Royal Enfield Sales September 2025: సెప్టెంబర్‌ 2025 రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌కి చరిత్రలో నిలిచిపోయే నెలగా మారింది. ఆ ఒక్క నెలలోనే 1.24 లక్షలకు పైగా యూనిట్లు అమ్మి ఆల్‌టైమ్‌ హయ్యెస్ట్‌ రికార్డును ఈ కంపెనీ క్రియేట్‌ చేసింది.       

డొమెస్టిక్‌ మార్కెట్‌ నుంచి మెజారిటీ సపోర్ట్‌దేశీయ మార్కెట్లోనే రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ అత్యధిక డిమాండ్‌ కనబరిచింది. సెప్టెంబర్‌లో 1,13,573 యూనిట్లు సేల్‌ అవ్వగా, ఎగుమతులుగా 10,755 యూనిట్లను పంపింది. అంటే మొత్తం సేల్స్‌లో 91% దేశీయ మార్కెట్‌ నుంచి, ముఖ్యంగా యంగ్‌స్టర్స్‌ నుంచే వచ్చింది.        

సబ్‌ 350 cc - బలమైన వెన్నెముకరాయల్‌ ఎన్‌ఫీల్డ్‌కి సబ్‌ 350 cc మోడల్స్‌ మళ్లీ వెన్నెముకలా నిలిచాయి. ఈ విభాగంలో మొత్తం 1,07,478 యూనిట్లు అమ్ముడుపోయి, మొత్తం సేల్స్‌లో 86% వాటా సాధించాయి. వీటి సేల్స్‌ గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే 42% వృద్ధి చెందింది. 350 cc పైబడి ఉన్న మోడల్స్‌ కూడా మంచి పెరుగుదల సాధించాయి, 16,850 యూనిట్ల విక్రయాలతో 45% గ్రోత్‌ రికార్డ్‌ చేశాయి.        

విభాగం

2025 సెప్టెంబర్‌ సేల్స్‌

2024 సెప్టెంబర్‌ సేల్స్‌

ఏడాది వ్యవధిలో వృద్ధి %

350cc ఇంజిన్‌ లోపు

1,07,478

75,331

42.67

350cc ఇంజిన్‌ కంటే ఎక్కువ

16,850

11,647

44.67

దేశీయ అమ్మకాలు

1,13,573

79,326

43.17

ఎగుమతులు

10,755

7,652

40.55

మొత్తం

1,24,328

86,978

42.94

ఏడాది ప్రాతిపదికన వృద్ధిసరిగ్గా ఏడాది క్రితం, అంటే, 2024 సెప్టెంబర్‌లో 86,978 యూనిట్లు అమ్మిన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, 2025 సెప్టెంబర్‌లో 1.24 లక్షలకు దూసుకెళ్లింది. ఏడాదిలో ఇది 42.94% YoY వృద్ధి. ఎగుమతుల పరంగా కూడా మంచి ప్రగతి కనబర్చింది, గత ఏడాదితో పోలిస్తే 40% పెరిగింది.       

క్వార్టర్లీ సేల్స్‌లో కంటిన్యూ అవుతున్న పాజిటివ్‌ ట్రెండ్‌2005-26 రెండో త్రైమాసికంలో (2025 జులై-సెప్టెంబర్‌ కాలం) రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మొత్తం 3,26,375 యూనిట్లు విక్రయించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇప్పుడు 43% ఎక్కువ టూవీలర్లు అమ్ముడయ్యాయి. 2005-26 మొదటి ఆరు నెలల్లో, అంటే, 2025 ఏప్రిల్‌-సెప్టెంబర్‌ కాలంలో 5,91,903 యూనిట్లు అమ్మబడగా, 2024 ఏప్రిల్‌-సెప్టెంబర్‌ కాలంలో 4,54,779 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.   

    

ఫెస్టివ్‌ సీజన్‌ & GST 2.0 ప్రభావంGST 2.0 సంస్కరణల వల్ల ధరలు తగ్గడం, ఫెస్టివ్‌ సీజన్‌లో బైక్‌ల డిమాండ్‌ పెరగడం - ఈ రెండు ఫ్యాక్టర్లు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌కి డబుల్‌ బూస్ట్‌ ఇచ్చాయి.     

చెన్నై బేస్‌గా పని చేస్తున్న రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, త్వరలోనే 350 cc, 450 cc, 650 cc సెగ్మెంట్లలో కొత్త మోడల్స్‌తో పాటు ఎలక్ట్రిక్‌ బైక్‌ రేంజ్‌ను కూడా మార్కెట్లోకి తీసుకురానుంది. మొత్తంగా చూస్తే, 2025 సెప్టెంబర్‌ సేల్స్‌తో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మళ్లీ తన లీడర్‌షిప్‌ని ప్రూవ్‌ చేసుకుంది. యువతరానికి ఈ బైకులపై ఎంత మోజు ఉందో, ధరలు అందుబాటులోకి వస్తే సేల్స్‌ ఏ రేంజ్‌లో పెరుగుతాయో చెప్పడానికి ఈ గణాంకాలు చాలు. రాబోయే నెలల్లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ సేల్స్‌ మరింత పెరుగుతాయని మార్కెట్‌ ఎక్స్‌పర్ట్స్‌ అంచనా వేస్తున్నారు.