ట్ కారణంగా కమ్యూనిటీ కిచెన్, షెడ్‌లు, రోడ్లు, భోజనశాలలు, , ఇతర మౌలిక సదుపాయాలు కొట్టుకుపోయాయి.
వరదలు గ్రామంలోని అనేక ఇళ్లను దెబ్బతీశాయి, రోడ్లు ధ్వంసమయ్యాయి మచైల్ మాతా యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆర్మీ, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF), సివిల్ అడ్మినిస్ట్రేషన్, రెడ్ క్రాస్ బృందాలు రెస్క్యూ, రిలీఫ్ కార్యకలాపాల్లో పాల్గొంటున్నాయి.
కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్* కిష్టవార్ డిప్యూటీ కమిషనర్‌తో మాట్లాడి, రెస్క్యూ ఆపరేషన్‌లను వేగవంతం చేయాలని, నష్టాన్ని మదింపు చేయాలని సూచించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం ఒమర్ మాట్లాడి, సంఘటన గురించి సమాచారం అందించారు. రెస్క్యూ కోసం అన్ని సాధ్యమైన వనరులను ఉపయోగించాలని ఆదేశించారు.