Kwid vs Alto K10: మీ చిన్న కుటుంబం కోసం తక్కువ బడ్జెట్‌లో మంచి కారును వెతుకుతుంటే, ఈ వివరాలు మీకు హెల్ప్ అవుతాయి. చిన్న కుటుంబానికి ఖచ్చితంగా సరిపోయే 2 బడ్జెట్ కార్ల వివరాలు ఇక్కడ అందిస్తున్నాం. మీరు బడ్జెట్ కారును చూస్తున్నట్లయితే, మీరు రెనాల్ట్ కొత్త క్విడ్, మారుతి ఆల్టో కె10 లపై నమ్మకం ఉంచవచ్చు. రెనాల్ట్ క్విడ్ ఇటీవల కొత్త అవతారంలో లాంచ్ అయింది. ఆ తర్వాత ఈ రెండింటి మధ్య పోటీ మరింత పెరిగింది. మరి మీ కోసం క్విడ్, ఆల్టో కె10 లలో ఏ కారు బెస్ట్ అనేది ఈ వివరాలు చూసి కన్ఫామ్ చేసుకోండి. 

Continues below advertisement

రెనాల్ట్ క్విడ్ ఎంతవరకు మారింది?

రెనాల్ట్ తన కొత్త క్విడ్‌లో పెద్దగా మార్పులేమీ చేయలేదు. కేవలం లుక్‌కి కొద్దిగా కొత్త టచ్ ఇచ్చి, కొత్త లోగోను అమర్చిందని చెప్పవచ్చు. రెనాల్ట్ కంపెనీ దీని ప్రారంభ ధరను రూ. 4.53 లక్షలకు తగ్గించింది, అయితే ఇప్పుడు ఇందులో కేవలం రెండు వేరియంట్లు మాత్రమే లభిస్తాయి. వేరియంట్లు తక్కువగా ఉండటం వల్ల క్విడ్‌ను కొనుగోలు చేయడం ఇప్పుడు కొంచెం ఇబ్బందికర వ్యవహారంగా అనిపించవచ్చు.

Continues below advertisement

కారులో మీకు పాత 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ వస్తుంది. ఇది మ్యాన్యువల్, ఏఎమ్‌టి (AMT) గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఫీచర్ల పరంగా 8 ఇంచుల టచ్‌స్క్రీన్ దీనిని నేటికీ ట్రెండీగా ఉంచుతుంది.

సేఫ్టీ పరంగా ఏ కారు బెస్ట్?కారు కొనే ముందు ప్రజలు మైలేజీతో పాటు సేఫ్టీపై ఫోకస్ చేస్తారు. రెనాల్ట్ కొత్త క్విడ్ బేస్ వేరియంట్‌లో కేవలం రెండు ఎయిర్‌బ్యాగ్‌లు మాత్రమే లభిస్తాయి. అయితే 6 ఎయిర్‌బ్యాగ్‌ల కోసం మీరు టాప్ వేరియంట్‌ను మాత్రమే కొనుగోలు చేయాలి. 2026 సంవత్సరంలో స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లను అందించకపోవడం క్విడ్ బలహీనతగా అనిపిస్తుంది.

Also Read: యమహా నుంచి త్వరలో కొత్త స్పోర్ట్స్ బైక్.. KTM RC200కు పెరిగిన పోటీ- YZF-R2 ప్రత్యేకతలివే

మరోవైపు మారుతి ఆల్టో కె10 తన సేఫ్టీ విషయానికొస్తే మరింత జాగ్రత్తలు తీసుకున్నారు. మీకు మెరుగైన సేఫ్టీ ఫీచర్లు లభిస్తాయి. కుటుంబ జర్నీకి సేఫ్టీ పరంగా ఆల్టో పైచేయి సాధిస్తుంది.

మైలేజీలో నిజమైన ఎవరు బెస్ట్?ఏ కస్టమర్ అయినా కారు కొనే ముందు అది ఎంత మైలేజ్ ఇస్తుందో తప్పక తెలుసుకోవాలి. దాంతో మీకు మెయింటనెన్స్ ఖర్చులపై అవగాహన వస్తుంది. ఆల్టో కె10 కారు 1.0 లీటర్ ఇంజన్ క్విడ్‌తో పోలిస్తే చాలా రెస్పాన్సివ్‌గా, నడపడానికి ఈజీగా  ఉంటుందని చెప్పాలి. మైలేజ్ పరంగా కూడా ఆల్టో చాలా ముందుంది.

క్విడ్ లీటరుకు 22.5 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుండగా, ఆల్టో కె10 ఏకంగా 24.9 కిలోమీటర్ల మైలేజీతో ప్రూవ్ చేసుకుంది. ప్రతిరోజూ ప్రయాణంలో ఆల్టో మీ పెట్రోల్ డబ్బును చాలా వరకు ఆదా చేస్తుంది.

ఏ కారు కొంటే మంచిది..

ఇప్పుడు రెండు కార్ల ధరలు తెలుసుకోవాలి. మారుతి ఆల్టో కె10 కేవలం రూ. 3.7 లక్షల ప్రారంభ ధరలోనే లభిస్తుంది. ఇది క్విడ్ (4.53 లక్షలు) కంటే చాలా చౌక. రెనాల్ట్ క్విడ్‌లో మీకు కొంచెం ఎక్కువ కేబిన్ స్పేస్, మస్కులర్ లుక్, మంచి టచ్‌స్క్రీన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Also Read:  Honda కార్‌ కొనాలనుకునేవారికి గుడ్‌ న్యూస్ - Elevate, Amazeపై రూ.2.15 లక్షల వరకు డిస్కౌంట్లు

తక్కువ బడ్జెట్‌లో అద్భుతమైన పర్ఫార్మెన్స్, ఎక్కువ మైలేజ్, బలమైన సేఫ్టీని కోరుకుంటే, ఆల్టో కె10 మీకు వాల్యూ ఫర్ మనీ, స్మార్ట్ ఛాయిస్‌గా నిలుస్తుంది.