Car Modification: చాలా సార్లు, కొత్త కారును కొనుగోలు చేసిన తర్వాత మార్కెట్ యాక్సెసరీలు ఇన్‌స్టాల్ చేయడం లేదా సీఎన్‌జీ కిట్ పెట్టించడం వంటి పొరపాట్లను వినియోగదారులు చేస్తారు. దీని కారణంగా వారు భారీ నష్టాలను భరించవలసి ఉంటుంది. కొత్త కారుపై వారంటీని కూడా కోల్పోతారు. కాబట్టి వారంటీ కోల్పోకుండా ఉండాలంటే ఈ పనులను అస్సలు చేయవద్దు.
వైరింగ్ కట్ చేయవద్దు
కొత్త వాహనం కొన్న తర్వాత ఇది చాలాసార్లు జరుగుతుంది. చాలా మంది వ్యక్తులు తమ వాహనానికి భిన్నమైన రూపాన్ని ఇవ్వడానికి, బయటి నుండి కారులో లైటింగ్‌ను ఏర్పాటు చేస్తారు. దీని కోసం మెకానిక్ వైరింగ్ కట్ చేయాలి. దాని కారణంగా వాహనంపై కంపెనీ ఇచ్చిన వారంటీ కూడా రద్దు అయిపోతుంది. కాబట్టి మీరు మీ కారులో కొన్ని మార్పులు చేసినప్పటికీ ఆ ప్రక్రియలో వైరింగ్ పాడు కాకూడదని గుర్తుంచుకోండి.
సీఎన్‌జీ కిట్‌ను ఇన్‌స్టాల్ చేయవద్దు
మీరు కొత్త కారును కొనుగోలు చేసి అందులో వెంటనే సీఎన్‌జీ కిట్‌ను ఇన్‌స్టాల్ చేయకండి. అలా అప్‌డేట్ చేస్తే వెంటనే వారంటీని కూడా కోల్పోతారు. కాబట్టి మీరు కంపెనీ అమర్చిన సీఎన్‌జీ కారుని కొనాలి లేదా కారు వారంటీ గడువు ముగిసే వరకు వేచి ఉండండి.
టైర్లు మార్చేటప్పుడు జాగ్రత్త
మీరు మీ వాహనం టైర్లను మార్చాలనుకుంటే, కొత్త టైర్ల సైజు ప్రస్తుతం ఉన్న వాటికి సరిపోలాలని గుర్తుంచుకోండి. ఒకవేళ షేప్ కానీ, సైజు కానీ మారిస్తే, దీన్ని మార్చిన వెంటనే కంపెనీ కారుపై కంపెనీ ఇచ్చే వారంటీ కూడా ముగిసిపోతుంది. దీని గురించి తెలుసుకోవడం ముఖ్యం.
కంపెనీ సర్వీస్ సెంటర్‌లో మాత్రమే సర్వీస్ చేయించాలి
కారు వారంటీలో ఉన్నప్పుడు కంపెనీ అధీకృత సర్వీస్ సెంటర్ నుంచి మాత్రమే ఈ సర్వీస్‌ను పొందండి. చాలా మంది కార్ల తయారీదారులు అలా చేయని పక్షంలో కారుపై అందించిన వారంటీని రద్దు చేస్తారు. ప్రయాణిస్తున్నప్పుడు మీ కారులో ఏదైనా సమస్య ఉంటే, అప్పుడు మీరు RSA (రోడ్ సైడ్ అసిస్టెన్స్) సహాయం తీసుకోవచ్చు. దాదాపు అన్ని కంపెనీలు ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి.