Diwali 2025 Car Buying Tips To Save Money: ఇండియాలో, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో, దీపావళి అంటే కేవలం వెలుగుల పండుగ & వేడుకల పండుగ మాత్రమే కాదు, కొత్త వాహనం కొనడానికి శుభ సమయంగా కూడా పరిగణిస్తారు. అందువల్ల, ఈ సమయంలో, కారు కంపెనీలన్నీ కస్టమర్లను ఆకర్షించడానికి చాలా ఆకర్షణీయమైన ఆఫర్లు & డిస్కౌంట్లను అందిస్తున్నాయి. మీరు ఈ దీపావళికి కొత్త కారు కొనాలని ఆలోచిస్తుంటే, కొన్ని స్మార్ట్ చిట్కాలు ఫాలో అయితే వేల రూపాయలను సులభంగా ఆదా చేయవచ్చు
ఆన్‌లైన్ & ఆఫ్‌లైన్ ధరలను సరిపోల్చండిఇప్పుడు అనేక ఆన్‌లైన్ పోర్టళ్లు & ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు కారు కొనుగోళ్లపై అదనపు ఆఫర్‌లను అందిస్తున్నాయి. ఈ ఆన్‌లైన్ పోర్టళ్లు & ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల్లోని ధరలు, సాధారణంగా, డీలర్‌షిప్‌ల కంటే తక్కువగా ఉంటాయి. అందువల్ల, కారు కొనడానికి ముందు ఆన్‌లైన్ & ఆఫ్‌లైన్ రెండింటిలోనూ ధరలను పోల్చడం ముఖ్యం.
మీ సెకండ్ హ్యాండ్ కారు మీద బెస్ట్ ప్రైస్ పొందండిమీరు ఇప్పటికే కారు కలిగి ఉంటే, ఈ దీపావళికి దానిని అమ్మి మరో కొత్త కారును కొనాలని భావిస్తుంటే, ఎక్సేంజ్ ఆఫర్ మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో, చాలా కంపెనీలు అధిక ఎక్స్ఛేంజ్ బోనస్‌లు అందిస్తున్నాయి, ఇది మీ పాత వాహనానికి మంచి ధరను పొందడానికి వీలు కల్పిస్తుంది. తద్వారా, ఆ డబ్బుతో కొత్త కారు కొని అదనపు పొదుపు చేయవచ్చు.
లోన్ & ఫైనాన్సింగ్ ఆఫర్లను చూడండిచాలా మంది కస్టమర్లు, కొత్త కారు కొనడానికి కార్ లోన్‌ను ఎంచుకుంటారు. దీపావళి సందర్భంగా, బ్యాంకులు & NBFCలు తక్కువ వడ్డీ రేట్లు, సున్నా ప్రాసెసింగ్ ఫీజుల సహా EMIల మీద మరికొన్ని ప్రత్యేక ఫైనాన్సింగ్ ఆఫర్‌లను అందిస్తున్నాయి. వివిధ బ్యాంకులు ఇస్తున్న ఆఫర్లను పోల్చి, తక్కువ వడ్డీ రేటు ఉన్న బ్యాంక్‌ను ఎంచుకోండి. దీని వల్ల, వడ్డీ రేట్లపై దీర్ఘకాలంలో వేల రూపాయలు ఆదా చేయవచ్చు.
డీలర్‌తో చర్చలు జరపడం మర్చిపోవద్దుకంపెనీ & డీలర్‌షిప్ స్థాయుల్లో ఆఫర్లను ముందే నిర్ణయించినప్పటికీ, డీలర్‌తో చర్చలు జరపడం ద్వారా మరికొన్ని అదనపు ప్రయోజనాలు పొందవచ్చు. ఉచిత యాక్సెసరీస్, ఉచిత బీమా, వారంటీ పొడిగింపు లేదా సర్వీసింగ్ ప్రయోజనాలు వంటి అదనపు ఫీచర్ల గురించి చర్చించవచ్చు.
ఇయర్-ఎండ్ స్టాక్ క్లియరెన్స్‌ను సద్వినియోగం చేసుకోండిదీపావళి తర్వాత సంవత్సరం ముగుస్తుంది & డీలర్లు పాత మోడళ్లను సాధ్యమైనంత త్వరగా అమ్మేయాలని చూస్తారు. ఈ సమయంలో, మీరు 2024 మోడల్ కారుపై గణనీయమైన తగ్గింపు పొందవచ్చు. ఫీచర్లు మారకపోయినా ధర విషయంలో గణనీయమైన తగ్గింపును మీరు దక్కించుకోవచ్చు.
సరైన సమయంలో బుక్ చేసుకోండిదీపావళికి ముందే బుక్ చేసుకుంటే, కంపెనీలు ముందస్తు కొనుగోలుదార్లకు ప్రత్యేక డిస్కౌంట్లు లేదా బహుమతులు అందిస్తాయి. పండుగ టైమ్‌లో, సకాలంలో కారు డెలివరీ కూడా జరుగుతుంది. ఎప్పటి లాగే ఈ సంవత్సరం కూడా, కారు కంపెనీలు క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు &ఆకర్షణీయమైన ఫైనాన్సింగ్ స్కీమ్‌లను ప్రవేశపెట్టాయి. మీరు సరైన ఆఫర్‌ను తెలివిగా ఎంచుకుంటే, మీ పాత కారుకు ఉత్తమ ధరను పొందొచ్చు. డీలర్‌తో చర్చలు జరిపితే కొత్త కారు మీద వేల రూపాయలను సులభంగా ఆదా చేసుకోవచ్చు & మీకు కావలసిన కారును ఇంటికి తీసుకురావచ్చు.