భారత్‌లో ఎస్‌యూవీ మార్కెట్‌లో పోటీ బాగా పెరుగుతోంది. ప్రస్తుతం కస్టమర్లు కేవలం మంచి డిజైన్ లేదా కొత్త లాంచ్‌లను చూసి మాత్రమే అట్రాక్ట్ కావడం లేదు. మెరుగైన మైలేజ్, మోడ్రన్ ఫీచర్లు, సీఎన్‌జీ (CNG), హైబ్రిడ్ వంటి ఇంధన ఆప్షన్లపై సైతం ఫోకస్ చేస్తున్నారు. మే 2026 నాటి కార్ల విక్రయాల లెక్కలను పరిశీలిస్తే... కేవలం హైప్, ముందస్తు అంచనాల వల్లే ఏ ఎస్‌యూవీ కూడా మార్కెట్‌లో సక్సెస్ సాధించలేదని స్పష్టమవుతోంది. కస్టమర్ల అవసరాలను అర్థం చేసుకోవడం, సరైన పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు ఇవ్వడం నేడు అత్యంత కీలకంగా మారింది.

Continues below advertisement

కొత్తగా మార్కెట్లోకి వచ్చిన రెనాల్ట్ డస్టర్ (Renault Duster) పై మార్కెట్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. మే 2026లో డస్టర్ కార్ల అమ్మకాలు కంపెనీని తీవ్ర నిరాశను మిగిల్చాయి. కొత్తగా లాంచ్ అయినప్పటికీ డస్టర్ కేవలం 1,267 యూనిట్లు మాత్రమే విక్రయించింది. ఈ మోడల్‌లోని 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో పాటు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ లేకపోవడమే విక్రయాల్లో జోరు తగ్గడానికి ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుత పోటీ మార్కెట్లో మిగిలిన కంపెనీలు డ్రైవింగ్ సౌలభ్యం కోసం ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అందిస్తున్నాయి. దీనికి తోడు రెనాల్ట్ డస్టర్‌లో ప్రస్తుతం హైబ్రిడ్ వెర్షన్ అందుబాటులో లేకపోవడం అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపింది.

Also Read: దేశంలో అత్యంత చవకైన MG Comet EVపై 80 వేలు డిస్కౌంట్.. ఫుల్ ఛార్జ్‌తో 230 KM రేంజ్‌

Continues below advertisement

టాటా సియెర్రా అమ్మకాలు ఎలా ఉన్నాయి?సరికొత్త టాటా సియెర్రా (Tata Sierra) మార్కెట్‌లో తన పట్టును పెంచుకుంటోంది. మే 2026 నెలలో సియెర్రా ఏకంగా 6,606 యూనిట్ల విక్రయాలతో సత్తా చాటింది. రాబోయే రోజుల్లో సియెర్రా ఈవీ (Tata Sierra EV) కూడా లాంచ్ కానుండటంతో ఈ కారు మొత్తం అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది. భారత్‌లో ఎలక్ట్రిక్ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌ తో టాటా మోటార్స్ ఈ ఈవీ వెర్షన్‌పై భారీగా ఆశలు పెట్టుకుంది.

ఏ కార్లు ఎన్ని అమ్ముడయ్యాయి ?కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో మారుతి సుజుకి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్ హవాను కొనసాగిస్తున్నాయి. మే నెలలో గ్రాండ్ విటారా 10,853 యూనిట్లు అమ్ముడవ్వగా, కియా సెల్టోస్ 10,597 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. గ్రాండ్ విటారా విజయానికి అందులోని సీఎన్‌జీ, స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్లు ఎంతగానో దోహదం చేశాయి. పెరుగుతున్న ఇంధన ధరల పెరుగుదలతో మెరుగైన మైలేజ్, తక్కువ మెయింటనెన్స్, రన్నింగ్ కాస్ట్ వాహనాల వైపే కస్టమర్లు ఫోకస్ చేస్తున్నారు. 

Also Read: Bike Reserve: రిజర్వ్‌ పడ్డాక మీ బైక్‌ ఎంత దూరం వెళ్తుంది.. దీనివల్ల ఇంజిన్‌‌కు నష్టమా ?

ఇక మిడ్-సైజ్, లార్జ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో మహీంద్రా స్కార్పియో (Mahindra Scorpio), హ్యుందాయ్ క్రెటా తమ ఆధిపత్యాన్ని చాటుకున్నాయి. ఈ 2 మోడళ్లు నెలవారీ అమ్మకాల్లో 15,000 యూనిట్ల మార్కును దాటాయి. స్ట్రాంగ్ బ్రాండ్ ఇమేజ్, ఎక్కువ ఇంజన్ ఆప్షన్లు, విస్తృతమైన డీలర్ నెట్‌వర్క్ వీరి విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్‌ఓ (XUV 7XO) సైతం 9,338 యూనిట్ల అమ్మకాలతో అద్భుత ప్రదర్శన చేసింది. కాగా గ్రాండ్ విటారా మరోసారి 9,366 యూనిట్లతో తన పాపులారిటీని నిరూపించుకుంది. ఈ లెక్కలు  చూస్తే.. స్టైల్‌తో పాటు తక్కువ ఇంధన ఖర్చు, ఎక్కువ పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు ఇచ్చే SUV లకు భారత కస్టమర్లు ప్రియారిటీ ఇస్తున్నారని స్పష్టమవుతోంది.