Renault June 2026 Campaign Offers Huge Benefits On Cars: ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో ఫ్రెంచ్ కార్ మేకర్ రెనాల్ట్ సరికొత్త ఆఫర్లతో కస్టమర్ల ముందుకు వచ్చింది. జూన్ 1 నుంచి జూన్ 15, 2026 వరకు జరిగే ఈ క్యాంపెయిన్ లో క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, స్క్రాపేజ్ ఇన్సెంటివ్స్ అందిస్తోంది. మోడల్‌ను బట్టి రూ.20,000 నుంచి రూ.40,000 వరకు డైరెక్ట్ క్యాష్ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఎక్స్ఛేంజ్, లాయల్టీ, కార్పొరేట్ బెనిఫిట్స్ కలిపితే ఈ ఆఫర్ వాల్యూ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే కస్టమర్లు 0 శాతం ఫైనాన్స్ స్కీమ్ లేదా క్యాష్ డిస్కౌంట్లలో ఏదో ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.

Continues below advertisement

Read Also: India Enters E85 Fuel Era: దేశంలో కొత్త ఇంధన విప్లవం, రూ.20 తక్కువకే లీటర్ పెట్రోల్.. అయితే ఈ ట్విస్ట్ తెలుసుకోకపోతే నష్టపోతారు!

కైగర్‌పై అత్యధిక బెనిఫిట్స్..రెనాల్ట్ కైగర్ (Kiger) ఎస్‌యూవీపై ఈ నెలలో అత్యధికంగా ఆఫర్స్ ఉన్నాయి. దీనిపై రూ.40,000 వరకు క్యాష్ బెనిఫిట్ లేదా 0 శాతం ఇంట్రెస్ట్ ఫైనాన్స్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. దీనితో పాటు రూ.25,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.15,000 లాయల్టీ బెనిఫిట్, రూ.10,000 కార్పొరేట్ డిస్కౌంట్, రూ.25,000 వర్త్ 'రిలైవ్' స్క్రాపేజ్ ఇన్సెంటివ్ లభిస్తాయి. మొత్తం కలిపి కైగర్‌పై రూ.1.15 లక్షల వరకు లాభం పొందవచ్చు. తమిళనాడులో కార్పొరేట్ డిస్కౌంట్ ఎక్కువగా ఉండటంతో అక్కడ మొత్తం బెనిఫిట్ రూ.1.20 లక్షల వరకు ఉంది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.5.81 లక్షల నుంచి రూ.10.34 లక్షల మధ్య ఉంటుంది. ఇది మారుతి బ్రెజ్జా, కియా సోనెట్, టాటా నెక్సాన్ లాంటి మోడళ్లకు గట్టి పోటీ ఇస్తోంది.

Continues below advertisement

Read Also: Tata Tiago Facelift VS Maruti Suzuki Cars: మారుతి స్విఫ్ట్‌కు పోటీగా టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్, కేవలం టాటా కార్లలో మాత్రమే లభించే టాప్ ఫీచర్స్ ఇవే

ట్రైబర్ స్టాక్‌పై ప్రత్యేక స్కీమ్స్.రెనాల్ట్ ట్రైబర్ (Triber) మోడల్‌కు ఎంవై26 (MY26), ప్రీ-ఎంవై26 స్టాక్‌ను బట్టి వేర్వేరు ఆఫర్లు ఉన్నాయి. కొత్త ఎంవై26 మోడళ్లకు 0 శాతం ఇంట్రెస్ట్ లేదా రూ.25,000 వరకు క్యాష్ బెనిఫిట్ లభిస్తుండగా, పాత స్టాక్‌పై రూ.35,000 వరకు క్యాష్ ఆఫర్ ఉంది. అదనంగా రూ.15,000 ఎక్స్ఛేంజ్ సపోర్ట్, రూ.10,000 కార్పొరేట్ డిస్కౌంట్, రూ.25,000 స్క్రాపేజ్ ఇన్సెంటివ్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.5.81 లక్షల నుంచి రూ.8.48 లక్షల వరకు ఉంటుంది.

ఎంట్రీ లెవెల్ క్విడ్‌పై డిస్కౌంట్లు..బడ్జెట్ కారు రెనాల్ట్ క్విడ్ (Kwid) పై రూ.20,000 వరకు క్యాష్ బెనిఫిట్ లేదా 0 శాతం ఇంట్రెస్ట్ ఫైనాన్స్ సదుపాయం కల్పించారు. దీనితో పాటు రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.10,000 కార్పొరేట్ డిస్కౌంట్, రూ.25,000 స్క్రాపేజ్ ఇండస్ట్రీ బెనిఫిట్స్ లభిస్తాయి. క్విడ్ ఎక్స్-షోరూమ్ ధర రూ.4.30 లక్షల నుంచి రూ.5.88 లక్షల వరకు ఉంటుంది. ఇది మారుతి ఆల్టో కే10, ఎస్-ప్రెస్సో కార్లకు పోటీగా నిలుస్తోంది. లొకేషన్, వేరియంట్, డీలర్‌షిప్ స్టాక్‌ను బట్టి ఆఫర్లలో మార్పులు ఉండే ఛాన్స్ ఉంది.